Asus Chromebook, C214 And C423 Intel Celeron Processors Launched in India - Sakshi
Sakshi News home page

Asus: అతి​ తక్కువ ధరకే క్రోమ్‌బుక్‌ ల్యాప్‌టాప్స్‌..!

Published Thu, Jul 15 2021 4:05 PM | Last Updated on Fri, Jul 16 2021 1:47 AM

Asus Launches Intel Celeron Processor Chromebooks In India - Sakshi

తైవాన్‌కు చెందిన ఎల్రక్టానిక్స్‌ ఉపకరణాల తయారీ కంపెనీ ఆసుస్‌ కొత్తగా క్రోమ్‌​బుక్‌ ల్యాప్‌టాప్‌ మోడళ్లను భారత మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది. ఆసుస్ క్రోమ్‌​బుక్‌ ఫ్లిప్ సీ214, క్రోమ్‌​బుక్‌ సీ423, క్రోమ్‌​బుక్‌ సీ523, క్రోమ్‌బుక్‌ సీ223 ల్యాప్‌టాప్ మోడళ్లను  ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో ఆసుస్‌ కంపెనీ ప్రారంభించింది. ఈ ల్యాప్‌టాప్‌ మోడళ్లు గూగుల్‌కు చెందిన క్రోమ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌(Chrome OS)తో పనిచేయనున్నాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఆసుస్‌ కొత్తగా క్రోమ్‌బుక్‌లను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసినట్లు తెలుస్తోంది.

యుఎస్, ఇతర ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చిన తరువాత మొదటిసారిగా భారత మార్కెట్లోకి ఆసుస్‌ రిలీజ్‌ చేసింది. ఆసుస్ క్రోమ్‌బుక్‌ సీ423, క్రోమ్‌బుక్‌ సీ523 టచ్,  నాన్-టచ్ డిస్ప్లే ఎంపికలతో రానున్నాయి. ఆసుస్ క్రోమ్‌​బుక్‌ ఫ్లిప్ సీ214 ధర రూ. 23,999. ఆసుస్‌ క్రోమ్‌ బుక్‌ సీ423 నాన్‌ టచ్‌ మోడల్‌ ధర రూ.19,999. టచ్‌ మోడల్‌ ధర రూ. 23,999. ఆసుస్‌ క్రోమ్‌ బుక్‌ సీ523 నాన్‌ టచ్‌ మోడల్‌ ధర రూ.20,999, టచ్‌ మోడల్‌ ధర రూ. 24,999. ఆసుస్‌ క్రోమ్‌బుక్‌ సీ223 అతి తక్కువ ధర రూ. 17,999గా నిర్ణయించింది. ఈ ల్యాప్‌టాప్‌ క్రోమ్‌ బుక్‌ మోడళ్లు జూలై 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

ఆసుస్‌ క్రోమ్‌బుక్‌ ఫ్లిప్‌ సీ214 ఫీచర్లు

  • 11.6 అంగుళాల ఆంటీగ్లేర్‌ టచ్‌ డిస్‌ప్లే
  • డ్యూయల్‌ కోర్‌ ఇంటెల్‌ సెలెరాన్ ఎన్ 4020 ప్రాసెసర్
  • ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్ 600
  • 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ
  • 50Whr బ్యాటరీ

ఆసుస్‌ క్రోమ్‌బుక్‌  సీ423 ఫీచర్లు

  • 14 అంగుళాల టచ్‌ డిస్‌ప్లే(ఆప్షనల్‌)
  • ఇంటెల్ హెచ్‌డి గ్రాఫిక్స్ 500 
  • ఇంటెల్ సెలెరాన్ ఎన్ 3350 ప్రాసెసర్
  • 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ
  • 38Whr బ్యాటరీ

ఆసుస్‌ క్రోమ్‌బుక్‌ సీ523 ఫీచర్లు

  • 15.6 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
  • ఇంటెల్‌ సెలెరాన్‌ ఎన్‌ 3350 డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌
  • ఇంటెల్‌ హెచ్‌డీ గ్రాఫిక్స్‌ 500
  • 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ
  • 38Whr బ్యాటరీ

ఆసుస్‌ క్రోమ్‌బుక్‌ సీ223 ఫీచర్లు

  • 11.6 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
  • ఇంటెల్‌ సెలెరాన్‌ ఎన్‌3350 డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌
  • ఇంటెట్‌ హెచ్‌డీ గ్రాఫిక్స్‌ 500
  • 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ
  • 38Whr బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement