భారత్‌లోకి జెన్‌ఫోన్ 4 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు
భారత్‌లోకి జెన్‌ఫోన్ 4 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు
Published Thu, Sep 7 2017 5:25 PM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM
తైవాన్‌కు చెందిన కంప్యూటర్, ఫోన్ హార్డ్‌వేర్ కంపెనీ ఆసుస్, జెన్‌ఫోన్ 4 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను భారత్‌లోకి తీసుకొస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆహ్వానాలను కూడా కంపెనీ పంపుతోంది. సెప్టెంబర్ 14న జరుగబోయే ఈవెంట్‌లో వీటిని లాంచ్‌చేయనున్నట్టు తెలుస్తోంది. జెన్‌ఫోన్ 4 సిరీస్ కింద ఆరు స్మార్ట్‌ఫోన్లను ఆసుస్ గత నెలలోనే తైవాన్‌లో ఆవిష్కరించింది. అవి జెన్‌ఫోన్ 4 ప్రొ, జెన్‌ఫోన్ 4, జెన్‌ఫోన్ 4 సెల్ఫీ, జెన్‌ఫోన్ 4 సెల్ఫీ ప్రొ, జెన్‌ఫోన్ 4 మ్యాక్స్, జెన్‌ఫోన్ 4 మ్యాక్స్ ప్రొలు. అయితే వచ్చే వారంలో నిర్వహించబోతున్న ఈవెంట్‌లో ఏ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తుందో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. మొత్తం ఆరు స్మార్ట్‌ఫోన్లలు జెన్‌ఫోన్ 4, జెన్‌ఫోన్ 4 ప్రొ రెండు ఫ్లాగ్‌షిప్ డివైజ్‌లు. జెన్‌ఫోన్ 4 సెల్ఫీ, జెన్‌ఫోన్ 4 సెల్ఫీ ప్రొ మధ్యతరహా ఫోన్లు. అదేవిధంగా జెన్‌ఫోన్ 4 మ్యాక్స్, జెన్‌ఫోన్ 4 మ్యాక్స్ ప్రొలు పెద్ద బ్యాటరీ కలిగిన డివైజ్‌లు.
వీటి ఫీచర్ల విషయానికొస్తే.. జెన్‌ఫోన్ 4, జెన్‌ఫోన్ 4 ప్రొలు కొన్ని హార్డ్‌వేర్ అంశాలకు మినహా మిగతావన్నీ సమానంగా ఉన్నాయి. జెన్‌ఫోన్ 4 ప్రొ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్‌ఓసీతో పాటు 6జీబీ ర్యామ్‌ను, 128జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. జెన్‌ఫోన్ 4 రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి వచ్చింది. స్నాప్‌డ్రాగన్ 630ఎస్‌ఓసీ, స్నాప్‌డ్రాగన్ 660 ఎస్‌ఓసీతో 6జీబీ ర్యామ్‌ను, 64జీబీ స్టోరేజ్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. ఫోటోగ్రఫీని తీసుకుంటే, డ్యూయల్ కెమెరా లెన్స్‌లో వెనుకవైపు 12ఎంపీ, 8ఎంపీ సెన్సార్స్‌తో జెన్‌ఫోన్ 4 ను కంపెనీ లాంచ్‌చేసింది. ప్రొ వేరియంట్ వెనుకవైపు 16ఎంపీ, 12ఎంపీ సెన్సార్లను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లకు 8మెగాపిక్సల్‌తోనే సెల్ఫీ కెమెరా. ఇక జెన్‌ఫోన్ 4 మ్యాక్స్, జెన్‌ఫోన్ 4 మ్యాక్స్ ప్రొ స్మార్ట్‌ఫోన్లకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యముంది. సెల్ఫీ సెంట్రిక్‌తో వచ్చిన జెన్‌ఫోన్ 4 సెల్ఫీ, సెల్ఫీ ప్రొ స్మార్ట్‌ఫోన్లు 20ఎంపీ, 24ఎంపీ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉన్నాయి.
Advertisement
Advertisement