
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వచ్చే ఐదేళ్లలో చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ వంటి తూర్పు ఆసియా దేశాల్లో 70కి పైగా ఔషధాలను విడుదల చేయాలని లకి‡్ష్యంచింది. ఇప్పటికే ఆయా ఉత్పత్తుల్లో కొన్ని మందుల తయారీని స్థానిక పార్టనర్స్‌కు ఔట్ సోర్సింగ్ కూడా చేసింది. ప్రస్తుతం చైనా మార్కెట్లలో 8–10 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, వాటన్నిటికీ సంబంధించి కుష్‌నన్ రొట్టం రెడ్డి ఫార్మాసూటికల్స్‌తో (కేఆర్‌ఆర్‌పీ) భాగస్వామ్యం ఉందని డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధి తెలియజేశారు. షిజోఫ్రినియా, బైపోలార్ వంటి మానసిక పరిస్థితుల చికిత్సలో ఉపయోగించే ఓలాన్‌జాపైన్ ఔషధాన్ని 2020 నుంచి చైనాలో ప్రారంభిస్తామని చెప్పారాయన.