ఆసుస్ ఫ్యామిలీలోకి జంట ఫోన్లు
తైవనీస్ మల్టీనేషనల్ కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఆసుస్ ఫ్యామిలీలోకి మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు వచ్చి చేరాయి. ప్రస్తుత తరం జెన్ ఫోన్ 2 లేజర్, జెన్ ఫోన్ మ్యాక్స్ ల అప్ గ్రేడింగ్ తో, ఆసుస్ రెండు కొత్త జెన్ ఫోన్3 ..వేరియంట్లను మార్కెట్లోకి ఆవిష్కరించింది. జెన్ ఫోన్ 3 లేజర్, జెన్ ఫోన్ 3 మ్యాక్స్ పేర్లతో వీటిని ప్రవేశపెట్టింది. అయితే ఈ ఫోన్లు కేవలం వియత్నాంలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. గ్లోబల్ గా ఎప్పుడు తీసుకొస్తామనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ రెండు ఫోన్లు ఫ్రంట్ 2.5డీ గ్లాస్ కర్వ్ తో మొత్తం మెటల్ యూనిబాడీతోనే రూపొందించారు. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగిఉన్నాయి.
జెన్ ఫోన్ 3 లేజర్ ధర దాదాపు రూ.17,974లని అంచనా..
జెన్ ఫోన్ 3 మ్యాక్స్ ధర దాదాపు రూ.13,480లని అంచనా..
జెన్ ఫోన్ 3 లేజర్ ఫీచర్లు...
5.5 అంగుళాల డిస్ ప్లే
ఆల్ట్రా-ఫాస్ట్ 0.03ఎస్ లేజర్ ఆటో ఫోకస్
13 మెగా పిక్సెల్ ఫిక్సెల్ మాస్టర్ 3.0 కెమెరా వెనుక కెమెరా
ఈఐఎస్ బ్లర్-ఫ్రీ వీడియో రికార్డింగ్
కలర్ కరెక్షన్ సెన్సార్
0.2 సెకన్లలో సూపర్ ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ అన్ లాక్
4జీబీ ర్యామ్
32జీబీ ఇంటర్నెల్ మెమరీ
ఫింగర్ ప్రింట్ సెన్సార్
7.9ఎంఎం థిక్ నెస్
జెన్ ఫోన్ 3 మ్యాక్స్ ఫీచర్లు..
5.2 అంగుళాల డిస్ ప్లే
4100 ఎంఏహెచ్ బ్యాటరీ
3జీబీ ర్యామ్
32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
క్విక్ ఫింగర్ ప్రింట్ స్కానర్
0.2 సెకన్ల ఫింగర్ ప్రింట్ అన్ లాక్
కంపెనీ ఇటీవలే తైవాన్ లో జెన్ ఫోన్ 3, జెన్ ఫోన్ 3 ఆల్ట్రా ఫోన్లను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.