BP check
-
బీపీకి ఆయుర్వేద ఔషధం.. త్వరలో అందుబాటులోకి..
రక్తపోటు.. బ్లడ్‌ప్రెజర్.. దీనిని వాడుక బాషలో బీపీగా వ్యవహరిస్తుంటారు. దేశంలో ప్రతి నాల్గవ వ్యక్తి రక్తపోటుతో బాధపడుతున్నాడని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. అటు హైబీపీ, ఇటు లోబీపీ.. రెండూ ప్రమారకమైనవేనని వైద్యులు చెబుతుంటారు. రక్తపోటు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అది పక్షవాతానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తుంటారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో గల జాతీయ ఆయుర్వేద సంస్థాన్ రక్తపోటుపోటుపై పరిశోధనలు నిర్వహించింది.జాతీయ ఆయుర్వేద సంస్థాన్(National Institute of Ayurveda) పదేళ్ల పరిశోధనల అనంతరం రక్తపోటు నియంత్రణకు ఔషధాన్ని తయారు చేసింది. దీనికి క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించింది. ఈ ఔషధం ఎటువంటి దుష్ప్రభావాలను కలుగజేయదని ట్రయల్స్‌లో తేలిందని సంస్థాన్ పరిశోధనకులు తెలిపారు. ఈ ఔషధాన్ని తొమ్మిది రకాల వనమూలికలను కలిపి తయారు చేశారు. ఈ ఔషధం క్లినికల్ ట్రయల్ పూర్తయిందని, పేటెంట్ పొందిన తరువాత అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సంస్థాన్ హెచ్ఓడీ డాక్టర్ సుదీప్త రథ్ మాట్లాడుతూ తమ వైద్యుల బృందం రక్తపోటును అదుపులో ఉంచేందుకు ఆయుర్వేద గుళికలను రూపొందించిందని తెలిపారు. ఈ గుళికలు క్లినికల్ ట్రయల్స్ సమయంలో ప్రభావవంతంగా పనిచేశాయని, ఎటువంటి దుష్ప్రభావాలు కూడా కనిపించలేదన్నారు. ఈ ఔషధానికి పేటెంట్(Patent) పొందిన వెంటనే, దానిలో ఉపయోగించిన మూలికలను బహిర్గతం చేస్తామన్నారు. కాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశ జనాభాలో అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు 22.6 శాతంగా ఉన్నారు. పురుషులలో ఈ రేటు మహిళల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలలో రక్తపోటు(blood pressure) ప్రభావం అధికంగా ఉంది. అధిక రక్తపోటు కారణంగా, ఛాతీ నొప్పి, తీవ్రమైన అనారోగ్యం, గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: Anti Valentine week : నేటి నుంచి భగ్న ప్రేమికులు చేసే పనిదే.. -
Health: బీ‘పీక్స్’ పోకముందే చెక్స్!
రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్ అంటే అందరికీ తెలిసిందే. కానీ... వాస్తవానికి రక్తపోటు వచ్చేందుకు ముందు కొన్ని సూచనల ద్వారా శరీరం హెచ్చరికలు పంపుతుంటుంది. అవేమిటో జాగ్రత్తగా గ్రహిస్తే అసలు రక్తపోటు రాకుండానే చాలాకాలం పాటు ఆలస్యం చేయడమో, అదే క్రమశిక్షణ పాటిస్తే దాదాపుగా నివారించడమో సాధ్యమవుతుంది. దేహం అలా హెచ్చరికలు పంపే దశను ‘ప్రీ–హైపర్‌టెన్షన్’ దశగా పేర్కొంటారు. నిజానికి ప్రీ హైపర్‌టెన్షన్ దశలోనే జాగరూకతతో వ్యవహరిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలూ, మూత్రపిండాలు, మెదడు లాంటి కీలకమైన ఎండ్ ఆర్గాన్స్ దెబ్బతినకుండా నివారించుకుకోవచ్చు. ఆ ‘ప్రీ–హైపర్‌టెన్షన్’ ఏమిటో చూద్దాం.రక్తనాళాల్లో రక్తం నిర్దిష్టమైన వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. ఓ వ్యక్తి తాలూకు రక్తపోటు 120/80 ఉంటే అది పూర్తిగా నార్మల్ కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొందరిలో ఈ నార్మల్ కొలత ఖచ్చితంగా ఉండక కొంత అటు ఇటుగా మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు సిస్టోలిక్ రక్తపోటు విలువ 120కి బదులుగా 121 నుంచి 139 ఉండవచ్చు. అలాగే డయాస్టోలిక్ విలువ 80కి బదులుగా 81 నుంచి 89 వరకు ఉండవచ్చు. 120 /80 కి బదులుగా పైన పేర్కొన్న ఆ కొలతలు ఉంటే ఆ దశను రక్తపోటు ఉన్న దశగా చెప్పడం కుదరదు. అలాగని అది నార్మల్ విలువ కూడా కాదు. అందుకే డాక్టర్లు ఆ దశను ‘ప్రీహైపర్‌టెన్షన్’ (రక్తపోటు రాబోయే ముందు దశ)గా పేర్కొంటారు. ఈ ‘ప్రీహైపర్‌టెన్షన్’ దశను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు ‘హైబీపీ’ రావచ్చు. అయితే హైబీపీ నిశ్శబ్దంగా ఎన్నో ఆరోగ్య సమస్యలనూ, అనర్థాలను తెచ్చిపెడుతుందన్న విషయాన్ని గమనంలో ఉంచుకుని, కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలి.ప్రీ–హైపర్‌టెన్షన్‌లో బాధితులు వెంటనే మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఆ హెచ్చరికలతో అప్రమత్తమై కొన్ని ముందుజాగ్రత్త చర్యలకు పూనుకోవాలి. ప్రీ–హైపర్‌టెన్షన్ దశలోనే తమ తమ వ్యక్తిగత జీవనశైలిలోని అలవాట్లను చక్కబరచుకోవడం ద్వారా రక్తపోటును అదుపులోకి తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. హైబీపీ ఓ సైలెంట్ కిల్లర్...అధిక రక్తపోటును (హైబీపీని) సైలెంట్ కిల్లర్‌గా పేర్కొంటారు. ఎందుకంటే దీనివల్ల ఆరోగ్యానికి కలిగే అనర్థాలు, నష్టాలు వెంటనే బయటకు కనిపించవు. పైగా రక్తపోటు పెరిగి ఉందన్న విషయం బాధితుడికి మొదట్లో తెలియనే తెలియకపోవచ్చు కూడా. అందువల్ల నష్టం జరుగుతూపోతూ... దీర్ఘకాలంలో ఏవైనా అవయవాలు దెబ్బతినప్పుడు, వాటికి సంబంధించిన లక్షణాలు బయటపడేవరకు జరిగిన నష్టం తెలియరాదు. కొన్నిసార్లు నష్టం జరిగిపోయాక మాత్రమే అప్పుడది హైబీపీ వల్ల జరిగిన అనర్థమని తెలుస్తుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు.హైబీపీకి కారణాలు.. హైబీపీకి నివారించలేనివీ, నివారించదగినవనే రెండు రకాల కారణాలుంటాయి.నివారించలేని కారణాలు:పెరుగుతున్న వయసు, కుటుంబంలో వంశపారంపర్యంగా హైబీపీ ఉన్న మెడికల్ హిస్టరీ వంటివి నివారించలేని కారణాలని చెప్పవచ్చు.నివారించదగిన కారణాలు:ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉండటం (స్థూలకాయం), ఒకే చోట కూర్చుని పనిచేసే జీవనశైలి, ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పొగతాగడం, పొగాకు నమలడం, మద్యం తీసుకోవడం వంటి అలవాట్లు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటి అనేక అంశాలు నివారించదగిన కారణాలు. ఈ సూచనలు పాటించండి... – కేవలం ప్రీహైపర్‌టెన్షన్ మాత్రమే ఉన్నప్పుడు నివారించదగిన కారణాలను తెలుసుకుని అవి ప్రమాదకరం కాదని నిర్లక్ష్యం చేయకుండా ఈ సూచనలు పాటించాలి.– జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో తగిన జాగ్రత్తలు తీసుకోవడం. అంటే సోడియమ్ మోతాదులు పెరగకుండా ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవడం.– ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, చిప్స్, బేకరీ ఐటమ్స్ వంటి వాటికి దూరంగా ఉండటం ∙కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం కంటే ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవడం.– మాంసాహారంలో వేట మాంసం కంటే వైట్ మీట్ అయిన చికెన్, చేపలు ఎక్కువగా తీసుకోవడం.– అదనపు బరువును ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా నియంత్రించుకోవడం.– ఎప్పుడూ కూర్చుని ఉండే పనుల్లో ఉండేవారు వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం.ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రీ–హైపర్‌టెన్షన్ దశలోనే జాగ్రత్తవహిస్తే అధిక రక్తపోటును చాలాకాలం పాటు నివారించుకోవచ్చు. దాంతో గుండెపోటు, పక్షవాతం, మెదడుకు సంబంధించిన ఇతర సమస్యలు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి అనేక రకాల ప్రమాదకరమైన పరిస్థితులు రాకుండా చేసుకోవచ్చు. -
ఏకంగా శునకాలకై.. అమెరికన్ కంపెనీ 'కడీ' పేరుతో..
చాలామంది జంతుప్రేమికులు ఇళ్లల్లో శునకాలను పెంచుకుంటూ ఉంటారు. ఇళ్లలో అవి ఏ మూలనో పడుకుంటూ ఉంటాయి. అవి పడుకునే చోట పాత బొంతలో, దుప్పట్లో పరుస్తూ ఉంటారు. బాగా సంపన్నులైతే సోఫా కుర్చీలను పెంపుడు శునకాలకు మంచాలుగా మార్చేస్తుంటారు. అమెరికన్ కంపెనీ ‘థింకో ఎల్ఎల్సీ’ శునకాల కోసం ‘కడీ’ పేరుతో ఒక స్మార్ట్ మంచానికి రూపకల్పన చేసింది.దీని తయారీకి చైనీస్ కంపెనీ లావో ఇంటర్నేషనల్ ట్రేడ్ కంపెనీ సాంకేతిక సహకారం అందించింది. శునకాలకు అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించిన ఈ బెడ్ స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై యాప్ ద్వారా పనిచేస్తుంది. దీనిపై పడుకున్న శునకానికి ఆహ్లాదం కలిగించేలా సంగీతం వినిపిస్తుంది. ఒంటికి హాయి నిచ్చేలా ఉష్ణోగ్రతను సర్దుకుంటుంది.యాప్ ద్వారా కూడా దీని ఉష్ణోగ్రతను మార్చుకునే వీలు ఉంది. దీనిపై పడుకున్న శునకం నిద్ర తీరుతెన్నులను యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. అంతేకాదు, శునకం ఆరోగ్యంలో మార్పులను కూడా ఇది నిశితంగా గమనిస్తూ, అవసరమైన సందర్భాల్లో యాప్ ద్వారా యజమానులను హెచ్చరిస్తుంది. ఈ స్మార్ట్ బెడ్‌ను ‘థింకో ఎల్ఎల్సీ’ జూన్ నెలాఖరులోగా మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.బీపీ చెకింగ్ స్మార్ట్‌వాచీలు..జీవనశైలి వ్యాధుల్లో హై బీపీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా హై బీపీ బాధితులు నానాటికీ ఎక్కువవుతున్నారు. బీపీ చెక్ చేయించుకోవాలంటే డాక్టర్ దగ్గరకు లేదా డయాగ్నస్టిక్స్ సెంటర్‌కు వెళ్లాలి. లేకుంటే, సొంతగా బీపీ మెషిన్ కొని ఇంట్లో పెట్టుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు ఈ మెషిన్‌ను వెంట తీసుకుపోవడం కుదిరే పని కాదు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే అమెరికన్ కంపెనీ వైహెచ్ఈ టెక్నాలజీ తాజాగా బీపీ చెకింగ్ స్మార్ట్ వాచీని అందుబాటులోకి తెచ్చింది.మిగిలిన స్మార్ట్‌వాచీల మాదిరిగానే ఇది కూడా రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ వాచీని చేతికి తొడుక్కుంటే, బీపీ ఎంత ఉందో ఎప్పటికప్పుడు నిరంతరాయంగా చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ బీపీ ఆందోళనకరమైన స్థాయిలో ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి తగిన చికిత్స తీసుకునేందుకు దోహదపడుతుంది. బీపీ చెకింగ్‌ను సులభతరం చేసిన ఈ స్మార్ట్‌వాచీ కోసం ఆన్లైన్లో ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. దీని ధర 199 డాలర్లు (రూ.16,564) మాత్రమే!ఇవి చదవండి: నిద్దురలో బాగా గురక కొడ్తున్నారా! అయితే ఈ దిండు.. -
స్మార్ట్‌ఫోన్‌లో బీపీ చూసుకోవచ్చు.. ధర రూ. 10 కంటే తక్కువ
బీపీ రీడింగ్ కోసం క్లినిక్‌లకు వెళ్లక్కర్లేదు. ఇంట్లో పెద్ద పెద్ద బీపీ మానిటర్లు ఉంచుకోనక్కర్లేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వేలికి తొడుక్కునే ఈ చిన్న క్లిప్ ఉంటే చాలు, ఇంచక్కా స్మార్ట్‌ఫోన్‌లోనే ఎప్పటికప్పుడు బీపీ రీడింగ్ ఎంతో తేలికగా తెలుసుకోవచ్చు. ‘బీపీ క్లిప్’ పేరుతో కాలిఫోర్నియా యూనివర్సిటీలోని ‘డిజిటల్ లాబ్’ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ పరికరం ద్వారా బీపీ మాత్రమే కాకుండా, రక్తంలోని ఆక్సిజన్ స్థాయి, గుండె వేగం వంటి వివరాలను కూడా చాలా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇది త్రీడీ ప్రింటర్ ద్వారా ముద్రించిన ప్లాస్టిక్ క్లిప్. ఈ క్లిప్‌ను ఒకవైపు వేలికి తొడుక్కుని, మరోవైపు స్మార్ట్‌ఫోన్ టచ్‌స్క్రీన్‌కు ఆనిస్తే చాలు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ మీద అన్ని వివరాలూ కనిపిస్తాయి. ఇది యాప్ ఆధారంగా పనిచేస్తుంది. ప్రస్తుతం దీనిపై అమెరికాలోను, దక్షిణ కొరియాలోను క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే, ఈ బీపీ క్లిప్ వచ్చే ఏడాదికి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. దీని తయారీ ధర కేవలం ఎనభై సెంట్లు (రూ.5.64) మాత్రమేనని చెబుతున్నారు. -
బీపీ... బీపీ అంటుంటాంగానీ... మనందరికీ బీపీ ఉండి తీరాలి, కాకపోతే
హైబీపీకి సంబంధించిన సందేహాలు కాస్త చిత్రంగా ఉండవచ్చు. నిజానికి అదో అపోహలా అనిపించవచ్చు. కానీ అదే వాస్తవం కావచ్చు. అలాగే మరికొన్ని నిజమనిపించవచ్చు. కానీ అపోహ కావచ్చు. అందుకే అలాంటి కొన్ని సందేహాలూ, సమాధానాలు చూద్దాం. బీపీ... బీపీ అంటుంటాంగానీ... మనందరికీ బీపీ ఉండి తీరాలి. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. తెలుగులో రక్తపోటు. అది ఉండాల్సిందే. కాకపోతే 140/90 కొలతతో ఉండాలి. అది నార్మల్. అంటే బీపీ ఉండాల్సిందేగానీ... ఎంత ఉండాలో అంతే ఉండాలన్నమాట. ఇది పెరిగితే హైబీపీ!! నిజానికి ఇదో జబ్బు కాదు. కానీ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కారణమయ్యేలా చేస్తుంది. భారతీయ సమాజంలో ఇంచుమించు కౌమారం దాటి యువదశ దాటినవారిలోని 25 శాతం మందికి హైబీపీ ఉన్నట్లు ఓ అంచనా. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇంతమంది హైబీపీ బాధితులు ఉండటం... వారిలో అనేక సందేహాలు, అపోహల కారణంగా మందులు సరిగా తీసుకోకపోవడం వల్ల మెదడు, మూత్రపిండాల వంటి ఎండ్ ఆర్గాన్స్ విఫలమై మృతిచెందడం, పక్షవాతం వంటి కారణాలతో జీవితాంతం వైకల్యాలతో బాధపడటం చాలా సాధారణం. ఈ నెల 17న వరల్డ్ హైపర్‌టెన్షన్ డే. ఈ సందర్భంగా ఈ అంశంపై అనేక సందేహాలూ, వాటికి సమాధానాలు తెలుసుకుని హై–బీపీ పట్ల అవగాహన పెంచుకుంటే ఎన్నెన్నో జీవితకాలపు వైకల్యాలనూ, మరణాలను నివారించవచ్చు. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. యువకులను మినహాయిస్తే... మధ్యవయసు దాటాక... ఏజ్ పెరుగుతున్న కొద్దీ... నార్మల్ అయిన 120/80 కంటే కొద్దిగా ఎక్కువగానే ఉండటం మామూలే కదా! ఈ అపోహ చాలాకాలం రాజ్యమేలింది. వయసు పెరుగుతున్న కొద్దీ బీపీ కొద్దిగా ఎక్కువే ఉండవచ్చని తొలుత అనుకున్నారు. (వయసు + 100) అంటూ ఓ సూత్రం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఉదాహరణకు ఓ వ్యక్తి వయసు 60 ఏళ్లు అయితే అతడి పై కొలత 160 వరకు ఉన్నా పర్లేదని అనుకున్నారు. కానీ తాజాగా ఇప్పటి లెక్కలు వేరు. ఇప్పుడు తాజాగా... పద్దెనిమిది దాటిన ఏ వయసువారికైనా బీపీ 140/90 కి పైన ఉంటే అది హైబీపీ కిందే లెక్క. తల్లిదండ్రులకు ఉంటే, పిల్లలకూ హైబీపీ వస్తుందా? తల్లిదండ్రులకు హైబీపీ ఉంటే... పిల్లలకు అది తప్పనిసరిగా వచ్చే జన్యుపరమైన సమస్య కాదు గానీ... తల్లిదండ్రులకూ, రక్తసంబంధీకులకూ, దగ్గరి బంధువులకు అధిక రక్తపోటు ఉన్నప్పుడు... వారి వారసులకు కూడా వచ్చే అవకాశాలు కాస్తంత ఎక్కువే. రక్తపోటు ఉన్నప్పటికీ చాలా చిన్నవయసు వారు మాత్రలు తీసుకోవాల్సిన అవసరం లేదేమో కదా? రక్తపోటు ఉందని తేలాక... అది ఎంత చిన్నవయసు అయినా తప్పనిసరిగా మందులు వాడాల్సిందే. లేకపోతే దీర్ఘకాలంలో కీలకమైన అవయవాలు దెబ్బతిని ప్రాణాపాయం కలిగించే అవకాశాలు ఎక్కువ. చిన్నపిల్లల్లో హైబీపీ ఉండదు కదా? చిన్నపిల్లల్లో, అప్పుడప్పుడే యుక్తవయసుకు వస్తున్న కౌమార బాలల్లో హైబీపీ ఉండకపోవచ్చని అనిపిస్తుంది. కానీ వాళ్లలోనూ కొందరికి హైబీపీ (హైపర్‌టెన్షన్) ఉండే అవకాశం ఉంది. ఇటీవల చాలా చిన్నపిల్లలు.. అంటే 3 నుంచి 11 ఏళ్ల మధ్య వయసువారు, కౌమారంలోకి వస్తున్న పిల్లలు... అంటే 12 నుంచి 18 ఏళ్ల మధ్యవారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. అయితే చిన్నపిల్లల్లో హైబీపీ నిర్ధారణ విషయంలో కొలత చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పిల్లల్లో బీపీని తెలిపే ఛార్ట్‌ను ‘సెంటైల్ చార్ట్’ అంటారు. పిల్లల్లో నార్మల్ విలువలు వాళ్ల వయసునూ, జెండర్నూ, వాళ్ల ఎత్తును బట్టి మారుతుంటాయి. అంటే వారిలో కొలత 90 ఉంటే అది బీపీ ఉన్నట్లు కాదు. కొలత విలువ 95 పర్సంటైల్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే అది పిల్లల్లో హైబీపీ ఉన్నదనడానికి సూచన. ఆ రీడింగ్ 95–99 ఉంటే హైపర్‌టెన్షన్ స్టేజ్–1 అని చెప్పవచ్చు. 99 పర్సంటైల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్–2గా భావించాలి. ఈ దశలూ, తీవ్రతలను బట్టి ఆయా పిల్లలకు ఎలాంటి చికిత్స ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు. సుదీర్ఘకాలం పాటు హైబీపీ మందులు వాడితే వాటికి అలవాటు పడి... డ్రగ్ అడిక్షన్ వస్తుందేమో కదా? ఒకసారి హై–బీపీ నిర్ధారణ అయ్యాక... దాన్ని అదుపులో ఉంచేందుకు డాక్టర్లు మందులను సూచిస్తుంటారు. వారి బీపీ తీవ్రతను బట్టి కొందరిలో రెండు, మూడు, నాలుగు... రకాల మందులను డాక్టర్లు వాడమంటారు. తరచూ గమనిస్తూ... మందుల మోతాదును అడ్జెస్ట్ చేస్తుంటారు. జీవనశైలి మార్పులతో బీపీని అదుపులో పెడితే కేవలం రెండులోపు మాత్రలతోనే చాలాకాలం కొనసాగవచ్చు. కానీ బీపీ అదుపులో లేకపోతే మందులూ, మోతాదులు పెరుగుతాయి. హైబీపీ మందులైనా, డయాబెటిస్ మందులైనా సుదీర్ఘకాలం వాడాల్సిందే. అది బాధితుల బీపీ కొలతలను బట్టి ఉంటాయి తప్ప... బీపీ తగ్గినప్పటికీ వాటికే అలవాటు పడటం, మానకుండా ఉండలేకపోవడం వంటివి జరగవు. మందులు వాడుతున్నా... బీపీ నియంత్రణలో ఉండటం లేదు. బహుశా మందుల ప్రభావం తగ్గిపోయిందా? బహుశా బీపీ ఆ మందులకు రెసిస్టెన్స్ పెంచుకుని ఉండవచ్చా? కొంతమంది బీపీ బయటపడ్డాక... మొదటిసారి మాత్రమే డాక్టర్‌ను కలుస్తారు. అప్పుడు డాక్టర్ రాసిన మందులనే అదేపనిగా ఏళ్ల తరబడి వాడుతుంటారు. కానీ వాటితో బీపీ నిజంగానే అదుపులోకి వచ్చిందా... లేక ఆ డోస్ సరిపోవడం లేదా... ఇలాంటి విషయాలేమీ పట్టించుకోరు. మరికొందరు తొలిసారి మందులు వాడకం మొదలుపెట్టాక... రెండో వారంలోనో లేదా పది రోజుల తర్వాతనో మరోసారి బీపీ చూసుకుని, అది తగ్గడం లేదంటూ ఫిర్యాదు చేస్తారు. ఇవన్నీ సరికాదు. మందుల ప్రభావం తగ్గిపోయిందనే అపోహ కూడా వద్దు. ఒకసారి బీపీ మందులు మొదలుపెట్టాక అవి పనిచేయడం ప్రారంభించి, బీపీ అదుపులోకి రావడానికి కనీసం 3 – 4 వారాలు పట్టవచ్చు. ఇవేవీ చూడకుండానే కొందరు తాము అనుకున్నదే కరెక్ట్ అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. ఇది సరికాదు. అందుకే బీపీ మందులు వాడుతున్న వారు డాక్టర్ నిర్దేశించిన ప్రకారం... ఆయా సమయాలకు ఫాలో అప్‌కు వస్తుండాలి. ఉద్వేగ లక్షణాలు ఉంటే అది హై–బీపీ యేనా? కొంతమంది తాము నర్వస్‌గా ఉండటం, తలనొప్పి తరచూ వస్తుండటం, చెమటలు పడుతున్నట్లుగా, నిద్రపట్టకుండా, కోపంగా లేదా బాగా ఉద్వేగంగా/ఉద్రిక్తంగా ఉన్నప్పుడు హైబీపీ ఉందనో లేదా ఆ టైమ్‌లో బీపీ పెరిగి ఉందనో చెబుతుంటారు. అంతేకాదు... కొంతమందికి హాస్పిటల్‌కు వెళ్లగానే, అక్కడి డాక్టర్లను చూడగానే బీపీ పెరుగుతుంది. అదే ఇంటిదగ్గర లేదా మరోచోట రీడింగ్ తీసినప్పుడు నార్మల్‌గా ఉంటుంది. ఇలా తెల్లకోట్లలో ఉండే డాక్టర్లను చూసినప్పుడు రక్తపోటు పెరగడాన్ని ‘వైట్ కోట్ సిండ్రోమ్’ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో లేదా పైన చెప్పిన లక్షణాలన్నీ లేదా వాటిలో కొన్ని ఉన్నప్పుడు హైబీపీ ఉన్నట్లేనా అని సందేహ పడుతుంటారు. పై లక్షణాలతోనూ, సహజ భావోద్వేగాలతోనూ రక్తపోటు కొంతమేరకు పెరగవచ్చు. కానీ వాళ్ల భావోద్వేగాలు తగ్గగానే నార్మల్ అవుతుంది. అలాంటి కండిషన్లలో పెరిగేదాన్ని హైబీపీగా పరిగణించరు. అయితే ఓ వ్యక్తిలో పలుమార్లు రీడింగ్ తీశాక కూడా... రక్తపోటు 140/90 అనే విలువకు మించి ఉంటే అప్పుడు మాత్రమే హైబీపీగా పరిగణిస్తారు. సాధారణంగా రక్తపోటుకు సంబంధించిన లక్షణాలేమీ లేకపోతే హైబీపీ లేనట్లేనా? చాలామందికి లక్షణాలేమీ కనిపించకుండానే హైబీపీ ఉండవచ్చు. వారికి హైబీపీ ఉన్నట్లే తెలియకుండానే అది ఏళ్లతరబడి ఉండే అవకాశం ఉంది. రక్తపోటు చాలాకాలంగా చాలా ఎక్కువగా ఉండటం వల్ల మన దేహంలో ఎండ్ ఆర్గాన్స్‌గా పిలిచే మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వంటి కీలక అవయవాలు దెబ్బతింటాయి. అలా అవి పూర్తిగా పాడైపోయాక... అప్పుడుగానీ ఆయా అవయవాలు దెబ్బతిన్నందున కనిపించే లక్షణాలు బయటపడవు. హైబీపీ వల్ల దెబ్బతిని, బాధితులను ప్రాణాంతక పరిస్థితులకు నెడుతున్నందునే దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. అందువల్ల లక్షణాలు కనిపించనంత మాత్రాన బీపీ లేదని అనుకోవడం సరికాదు. ఒకసారి డాక్టర్‌ను కలిసి, చెకప్ చేయించుకున్న తర్వాతే నిశ్చింతగా ఉండాలి. కొన్నిసార్లు లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ అవి తాత్కాలికం కావచ్చు. అలాంటిప్పుడు ఒకవేళ బాధితులకు హైబీపీ లేకపోయినా, అది ఉన్నట్టుగా డాక్టర్లు పొరబడే అవకాశాలు లేవా? హైబీపీ వల్ల కొందరిలో తలనొప్పి, తలతిరగడం వంటివి కనిపించవచ్చు. కానీ ప్రతి తలనొప్పీ అధిక రక్తపోటు వల్లనే కాకపోవచ్చు. బీపీ తాలూకు లక్షణాలు అని చెప్పుకునే కండిషన్లు కనిపించినప్పుడు అసలు బీపీని కొలవకుండానే కేవలం లక్షణాలతో ఆ సమస్య ఉందని అనుకోవడం సరికాదు. డాక్టర్లు అలా పొరబడే అవకాశం లేదు. ఎందుకంటే... రక్తపోటు పెరగడం వల్ల మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరగడం వల్ల తలనొప్పి రావచ్చు. అలాగే కొందరిలో వారి బాడీ పోష్చర్ అకస్మాత్తుగా మారడం వల్ల రక్తపోటు తగ్గవచ్చు. దీన్ని ‘ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్’ అంటారు. అలాంటి సమయాల్లో కొందరికి ముందుకు తూలిపడిపోతామనే ఫీలింగ్ లేదా తలతిరగడం వంటివి కనిపించవచ్చు. బీపీ తగ్గిన ఇలాంటి సందర్భాల్లోనూ బీపీ పెరిగినప్పుడు కనిపించే గిడ్గీనెస్ వంటి లక్షణాలు æ కనిపిస్తాయి. అందువల్ల డాక్టర్లు కేవలం లక్షణాల ఆధారంగా కాకుండా... అనేక మార్లు, అనేక సందర్భాల్లో బీపీని కొలిచిచూస్తారు. ఇలా పరీక్షించినప్పుడు అన్నిసార్లూ కొలత పెరిగి ఉంటే అప్పుడు మాత్రమే దాన్ని హైబీపీగా నిర్ధారణ చేస్తారు. హైబీపీ ఉందని నిర్ధారణ అయ్యింది. డాక్టర్లు మందులు మొదలుపెట్టారు. కొన్నాళ్ల తర్వాత బీపీ అదుపులోకి వచ్చిందనుకోండి. అప్పుడు మందులు మానేయవచ్చా? ఒకసారి హైబీపీ నిర్ధారణ అయి... మందులు మొదలుపెట్టాక వాటి ప్రభావంతో బీపీ అదుపులోకి వస్తుంది. దాంతో బీపీ నియంత్రణలోనే ఉంది కదా అని చాలామంది మళ్లీ మందులు మానేస్తుంటారు. మళ్లీ బీపీ చెక్ చేయించుకోరు. దీని లక్షణాలు బయటకు కనిపించవు కాబట్టి అది పెరిగిన విషయం తెలియదు. అందుకే ఒకవేళ బీపీ నియంత్రణలోకి వచ్చిందని మందులు ఆపేసినా... మాటిమాటికీ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. బీపీ ఏమాత్రం పెరిగినట్లు అనిపించినా వెంటనే డాక్టర్ సలహా తో తగిన మోతాదు నిర్ణయించుకుని, మందులు తిరిగి మొదలుపెట్టాలి. అంతేకాదు... మందులు వాడుతున్నప్పటికీ తరచూ బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రస్తుతం మందులు వాడుతున్నప్పటికీ... ఆ మోతాదు సరిపోక బీపీ పెరిగితే... డాక్టర్లు మందులు మార్చడమో లేదా సరైన మోతాదు అందేలా మరో మాత్ర లేదా రెండు మాత్రలు పెంచడమో చేస్తారు. ఈ నేపథ్యంలో బీపీ మందులు వాడుతున్నప్పుడు వాటిని మానేయకపోవడం మంచిది. తరచూ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండటం అవసరం. బార్డర్‌లైన్‌లో ఉన్నప్పుడు మందులు అవసరం లేదనీ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మంచి జీవనశైలి, ఆరోగ్యకరమైన అలవాట్లతో బీపీని అదుపులో ఉంచుకోవాలంటూ డాక్టర్లు చెబుతారు కదా. మరి ఇప్పుడు కూడా మందులేవీ వాడకుండా మంచి జీవనశైలి అనుసరిస్తే సరిపోదా? ప్రతివారూ ఇలాగే అనుకుంటారు. కానీ జీవనశైలి నియమాలను కరెక్ట్‌గా పాటించరు. పాటించినా కొద్దికాలం మాత్రమే. లక్షణాలేవీ బయటకు కనిపించని హైబీపీ దీర్ఘకాలికంగా ఏవైనా కీలక అవయవాలపై దుష్ప్రభావం చూపితే... అప్పుడు జరిగే నష్టం... అప్పుడు వైద్యపరీక్షలకూ, చికిత్సకూ పడే ఆర్థికభారం, ఏదైనా ఎండ్ ఆర్గాన్ శాశ్వతంగా దెబ్బతింటే కలిగే నష్టం లాంటివి చాలా జబ్బుభారాన్ని (డిసీజ్ బర్డెన్ను) పెంచుతాయి. వాటికంటే అసలు మనకు భారమే తెలియని రీతిలో, చాలా చవకైన మందులను రోజూ ఒకపూట లేదా రెండు పూటలు తీసుకోవడం మేలు. దానివల్ల సుదీర్ఘకాలం, అన్ని అవయవాలనూ పదిలంగా ఉంచుతూ హాయిగా జీవించవచ్చు. గుండెపోటు, పక్షవాతం లాంటి మరెన్నో అనారోగ్యాలనూ, అనర్థాలను నివారించుకోవచ్చు. ఉప్పు పూర్తిగా మానేయాలా? హైబీపీ అనగానే ఉప్పు వల్ల రక్తపోటు పెరుగుతుందని సాధారణ ప్రజలకు కూడా ఇప్పుడు తెలిసిన విషయం. అయితే తమకు ఎలాంటి అనర్థాలూ జరగకూడదనే ఉద్దేశంతో చాలామంది ఉప్పును పూర్తిగా మానేస్తుంటారు. కానీ మన దేహంలోని చాలా కీలకమైన జీవక్రియలు (ఉదాహరణకు మెదడు నుంచి నాడుల ద్వారా కండరాలకు వచ్చే ఆదేశాలూ, వాటి అమలు వంటివి) ఉప్పు/ఇతర లవణాలలోని అయాన్ల ద్వారానే జరుగుతుంటాయి. ఉప్పు పూర్తిగా మానేసిన కొందరిలో ‘హెపోనేట్రీమియా’ అనే కండిషన్ వచ్చి, ఒక్కోసారి ప్రాణాంతకంగానూ మారవచ్చు. అందుకే ఉప్పును పూర్తిగా మానేయడం కంటే... మునుపు వాడుతున్న దాంట్లో సగం లేదా సగం కంటే తక్కువ వాడటం మంచిది. - డాక్టర్ హరిరామ్ వి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ -
రక్తపోటు పరీక్షలకు మెరుగైన స్మార్ట్‌ఫోన్ పద్ధతి!
స్మార్ట్ఫోన్లతో చేయగలిగిన పనుల్లో రక్తపోటు పరీక్షలు ఇప్పటికే చేరినప్పటికీ ఇదే పనిని మరింత కచ్చితత్వంతో చేసేందుకు మిషిగన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన ముక్కామల రామకృష్ణ ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. ఆధునిక త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో, కొన్ని ఆప్టికల్ సెన్సర్లను ఉపయోగించి ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్ కేస్‌ను తయారు చేశారు ఈయన. దీంతోపాటు ప్రత్యేకమైన ప్రదేశంలో ఉండే ఇంకో సెన్సర్‌ను వేలితో నొక్కితే చాలు.. రక్తపోటు వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. వేలి ఒత్తిడికి ఆప్టిక్ల సెన్సర్లు పనిచేయడం మొదలుపెడతాయని.. రక్తనాళాల్లో రక్తపోటు కారణంగా వచ్చే మార్పులను పరిశీలించడం ద్వారా రక్తపోటు ఎంత ఉందో నిర్ణయించి ఆ సమాచారాన్ని వైర్లెస్ పద్ధతిలో స్క్రీన్ పైకి పంపుతాయని రామకృష్ణ వివరించారు. ఇప్పటికే తాము ఈ స్మార్ట్ కేస్‌ను కొంతమందిపై పరీక్షించి మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ సహకారంతో తయారైన ఈ కొత్త గాడ్జెట్ వైద్య రంగంలో మేలి మార్పులకు కారణమవుతుందని వైద్య నిపుణుల అంచనా. -
హై బీపీ కౌన్సెలింగ్
నా వయసు 40. ఇటీవలే తల తిరుగుతుంటే డాక్టర్‌ను సంప్రదించి బీపీ చెక్ చేయించుకున్నాను. అప్పుడు నా బీపీ 140/94 ఉంది. డాక్టర్ వరసగా ఐదు రోజుల పాటు ఎక్కడైనా చెక్ చేయించుకొని ఆ విలువలతో మళ్లీ రమ్మన్నారు. ఈ ఐదు రోజులూ మాకు దగ్గర్లోని ఒక ఫార్మసీలో నర్స్ దగ్గర చెక్ చేయించుకుంటే 120/80 ఉంది. నాకు బీపీ ఉన్నట్లా లేనట్లా? - సుధీర్‌కుమార్, నల్లగొండ మీరు డాక్టర్ వద్ద చెక్ చేయించుకున్నప్పుడు వచ్చిన బీపీ ఎక్కువే ఉంది. డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు కలిగే యాంగ్జైటీవల్లనో, ఆందోళన కారణంగానో వచ్చే బీపీని ‘వైట్ కోట్ హైపర్‌టెన్షన్’ అంటారు. మీరు ఫార్మసీలో చెక్ చేయించినప్పటి విలువలు నార్మల్‌గానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. మీరు చెప్పిన కింది విలువ 94 చాలా ఎక్కువ. ఏదైనా తేడా ఉన్నప్పుడు అది ప్లస్ లేదా మైనస్ 10 ఉండవచ్చు. కానీ మీరు పేర్కొన్న కింది విలువ 94 ఉండటం అంత మంచి సూచన కాదు. బీపీని కొలిచే సమయంలో నిశితత్వం కూడా అవసరం. కాబట్టి ఈసారి మీరు రోజులోని ఏదో ఒక నిర్ణీత సమయంలో బీపీ కొలతను ఐదురోజుల పాటు తీసుకోండి. అది కూడా ఏ ఫార్మసీ దగ్గరో కాకుండా సర్టిఫైడ్ ఫిజీషియన్ దగ్గరకు వెళ్లి తీసుకోండి. ఆ విలువ నార్మల్‌గా ఉంటే మీకు బీపీ లేనట్టే. ఒకవేళ ఆ విలువలు 140/85 ఉంటే అది ప్రీ-హైపర్‌టెన్షన్ దశగా భావించి, మీ జీవనశైలిలో మార్పులతో బీపీని అదుపులో పెట్టుకోవచ్చు. డాక్టర్ సుధీంద్ర ఊటూరి, కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్