ప్రపంచంలో తొలి 20 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ మొబైల్ | ZTE May Be Working on a 20GB RAM SmartPhone | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో తొలి 20 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ మొబైల్

Published Fri, Jul 2 2021 6:40 PM | Last Updated on Fri, Jul 2 2021 8:11 PM

ZTE May Be Working on a 20GB RAM SmartPhone - Sakshi

ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక ర్యామ్ గల స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన కంపెనీలు అసుస్, లెనోవో. ఈ రెండు కంపెనీలు మొబైల్ లో అత్యధికంగా 18 జీబీ ర్యామ్ ని తీసుకొచ్చాయి. ఇప్పుడు అంతకు మించి ర్యామ్ తో జడ్​టీఈ కంపెనీ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో 20జీబీ ర్యామ్ తీసుకొస్తున్నట్లు సమాచారం. చైనా కంపెనీ జడ్​టీఈ దీని గురుంచి ఎటువంటి అధికారిక సమాచారం బయటకి వెల్లడించలేదు. ఆ సంస్థలో పనిచేసే ఎగ్జిక్యూటివ్ లలో ఒకరు ఆన్ లైన్ లో దీని గురుంచి లీక్ చేశారు. 

20జీబీ ర్యామ్ ఫోన్ తీసుకురావడం ద్వారా జడ్​టీఈ కంపెనీ తన ప్రత్యర్థి కంపెనీలకు దక్షిణాసియా మార్కెట్లో పోటీ ఇవ్వాలని చూస్తుంది. ఈ సంవత్సరం చివరి వరకు అండర్-డిస్ ప్లే సెల్ఫీ కెమెరా ఫోన్లను తీసుకొని రావాలని కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది. జడ్​టీఈ డైరెక్టర్లలో ఒకరైన లూ క్వియాన్ హావో వీబోలో కంపెనీ 20జీబీ ర్యామ్ ఫోన్ ను టీజ్ చేశారు. వచ్చే ఏడాది 1 టీబీ స్టోరేజీతో ఫోన్లు తీసుకొనిరావచ్చు అని ఎగ్జిక్యూటివ్ సూచించారు. ఖచ్చితమైన లాంఛ్ వివరాలు లేనప్పటికి భవిష్యత్తులో 20జీబీ ర్యామ్ ఫోన్ ను తీసుకురావచ్చని తెలుస్తుంది. అలాగే, అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరా కోసం పనిచేస్తున్న పెద్ద కంపెనీల్లో జడ్​టీఈ ఒకటి.

చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement