Low-cost clip can monitor BP using your smartphone - Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్‌లో బీపీ చూసుకోవచ్చు.. ధర రూ. 10 కంటే తక్కువ

Published Sun, Jun 11 2023 11:42 AM | Last Updated on Sun, Jun 11 2023 11:49 AM

Low cost bp clip using your smartphone - Sakshi

బీపీ రీడింగ్‌ కోసం క్లినిక్‌లకు వెళ్లక్కర్లేదు. ఇంట్లో పెద్ద పెద్ద బీపీ మానిటర్లు ఉంచుకోనక్కర్లేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వేలికి తొడుక్కునే ఈ చిన్న క్లిప్‌ ఉంటే చాలు, ఇంచక్కా స్మార్ట్‌ఫోన్‌లోనే ఎప్పటికప్పుడు బీపీ రీడింగ్‌ ఎంతో తేలికగా తెలుసుకోవచ్చు. ‘బీపీ క్లిప్‌’ పేరుతో కాలిఫోర్నియా యూనివర్సిటీలోని ‘డిజిటల్‌ లాబ్‌’ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ పరికరం ద్వారా బీపీ మాత్రమే కాకుండా, రక్తంలోని ఆక్సిజన్‌ స్థాయి, గుండె వేగం వంటి వివరాలను కూడా చాలా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. 

ఇది త్రీడీ ప్రింటర్‌ ద్వారా ముద్రించిన ప్లాస్టిక్‌ క్లిప్‌. ఈ క్లిప్‌ను ఒకవైపు వేలికి తొడుక్కుని, మరోవైపు స్మార్ట్‌ఫోన్‌ టచ్‌స్క్రీన్‌కు ఆనిస్తే చాలు, స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌ మీద అన్ని వివరాలూ కనిపిస్తాయి. ఇది యాప్‌ ఆధారంగా పనిచేస్తుంది. ప్రస్తుతం దీనిపై అమెరికాలోను, దక్షిణ కొరియాలోను క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే, ఈ బీపీ క్లిప్‌ వచ్చే ఏడాదికి మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. దీని తయారీ ధర కేవలం ఎనభై సెంట్లు (రూ.5.64) మాత్రమేనని చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement