తైవాన్ : ప్రముఖ మొబైళ్ల తయారీ సంస్థ అసుస్ సోమవారం మూడు మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది. జెన్ సిరీస్ లోని జెన్‌ఫోన్ 3, జెన్‌ఫోన్ 3 డీలక్స్, జెన్‌ఫోన్ 3 అల్ట్రా పేరుతో మూడు స్మార్ట్ ఫోన్లను తైపీలో లాంచ్ చేసింది. డిఫరెంట్ సైజులు, స్పెసిఫికేషన్స్ తో యూజర్లను ఆకట్టుకునేలా వీటిని రూపొందించింది. మెటల్ బాడీలతో, ఫోన్ వెనకాల ఎంబెడ్ చేసిన ఫింగర్ ప్రింట్ సపోర్ట్ , 8 మెగా పిక్సెల్ సెల్పీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, డ్యూయల్ సిమ్ లతో ఈ మూడు ఫోన్లూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
జెన్ ఫోన్3
5.5 అంగుళాల తాకే తెర
1080×1920 పిక్సల్స్ రిజల్యూషన్
ధర సుమారు రూ.16,700
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ
4జీబీ ర్యామ్
స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
64జీబీ ఇంటర్నల్ మెమొరీ
16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
గోల్డ్, బ్లూ, బ్లాక్ అండ్ వైట్ కలర్స్ అందుబాటులో ఉంది.
జెన్‌ఫోన్ 3 డీలక్స్
5.7 ఇంచెస్ స్క్రీన్
1080×1920 పిక్సల్స్ రిజల్యూషన్
ధర దాదాపుగా రూ.33,500
స్నాప్‌డ్రాగన్ 820 ఎస్‌ఓసీ ప్రాసెసర్
6 జీబీ ర్యామ్
64జీబీ ఇంటర్నల్ మెమొరీ
ఎస్డీ కార్డుతో మెమొరీని 256జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ
23 మెగాపిక్సల్ రేర్ కెమేరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
గోల్డ్, సిల్వర్, యాష్ కలర్స్ లో లభిస్తోంది.
జెన్‌ఫోన్ 3 అల్ట్రా
6.8 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే
1920×1080 పిక్సెల్స్ రిజల్యూషన్
ధర దాదాపుగా రూ. 32,200
స్నాప్‌డ్రాగన్ 625 ఎస్‌ఓసీ ప్రాసెసర్
64జీబీ ఇంటర్నెల్ మెమొరీ
ఎస్డీ కార్డుతో మెమొరీని 128 జీబీ పెంచుకునే సదుపాయం
23 మెగాపిక్సెల్ రియర్ కెమేరా
4600 ఎంఏహెచ్ బ్యాటరీ
గోల్డ్, సిల్వర్, పింక్ యాష్ కలర్స్ లో లభిస్తోంది.
వరుసగా మూడు స్మార్ట్ ఫోన్ల లాంచ్
Published Mon, May 30 2016 3:57 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM
Advertisement
Advertisement