other countries
-
విదేశీ భోజనంబు.. వింతైన వంటకంబు...
పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. ముంబైకి చెందిన హేమ తన బిడ్డలు దియా, ఓజస్వీ శర్మలతో కలిసి ‘చిల్జో’ పుడ్బ్రాండ్ ద్వారా మన పొరుగుదేశాలతో పాటు ఇటలీ, ఆఫ్రికా, అమెరికా, చైనా... మొదలైన దేశాల వంటకాలను రుచి చూపిస్తూ ‘వావ్’ అనిపిస్తోంది... చైనా వంటకాలు చైనాకు వెళ్లే తిననక్కర్లేదు. ఇటలీ వంటకాలకు అక్కడికే వెళ్లనక్కర్లేదు. ముంబైలోని ‘చిల్జో’లోకి అడుగుపెడితే చాలు ఎన్నో దేశాలకు సంబంధించిన నోరూరించే వంటకాలు స్వాగతం పలుకుతాయి. గత సంవత్సరం హేమ తన కూతుళ్లు దియా, ఓజస్వీలతో కలిసి ఈ ఫుడ్రెస్టారెంట్ను ప్రారంభించింది. ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకుంది. ముంబైవాసులు మాత్రమే కాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడకు రావడం మొదలైంది. ‘ఇతర దేశాల ఆహార సంస్కృతిని అందిపుచ్చుకొని ఆస్వాదించడం మనకేమీ కొత్త కాదు. అయితే అక్కడి రుచిని ఇక్కడికి తీసుకు వచ్చినప్పుడే విజయవంతం అవుతాం’ అంటుంది దియా. చదువు పూర్తయిన తరువాత అమెరికాలోని ఒక మార్కెటింగ్ కంపెనీలో పనిచేసింది దియా. ఉద్యోగ కాలంలో ఎన్నో ప్రాంతాలు తిరిగింది. ఆ సమయంలో రకరకాల రుచులతో పరిచయం అయింది. వంటల రుచికి మాత్రమే పరిమితమై పోకుండా ఎందరో చెఫ్‌లు, ఫుడ్ ఇండస్ట్రీలోని ప్రొఫెషనల్స్‌తో మాట్లాడింది. కోవిడ్ కల్లోల కాలంలో స్వదేశానికి తిరిగివచ్చిన దియా ఇంటి నుంచి పనిచేయడం ప్రారంభించింది. లాక్డౌన్ సమయంలో బయటికి వెళ్లి తినే పరిస్థితి లేదు. దాల్, రోటీ తినడం తప్ప మరోదారి లేదు. మరోవైపు రకరకాల వంటకాల రుచులు గుర్తుకొచ్చి నోరూరించేవి. ఆ సమయంలో వివిధ దేశాలకు చెందిన వంటకాల గురించి తెలుసుకునే పనిలో పడింది దియా. ‘ఎన్నో సంవత్సరాలు హాస్టల్ ఫుడ్ తిన్న నాకు కొత్త రుచి కావాలనిపించేది. నేను పాస్తాకు వీరాభిమానిని. దీంతో ఇంట్లో వంటల ప్రయోగాలు మొదలు పెట్టాం. చాలాసార్లు విఫలం అయిన తరువాతగానీ సక్సెస్ కాలేకపోయేవాళ్లం. మేము ప్రొఫెషనల్స్ కాకపోయినా యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ నేర్చుకున్నాం. ఇప్పుడు ‘చాలాబావుంది... అని మాకు అనిపించే వరకు వెనక్కి తగ్గలేదు’ అంటోంది బీటెక్ చదివిన ఓజస్వీ. ప్రయోగాల్లో భాగంగా తాము తయారుచేసిన రెండు వందల సాస్‌లను బంధువులు, స్నేహితులకు పంపిణీ చేశారు. వారి నుంచి మంచి స్పందన లభించింది. ఆ సమయంలోనే ఈ తల్లీకూతుళ్ల మదిలో ‘చిల్జో’ ఐడియా వచ్చింది. ఒక సంవత్సరం రీసెర్చ్, డెవలప్మెంట్ తరువాత ప్రాజెక్ట్ పట్టాలకెక్కింది. తమ పొదుపు మొత్తాల నుంచి 40 లక్షల రూపాయలు తీశారు. 30 మందికి ఉపాధి కల్పించారు. ‘ఇంట్లో వంటలతో ఎన్ని ప్రయోగాలైనా చేయవచ్చు. డబ్బులతో చేయవద్దు. ఫుడ్ ఇండస్ట్రీలో మీకు ఎలాంటి అనుభవం లేదు. రిస్క్ తీసుకుంటున్నారు’ అన్నవారే ఎక్కువ మంది ఉన్నారు. ‘యూనిట్ మొదలైన తరువాత నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఎన్నో సంవత్సరాలు చేసిన ఉద్యోగానికి దూరం కావడం బాధగా అనిపించినా, సొంత వ్యాపారం మొదలుపెట్టాం అనేది ఉత్సాహాన్ని ఇచ్చింది. ఉత్సాహం అయితే ఉంది కానీ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి నేపథ్యం లేని మాకు మార్జిన్స్, రిటైల్, ఎలాంటి డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించాలి అనే విషయాలు తెలియదు. జీటీ–జనరల్ ట్రేడ్, ఎంటీ–మార్కెట్ ట్రేడ్లాంటి పదాలు తెలియవు. సక్సెస్ అవుతామా, లేదా అనేది తెలియదు. అయినా ఉత్సాహంతో ముందుకు వెళ్లాం. మంచి ఫలితాన్ని సాధించాం’ అంటుంది దియా. అయినా సరే... ‘ఏమవుతుందో ఏమో!’ అనే సంశయం ఎక్కువైతే ఉన్నచోటే ఉండిపోతాం. కంఫర్ట్ జోన్‌కు అలవాటు పడిపోతాం. దీంతో విజయానికి దూరం అవుతాం. ‘పెద్ద రిస్క్ ఏమిటంటే ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే’ అనే ప్రసిద్ధ మాటను దృష్టిలో పెట్టుకొని రంగంలోకి దిగాను. ఫుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవం లేకపోయినా మా మీద మేము నమ్మకం కోల్పోలేదు. ఆశావాదంతో ముందుకు వెళ్లాం. అద్భుత ఫలితాన్ని సాధించాం. – హేమ, ఫౌండర్, చిల్జో -
ఎగుమతుల్లో ఏపీ దూకుడు
-
భారతదేశ సమగ్రతపై పథకం ప్రకారం జరుగుతున్న దాడి!: ధన్‌ఖడ్
భారతదేశ సమగ్రతపై పక్కా ప్లాన్ ప్రకారమే తీవ్ర స్థాయిలో దాడి జరుగుతోందని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ హెచ్చరించారు. గ్లోబెల్స్ ప్రచారం కూడా చిన్నబోయేలా ఈ దాడి జరుగుతోందన్నారు. ఈమేరకు ఆయన ఓ వార్త సంస్థ ఆధ్వర్యంలో జరిగిన రైజింగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. ప్రభుత్వం అవినీతిపై చేస్తున్న యుధ్దాన్ని పక్షపాత ధోరణితో, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అడ్డుకోవాలని చూడటం దురదృష్టకరం అన్నారు. అవినీతి అంశాన్ని ఎలా రాజకీయ కోణంలో చూడగలమని ప్రశ్నించారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని తమను టార్గెట్ చేస్తుందంటూ.. ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు నేపథ్యంలోనే ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ తమ న్యాయవ్యవస్థ పట్ల గర్విస్తోందని అన్నారు. ఎవరికైనా పరువు నష్టం వాటిల్లందంటే తక్షణమే ఉపశమనం పొంది, న్యాయం చేకూరేలా చేసే సుప్రీం కోర్టులాంటి న్యాయవస్వయస్థ ఎక్కడ లభిస్తోందన్నారు. అయినా ఈ అంశంపై మాకు పాఠాలు చెప్పడానికి ప్రపంచంలో ఎవరికీ చట్టబద్ధత గానీ అందుకు సంబంధించి సాక్ష్యాధారాలు గానీ వారి వద్ద లేవని నొక్కి చెప్పారు. రాహుల్ గాంధీపై విధించిన అనర్హత వేటును గమనిస్తున్నాం అని జర్మని ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ధన్ఖర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతేగాదు తన ప్రసంగంలో భారతదేశ సమగ్రతపై పథకం ప్రకారమే దాడి జరుగుతోందని, అందుకోసం దేశం లోపల, వెలుపల కొన్ని దుష్ట శక్తుల పనిచేస్తున్నాయన్నారు. అంతేగాదు భారతదేశ వృద్ధిని కుంటిపరిచే ఒక వ్యవస్థ మొత్తం పనిచేస్తోందని ఆరోపించారు. ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఇతర దేశాల్లో తన సొంత దేశాన్ని తక్కువ చేసి మాట్లాడతారా అని విరుచుకుపడ్డారు. ఇలాంటి వాటికి ప్రజలు కచ్చితం అడ్డుకట్ట వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ధన్‌ఖడ్. (చదవండి: పార్లమెంట్ నూతన భవనాన్ని సందర్శించిన ప్రధాని) -
విదేశాల నుంచి అమెరికా వీసా!
న్యూఢిల్లీ: అమెరికా వీసా కోసం ఇకపై సుదీర్ఘంగా నిరీక్షించాల్సిన అవసరం లేకుండా భారతీయులకు అమెరికా రాయబార కార్యాలయం అరుదైన అవకాశం కల్పించింది. అత్యవసరంగా అమెరికా వెళ్లాల్సిన అవసరమున్న వారు ఇతర దేశాల్లోని ఎంబసీల నుంచి కూడా వీసా కోసం దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. బీ1, బీ2 బిజినెస్, పర్యాటక వీసాలకు ప్రస్తుతం హైదరాబాద్, కోల్‌కతా, ముంబైల్లో ఏడాదికి పైగా వెయిటింగ్ ఉంది! బ్యాంకాక్‌లో కేవలం 14 రోజుల్లోనే అపాయింట్మెంట్ దొరుకుతోంది. అందుకే అత్యవసరంగా వెళ్లాలనుకునేవారు విదేశీ ఎంబసీల్లో దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అధికారులు సూచించారు. సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నంల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. -
సంక్రాంతి: శుభాలకు వాకిలి
మన మహర్షులు ఏర్పరచిన పండుగలలో మనకు అత్యంత ప్రధానమైనది ‘సంక్రాంతి.‘ మకర సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. పుష్ – అంటే పోషించటం, పుష్టిని కలిగించటం. సర్వ్రపాణికోటికీ పుష్టిని కలిగించే పంటలు ఇంటికి వచ్చే పండుగ సంక్రాంతి పండుగ. మన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలే కాక ఒకప్పుడు మన భారతదేశంలోని భాగాలే అయిన శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, మలేషియా వంటి ప్రాంతాల్లో కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ‘సం’ అంటే ‘సమ్యక్’ – మంచి, చక్కని. ‘క్రాంతి’ అంటే మార్పు. సమ్యక్ క్రాంతి – సంక్రాంతి. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే – ‘చేరటం’ అని అర్థం. మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరించే సూర్య భగవానుడు ముందున్న రాశి నుండి తరువాత రాశి లోనికి ప్రవేశించటమే సంక్రాంతి. ప్రతి నెలలో సూర్యుడు రాశులు మారుతుంటాడు. అలా మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, మిథున సంక్రాంతి మొదలైన పన్నెండు సంక్రాంతులు ఏర్పడతాయి. వాటిలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే పుణ్యకాలాన్ని‘మకర సంక్రాంతి పండుగ‘ గా జరుపుకుంటున్నాం. సూర్యుడు ఈ మకర రాశిలో ప్రవేశించటాన్నే ఎందుకు పెద్ద పండుగగా జరుపుకుంటున్నాం అంటే, వెలుగు ఎక్కువగా ఉండే దీర్ఘమైన పగళ్ళకూ, ఆరోగ్యాన్ని వృద్ధిపరిచే సుందరమైన, ఆహ్లాదకరమైన కాలానికి నాంది కాగల ఉత్తరాయణ పుణ్యకాలం ్రపారంభమవుతుంది కనుక. ప్రకృతి లో ఇది గొప్ప మార్పు. మన ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగటి కాలం. అందువల్ల కూడా ఉత్తరాయణం అత్యంత పవిత్రమైన కాలం. ఉత్తరాయణంలోనే మనం ఉపనయనాలు, వివాహాది శుభకార్యాలను జరిపిస్తాం. కనుకే ఉత్తరాయణం ్రపారంభంలో వచ్చే మకర సంక్రమణాన్ని‘సంక్రాంతి పండుగ‘గా జరుపుకుంటున్నాం. వెలుగుకు, జ్ఞానానికి సూచకమైన ‘మకర సంక్రాంతి’ మనకు పెద్ద పండుగ. సాధారణంగా మనం పండుగలకు చాంద్రమానాన్ని పాటిస్తాం. కనుక తిథులను బట్టి ఆయా పండుగలను జరుపుకుంటాం. కానీ సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాం. కనుకే ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15, 16 తేదీలలోనే ఈ పండుగ మూడు రోజులు ఉంటాయి. తెలుగువారి ముఖ్య పండుగలలో ఒకటి సంక్రాంతి పండుగ. ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పండుగగా జరుపుకుంటాం. మన సనాతన సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను, సామాజిక స్పృహను, నైతిక విలువలను తెలియజేస్తూ, ఆరోగ్యాన్ని కలిగించే, ఆయుష్షును వృద్ధిపరిచే ఎన్నో అంశాలతో కూడి ఉంటుంది ఈ పండుగ. ప్రకృతి, జీవుడు, దేవుడు, పశుపక్ష్యాదుల సమైక్యతను నిరూపిస్తూ, ఆధ్యాత్మికతను కలిగిన గొప్ప పండుగ సంక్రాంతి పండుగ. మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. ఏడాది పాటు కష్టపడి పని చేసిన ఫలితంగా ధాన్యపు రాశులు ఇంటికి వచ్చిన ఆనందంతో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. కొత్తధాన్యంతో పులగం, ΄÷ంగలి, పాయసం చేసి, శ్రీ సూర్యనారాయణ స్వామికి, ఇష్టదైవానికి, కులదైవానికి నివేదన చేస్తారు. ప్రతి సంక్రమణంలోనూ పితృతర్పణాలివ్వాలి, శ్రీ సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యమివ్వాలి. అయితే అప్పుడు ఇవ్వలేకపోయినా, కనీసం ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి పండుగ రోజున అయినా సూర్యుని తప్పక ధ్యానించాలి, పూజించాలి, అర్ఘ్యమివ్వాలి. పితృతర్పణాలివ్వాలి, పితృదేవతలను స్తోత్రించాలి. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు గడలు, ఉదకుంభం మొదలైనవి దానమివ్వాలి. వీలున్నవారు గోదానం చెయ్యటం శ్రేష్ఠం. మనం మనకు తొలి పండుగ అయిన ఉగాదినాడు ఎలా పంచాంగ శ్రవణం చేస్తామో, అలాగే సంక్రాంతి పండుగనాడు దైవజ్ఞుల ద్వారా సంక్రాంతి పురుషుని గురించి తెలుసుకోవాలి. ఈ ఏడాది సంక్రాంతి పురుషుడు ఎటువంటి ఆకార విశేషాలను కలిగి, ఏ రంగు దుస్తులు ధరించి, ఏ వాహనం మీద ఎక్కి వస్తాడో, దానినిబట్టి దేశ భవిష్యత్తు తెలుస్తుంది, దానివల్ల రాబోయే ఫలితాలను గుర్తించి తగిన విధంగా మెలగటానికి ప్రయత్నం చెయ్యాలి. సంక్రాంతి రోజే జప తప దానాదుల నాచరించాలి. పండితులకు ధాన్యం, గోధుమలు, తిలలు, వస్త్రాలు, బంగార ం, ధనం, కూరలు, పళ్ళు, ఉదకుంభం వంటి వాటిని దానమివ్వాలి. దానివలన ఆరోగ్యం, వర్చస్సు, ఆత్మ సంస్కారం, గ్రహదోష నివారణ జరుగుతాయి. పితృతర్పణాల వలన వంశాభివృద్ధి జరుగుతుంది. సంక్రాంతి రోజున గంగిరెద్దులను అందంగా అలంకరించి, ఇంటింటికీ గంగిరెద్దు మేళం తెస్తారు. అందరూ గంగిరెద్దుకు నూతన వస్త్రాలు కప్పుతారు. సన్నాయి వాద్యకారులకు ధన, ధాన్య, వస్త్రాదులనిస్తారు. సంక్రాంతి రోజున ఉదయమే శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించబడే హరిదాసు తలపైన రాగి అక్షయ పాత్రను పెట్టుకుని, రెండు చేతులతో చిరతలు వాయిస్తూ, ‘హరిలొ రంగ హరీ‘ అంటూ గానం చేస్తూ వస్తాడు. హరినామం గానం చేస్తూ సాతాని జియ్యరు కూడా వస్తాడు. ప్రజలు సాక్షాత్తు శ్రీహరే తమ ఇంటి ముంగిటికి వచ్చినంతగా ఆనందిస్తూ ఆ రాగి చెంబులో ధాన్యం పోస్తారు. డబ్బులిచ్చి సత్కరిస్తారు. ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు‘ అంటూ చేతిలో డమరుకం పట్టుకుని వాయిస్తూ, జోస్యం చెప్పటానికి బుడబుక్కలవాడు వస్తాడు. ఈశ్వరుని వలె విభూతి రేఖలు నుదుటి మీద ధరించి, చేతిలో శంఖం పట్టుకుని ఓంకార నాదం చేస్తూ ‘హర హర మహాదేవ’ అంటూ శివ నామ సంకీర్తన చేస్తూ జంగమదేవర వస్తాడు. వీరందరూ మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు. వీరందరినీ గౌరవిస్తూ, స్వయంపాకాలనిస్తూ, డబ్బులిస్తూ మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిదీ. వీరందరూ మనందరినీ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో విలసిల్లమని ఆశీర్వదిస్తారు. సంక్రాంతికి ఆంధ్రులు తమ ఇళ్ళల్లో బొమ్మలకొలువును ఏర్పాటు చేసి, బొమ్మలకు ప్రతీకగా పరమాత్మను ్రపార్థిస్తారు.బొమ్మలకు హారతిస్తారు, పేరంటం చేస్తారు. పిల్లలకు పప్పు బెల్లాలు, నువ్వుండలు పంచిపెడతారు. కొత్తగా పెళ్ళైన కూతుళ్ళను, అల్లుళ్ళను ఇంటికి పిలుస్తారు, విందుభోజనాలు, చీరసారె, అల్లుళ్లకు కానుకలూ ఇచ్చి ఆనందిస్తారు. తెలంగాణ ్రపాంతంలో సంక్రాంతి రోజున నోము పడతారు. ముత్తైదువులను ఇంటికి పిలిచి సంక్రాంతి నోము పేరంటం చేస్తారు. కనుమనాడు మనకు పాడిపంటలనిచ్చే గోవులను, ఎద్దులను, పుడమి తల్లినీ పూజిస్తారు. ‘కనుమనాడు మినుము తింటే ఎనుమంత బలం వస్తుంది‘ అంటారు కనుక కనుమనాడు గారెలు, ఆవడలు చేసి దైవానికి నివేదించి భుజిస్తాం. పంటలు, సమృద్ధికి దోహదపడే, వ్యవసాయానికి సహకరించే ఎద్దులను గౌరవించే శుభ దినం కనుమ పండుగ. ఈ విధంగా పుడమికీ, ప్రకృతికీ, మానవులకూ, గోవృషభాలకూ ఉన్న సంబంధాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ మకర సంక్రాంతి పండుగ. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, సామాజిక పరంగా భారత దేశ ప్రజలందరూ జరుపుకునే పెద్ద పండుగ ‘మన సంక్రాంతి పండుగ’. సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు, యువకులు అత్యంత ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేస్తారు. రంగురంగుల గాలిపటాలతో ఆకాశం పగలే అందమైన కదిలే చుక్కలతో ప్రకాశిస్తున్న భ్రాంతిని కలుగజేస్తుంది. గాలిపటం మనకు గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని స్తుంది. దారం మన చేతిలో సవ్యంగా ఉన్నంతసేపే గాలిపటం ఆకాశంలో ఎగురుతుంది. అదుపు తప్పిందా, ఎగిరిపోతుంది. అదేవిధంగా మనం నైతిక విలువలు అనే పట్టులో మెలుగుతున్నంత కాలం సమాజాకాశంలో ఆనందంగా విహరించ గలుగుతాం. విలువలు తప్పితే పతనం తప్పదు, అన్న సత్యాన్ని బోధిస్తుంది. – డా. తంగిరాల విశాలాక్షి, – సోమంచి రాధాకృష్ణ -
బ్రిటన్‌లోకి విదేశీ విద్యార్థుల వలసల కట్టడికి రిషి స్కెచ్!
లండన్: బ్రిటన్‌లోకి విదేశీ విద్యార్థుల రూపంలో పోటెత్తుతున్న వలసల కట్టడికి ప్రధాని రిషి సునాక్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు నిబంధనలను కఠినతరం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దిగువ శ్రేణి డిగ్రీ చదివేందుకు, డిపెండెంట్లుగా ఉండేందుకు వస్తున్న వారందరినీ నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని కార్యాలయ ఉన్నతాధికారి వెల్లడించారని బీబీసీ పేర్కొంది. ‘‘వలసలు బ్రిటన్ను వేధిస్తున్నాయి. 2021లో 1,73,000గా ఉన్న వలసలు ఈ ఏడాది 5,04,000కు పెరిగాయి. విదేశీ విద్యార్థుల్లో చైనాను భారతీయులు వెనక్కినెట్టారు. కానీ వీరిని తగ్గిస్తే ఆ సీట్లను బ్రిటన్ వర్సిటీలు స్థానిక విద్యార్థులకు తక్కువ ఫీజుకే ఇవ్వాల్సి ఉంటుంది. అవి భారీ ఆదాయాన్ని కోల్పోతాయి. ఆదాయం కాపాడుకుంటూ, అంతర్జాతీయ విద్యార్థుల్ని తగ్గించుకోవడం సంక్షిష్టమైన అంశం’’ అని సునాక్ అధికార ప్రతినిధి శుక్రవారం అన్నారు. భారత విద్యార్థులు వీసా ముగిసినా బ్రిటన్‌లో తిష్ట వేస్తున్నారన్న హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ వ్యాఖ్యలు దీనికి నేపథ్యంగా భావిస్తున్నారు. -
భారత్‌తో పాటు ఇతర దేశాలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు
Taiwan said it will continue to enhance its self-defence capabilities: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన ఎంత పెద్ద పెను వివాదంగా మారిందో తెలిసిందే. ఒక పక్క తైవాన్‌ని అడ్డుపెట్టుకుని అమెరికా తమపై కుట్ర చేస్తుందంటూ డ్రాగన్ కంట్రీ నిప్పులు కక్కుతోంది. అమెరికా సైతం తాము అనుకున్నదే చేస్తామని తగ్గకపోవడంతో భవిష్యత్తులో జరగబోయే ఏ పరిణామానికైన అగ్రరాజ్యమే కారణమంటూ కయ్యానికి కాలుదువ్వింది చైనా. ఈ మేరకు తైవాన్ జలసంధిలో మిలటరీ డ్రిల్లు చేపట్టింది. తైవాన్ భయపట్టించేలా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున్న సైనిక విన్యాసాలు ప్రారంభించింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతవరణం నెలకొంది. దీంతో జపాన్, భారత్‌తో సహ ఇతర దేశాలు తైవాన్ జలసంధి అంతటా అంతర్జాతీయ భద్రతను కాపాడేలా సమన్వయంగా వ్యవహరించాలని చెబుతూ.. ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం నెలకొల్పేలే పిలుపునిచ్చాయి. ఈ మేరకు భారత్ ఇతర దేశాల మాదిరిగా ఆందోళన వ్యక్తపరుస్తూ.. తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గి ఈ ప్రాంతంలో శాంతి, సంయమనం పాటించాలని, ఏకపక్ష చర్యలను నివారించాలని కోరుతున్నాము" అని విదేశీ వ్యవహారాలు మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చ పిలుపునిచ్చారు. దీంతో తైవాన్, చైనా విషయంలో భారత్‌తో సహా ఇతర దేశాలు తమకు మద్ధతు ఇచ్చినందుకు ధన్యావాదాలు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో స్నేహం చేయడానికి, సంబంధాలు కొనసాగించడానికి తాము అర్హులమని తైవాన్ పేర్కొంది. ఈ క్రమంలో తైవాన్ అంతర్జాతీయ భద్రతను కాపాడేలా భారత్‌తో సహా ఇతర దేశాలతో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగిస్తూనే తమ ఆత్మరక్షణ సామర్థ్యాలను పెంపొందించుకుంటామని వెల్లడించింది. -
కరోనా నేర్పిన పాఠాలు: విదేశాలవైపు భారతీయుల చూపు
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన దేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలన్న ధోరణి విస్తృతమవుతోంది. కరోనా మహమ్మారి సృష్టించిన విలయాన్ని చూసి.. మెరుగైన ఆరోగ్య వసతులు ఉన్న చోటకు వలసపోదామన్న ఆలోచన వ్యాపారస్తుల్లో కలుగుతోంది. ఢిల్లీకి చెందిన ఓ సీనియర్ వ్యాపారి మూడు దశాబ్దాల్లో బాగానే ఆస్తులను సమకూర్చుకున్నారు. తాజా పరిస్థితుల్లో అతడు తన కుటుంబాన్ని తీసుకుని న్యూజిలాండ్ లేదా కెనడాకు వెళ్లి స్థిరపడే ఆలోచనలో ఉన్నాడు. దీని వెనుక ఓ బలమైన కారణమే ఉంది. అతడి సమీప బంధువు ఒక్కగానొక్క కుమారుడు కరోనాకు బలైపోవడాన్ని చూసిన తర్వాతే అతడిలో ఈ మార్పు వచ్చింది. ఎంత డబ్బుంటేమి.. ప్రాణాలు దక్కలేదు! అన్న బాధతో పరాయి దేశానికి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. నోయిడాకు చెందిన మరో వ్యాపారి తన కుటుంబాన్ని తీసుకుని ఖతార్ వెళ్లిపోయాడు. మెరుగైన హెల్త్‌కేర్ వసతుల కోసమే అతడు వలసపోయాడు. ఈ ఇద్దరే అని కాదు కరోనా వచ్చిన తర్వాత దేశం వీడిన వారి సంఖ్య వేలల్లో ఉంటుందని ట్రావెల్ పరిశ్రమ వర్గాల సమాచారం ఆధారంగా తెలుస్తోంది. మెరుగైన వైద్యం కావాలి.. కరోనా రెండో విడత చాలా తీవ్రంగా ఉండడం, లక్షలాది కేసులు రోజువారీగా నమోదు కావడాన్ని చూశాం. ఆస్పత్రుల్లో పడకలు లభించడానికి చాలా ప్రాంతాల్లో అవస్థలు పడాల్సి వచ్చింది. పడకలు, వైద్యం లభించక పోయిన ప్రాణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్, ఔషధాలు అందక, ఆస్పత్రుల్లో ఐసీయూలు, పడకలపై ఉన్న వారికి ఆక్సిజన్ సరిపోక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో మెరుగైన వైద్య వసతులు ఏ ఏ దేశాల్లో ఉన్నాయనే విషయమై విచారణ చేస్తూ, విదేశాలకు ప్రయాణం కట్టేందుకు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. ధనవంతులే కాకుండా, ఎగువ మధ్యతరగతి వర్గాల వారిలోనూ ఈ ధోరణి కనిపిస్తోందని పర్యాటక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన రెండు నెలల్లో విదేశాలకు వలసపోవడంపై విచారించే వారి సంఖ్య 20 శాతం పెరిగిందని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రానున్న రోజుల్లో విదేశాలకు సంబంధించి విచారణలు మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తెలిసిన వారి సూచనలతో చాలా మంది పర్యాటక సంస్థలను ఆశ్రయిస్తున్నారు. సులభతర వీసా విధానం అమెరికా, కెనాడా, ఆస్ట్రేలియా వంటి ప్రముఖ దేశాలనే కాదు.. చిన్న దేశాలైన ఆస్ట్రియా, ఐర్లాండ్, పోర్చుగల్, మాల్టా, సైప్రస్, టర్కీ దేశాల్లో వసతులు, జీవన విధానం ఎలా ఉంటుందనే వివరాలను తెలుసుకునేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నట్టు ట్రావెల్ పరిశ్రమకు చెందిన వారు తెలిపారు. ప్రధానంగా సులభ వీసా ఏ దేశం నుంచి లభిస్తుంటే ఆ దేశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఎక్కువ మంది ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌కే మొగ్గు చూపిస్తున్నారు. ‘‘కరోనా రెండో దశలో ప్రతీ కుటుంబంపై ప్రభావం చూపించింది. దీంతో వలసవిధానంలో ఇటీవల స్పష్టమైన మార్పు కనిపిస్తోంది’’ అని వీసా, ఇమిగ్రేషన్ సేవల సంస్థ ఐవీఏసీఎస్ డైరెక్టర్ చంద్రజిత్‌సింగ్ తెలిపారు. కరోనా రాక ముందు వరకు వ్యాపార అవకాశాల విస్తరణ కోసం, సులభతర పన్నుల విధానం చూసి విదేశాలకు వలసవెళ్లే వారు ఎక్కువగా ఉండే వారని.. ఇప్పుడు మెరుగైన వైద్య వసతులు కూడా ప్రాధాన్యాల జాబితాలోకి చేరిపోయిందని ఆయన చెప్పారు. -
IPL2021: ఎప్పుడు, ఎక్కడ, ఎలా...?
-
IPL2021: ఎప్పుడు, ఎక్కడ, ఎలా...?
బీసీసీఐ అధికారిక ప్రకటన ప్రకారం ఈ ఏడాది ఐపీఎల్ ప్రస్తుతానికి వాయిదా పడిందంతే. 2021 సీజన్‌ను రద్దు చేయలేదని బోర్డు ఉన్నతాధికారులు ఇప్పటికే వెల్లడించారు. లీగ్ నిర్వహణతో పెద్ద మొత్తంలో ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో మిగిలిన 31 మ్యాచ్‌లను కూడా నిర్వహించి టోర్నీని ముగించాలనేది బోర్డు ఆలోచన. అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే భారత్‌లో రాబోయే కొన్ని నెలల్లో కూడా ఇప్పట్లో కరోనా తగ్గిపోయి పరిస్థితులు మెరుగుపడే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి మన దేశంలో మాత్రం జరగడం మాత్రం దాదాపు అసాధ్యం. అసలు బోర్డు ముందు అవకాశాలు, అనుకూల సమయం, సాధ్యాసాధ్యాలు ఏమిటనే అంశాలను చూస్తే... యూఏఈలో అయితే... ఐపీఎల్లో మరో 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సాధ్యమైనన్ని సార్లు రోజూ రెండు మ్యాచ్‌లు నిర్వహించగలిగితే గరిష్టంగా మూడు వారాల్లో టోర్నీని ముగించవచ్చు. టి20 ప్రపంచకప్‌కు ముందుగానీ తర్వాతగానీ టోర్నీని నిర్వహించాలని బోర్డు యోచిస్తోంది. వేదిక అనగానే అన్నింటికంటే ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పేరు వినిపిస్తోంది. ఇప్పటికే భారత్ నుంచి తరలించి టి20 ప్రపంచకప్‌ను కూడా ఇక్కడే జరపాలని భావిస్తున్న నేపథ్యంలో యూఏఈ అందరికీ అనుకూలంగా ఉంటుంది. పైగా 2020 ఐపీఎల్లో ఒక్క సమస్య కూడా లేకుండా విజయవంతంగా నిర్వహించిన రికార్డు కూడా ఉంది. వరల్డ్‌కప్ ఇక్కడే ఉంటే బయో బబుల్‌లు మారాల్సిన సమస్య కూడా పెద్దగా ఉదయించదు. కరోనా కరుణిస్తేనే... అన్నింటికి మించి కరోనా తీవ్రతనే ఐపీఎల్ నిర్వహణను శాసిస్తుందనేది వాస్తవం. టి20 ప్రపంచకప్ నిర్వహణకు కూడా ఇదే వర్తిస్తుంది. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు. ఇంగ్లండ్‌లో టోర్నీ నిర్వహించినా... అక్కడి ఆంక్షలు, క్వారంటైన్ నిబంధనల కారణంగా వివిధ దేశాల క్రికెటర్లందరినీ అక్కడికి చేర్చడం అంత సులువు కాదు. దాదాపు అదే సమయంలో ప్రతీ జట్టుకు ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పినట్లు అన్ని క్రికెట్ బోర్డులతో మాట్లాడి ఇతర షెడ్యూల్ల విషయంలో కాస్త మార్పుచేర్పులు చేయగలిగితేనే ఐపీఎల్ జరుగుతుంది. ఇంగ్లండ్‌లో అయితే... ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం సెప్టెంబర్ 14 వరకు భారత జట్టు ఆ దేశంలోనే ఉంటోంది. పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా ఇంగ్లండ్‌లోని లీగ్‌లలో ఆడుతుంటారు కాబట్టి పని సులువవుతుంది. సెప్టెంబర్‌లో తమ వద్ద ఐపీఎల్ నిర్వహించుకోవచ్చని, ఇదే విషయాన్ని బీసీసీఐతో మాట్లాడాలంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి పలు కౌంటీలు లేఖ రాశాయి. మిడిల్‌ఎసెక్స్, సర్రే, వార్విక్షైర్, లాంకషైర్ కౌంటీలు ఐపీఎల్ నిర్వహణ కోసం ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే భారత్ కోణంలో చూస్తే ఇది అంత సులువైన విషయం కాదని... దీనిపై ఇంకా ఎలాంటి చర్చ జరగలేదని కూడా ఈసీబీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సెప్టెంబర్ చివర్లో అయితే... భారత జట్టు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడిన తర్వాత, ఆ తర్వాత ప్రపంచకప్‌కు ముందు మిగిలిన పరిమిత సమయంలో టోర్నీని నిర్వహించడం పెద్ద సవాల్ కావచ్చు. అక్టోబర్ 16 నుంచి టి20 ప్రపంచకప్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. క్వారంటైన్ సమయం, వార్మప్ మ్యాచ్‌లు చూసుకుంటే సెప్టెంబర్ చివరి నుంచి జట్లు వరల్డ్‌కప్ వేదికలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్‌తో సుదీర్ఘ సిరీస్, ఐపీఎల్, వరల్డ్‌కప్... ఇలా వరుసగా ఆడాలంటే భారత ఆటగాళ్లకే చాలా ఇబ్బంది. వారంతా కనీసం వారం రోజులు విశ్రాంతి ఆశిస్తారు. అప్పుడు రెండు వారాల సమయమే మిగులుతుంది. మరోవైపు అదే తేదీల్లో ఇంగ్లండ్... బంగ్లాదేశ్, పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. నవంబర్ చివర్లో జరిగితే... వరల్డ్‌కప్ ముగిసిన వెంటనే ఐపీఎల్‌ను నిర్వహించాలి. పరిస్థితులు మెరుగుపడితే మన దేశంలోనే జరపవచ్చు కూడా. అయితే విదేశీ ఆటగాళ్లు అందుబాటులోకి రావడం కష్టంగా మారిపోతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు నవంబర్ చివరి వారం నుంచి ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఉంటుంది. భారత్‌కు కూడా వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ ఈ సిరీస్ షెడ్యూల్‌ను కాస్త వెనక్కి జరిపే ప్రత్యామ్నాయం ఒకటి మిగిలి ఉంది. అయితే ఆసీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లు లేకుండా వేరే ఆటగాళ్లతో ముగించగలమని భావిస్తే నవంబర్ చివరి వారం ఐపీఎల్ నిర్వహణకు సరైన సమయం. –సాక్షి క్రీడా విభాగం -
బంధాలు బలోపేతం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సొంతం చేసుకున్నారు. అధ్యక్షుడి హోదాలో శ్వేతసౌధంలో అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. జగమొండి డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల పాలనలో ఇతర దేశాలతో అమెరికా సంబంధాల విషయంలో గణనీయమైన మార్పులే సంభవించాయి. కొన్ని దేశాలతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక జో బైడెన్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇతర దేశాలతో సాన్నిహిత్యం పెంచుకోవడం తమ ఎజెండాలోని కీలక అంశమని ఆయన ఎన్నికల ప్రచారంలో పలుమార్లు స్పష్టం చేశారు. దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అందుకే ప్రపంచ దేశాలన్నీ అమెరికా కొత్త అధ్యక్షుడి విధాన నిర్ణయాలు ఎలా ఉంటాయన్న దానిపై దృష్టి పెట్టాయి. చైనాపై సానుకూల ధోరణి! ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదగాలని తహతహలాడుతూ తమకు పక్కల్లో బల్లెంలా మారిన చైనాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారాలు మిరియాలు నూరారు. ఆ దేశంలో పలు అంక్షలు విధించారు. కరోనా వైరస్ పుట్టుకకు, వ్యాప్తికి చైనాయే కారణమని దూషించారు. వాణిజ్య యుద్ధానికి తెర తీశారు. ట్రంప్ ఇంటిముఖం పడుతుండడంతో పరిస్థితులు మారిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనా విషయంలో అమెరికా నాయకత్వం సానుకూల ధోరణి కనబరిచే అవకాశం ఉందంటున్నారు. బైడెన్ గెలుపును చైనాలో మెజారిటీ జనం స్వాగతిస్తున్నారట! ఇక ఎన్ని భేదాభిప్రాయాలున్నా ఇండియాతో స్నేహాన్ని అమెరికా వదులుకోలేని పరిస్థితి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్ పెట్టాలన్నా, అంతర్జాతీయ ఉగ్రవాదంపై యుద్ధం చేయాలన్న అమెరికాకు ఇండియా అండ కావాల్సిందే. కశ్మీర్, మైనారిటీల విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజమే అయినా ఇండియా విషయంలో ఆయన వ్యతిరేకంగా వెళ్లలేరని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భారత సంతతి మహిళ కావడం ఇండియాకు కొంత కలిసొచ్చే అంశమే. ఉత్తర కొరియాతో స్నేహమే దూర్త దేశం అని అమెరికా ఒకప్పుడు అభివర్ణించిన ఉత్తర కొరియాతో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో పలు సందర్భాల్లో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు కొన్ని ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు. ట్రంప్ ప్రయత్నాలను బైడెన్ కొనసాగించే పరిస్థితి కనిపిస్తోంది. రష్యాపై మరిన్ని ఆంక్షలు? అమెరికాకు రష్యా నుంచి పెద్ద ముప్పు ఉందని జో బైడెన్ ఇటీవలే వ్యాఖ్యానించారు. బైడెన్ పాలనలో తమ దేశంలో మరిన్ని ఒత్తిళ్లు, ఆంక్షలు తప్పకపోవచ్చని రష్యా నాయకత్వం అనుమాని స్తోంది. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రష్యా అండతోనే డొనాల్డ్ ట్రంప్ గెలిచారన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. బైడెన్ హయాంలో అమెరికా–రష్యా సంబంధాలు బలహీనపడే అవకాశాలున్నాయి. ఊపిరి పీల్చుకున్న ఇరాన్ ట్రంప్ పాలనలో అమెరికాకు ఇరాన్ బద్ధవ్యతిరేకిగా మారిపోయింది. అమెరికా విధించిన ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దిగజారింది. అగ్రరాజ్యం ఆదేశాల మేరకు ఇతర దేశాలు ఇరాన్‌తో సంబంధాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇరాన్లో జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా హతమార్చడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ట్రంప్ ఓడిపోయి, బైడెన్ గెలవడంతో ఇరాన్ ఊపిరి పీల్చుకుంది. బైడెన్ చొరవతో తమ దేశంపై ఆంక్షలు తొలగిపోతాయని, ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని ఇరాన్ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు జర్మనీ, ఈజిప్టు, ఇజ్రాయెల్, కెనడా వంటి దేశాలతో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. -
అనవసర యుద్ధాలకు దూరం
వాషింగ్టన్: ఇకపై విదేశాల్లో జరిగే యుద్ధాలకు తమ బలగాలను పంపమని, అవన్నీ అంతులేని నిరర్థక యుద్ధాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న తమ సైనికులను వెనక్కు రప్పిస్తామన్నారు. కేవలం తమ దేశానికి ప్రమాదమైన టెర్రరిస్టులను మట్టుపెట్టేందుకు మాత్రమే ఈ సైన్యాన్ని ఉపయోగిస్తామన్నారు. ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ దశాబ్దాలుగా అమెరికా రాజకీయవేత్తలు విదేశాల పునర్నిర్మాణం, విదేశీయుద్ధాల్లో పోరాడటం, విదేశీ సరిహద్దులను కాపాడడం వంటి పనులపై లక్షల కోట్ల డాలర్లు వెచ్చించారన్నారు. కానీ ప్రస్తుతం అమెరికా సేనలు అమెరికాను, అమెరికా నగరాలను రక్షించేందుకు పరిమితమవుతున్నాయని, అమెరికా బలగాలు స్వదేశాలకు వస్తున్నాయని చెప్పారు. విదేశాల్లో జరిగే అనవసర యుద్ధాలకు సైన్యం వెళ్లదని, కానీ దేశానికి ముప్పుగా భావించే ఉగ్రవాదులను మాత్రం వదిలిపెట్టదని చెప్పారు. తమకున్నంత సైనిక సంపత్తి ఎవరికీ లేదని, బలం చూపించే శాంతిని పరిరక్షిస్తామని వివరించారు. ఈ ర్యాలీకి జనం భారీగా హాజరయ్యారు. కరోనా నిబంధనలను పక్కనబెట్టిమరీ జనం హాజరుకావడం ట్రంప్‌నకు మంచి ఉత్సాహాన్నిచ్చింది. డెమొక్రాట్లు అధికారంలోకి వస్తే పన్నులు పెంచుతారని, ఆయుధాల హక్కును రద్దు చేస్తారని, ఆ పార్టీ నిండా వామపక్షవాదులున్నారని దుయ్యబట్టారు. క్యూబా, వెనుజులా విధానాలను డెమొక్రాట్లు అమలు చేస్తారని విమర్శించారు. డెమొక్రాట్ నాయకురాలు కమలా హారిస్‌పై నేరుగా విమర్శలు చేశారు. కరోనా సంక్షోభం నుంచి అమెరికా ఎకానమీని తొందరగా బయటకు రప్పించామని చెప్పుకున్నారు. -
టీకా ఇతర దేశాలకూ ఇస్తాం: ట్రంప్
వాషింగ్టన్: కరోనా వైరస్ నిరోధానికి సిద్ధం చేస్తున్న టీకాలను అమెరికా ఇతర దేశాలకు సరఫరా చేసే అవకాశాలు లేకపోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. టీకా తయారైన తరువాత దేశవ్యాప్తంగా వేగంగా టీకా ఉత్పత్తి చేపడతామని, కరోనా చికిత్సకు ఉపయోగపడే వెంటిలేటర్లు సరఫరా చేసినట్లే టీకాను కూడా ఇతర దేశాలకు అందిస్తామని మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరికిగానీ.. వచ్చే ఏడాది మొదట్లోగానీ టీకా అందుబాటులోకి రాచవ్చనని ట్రంప్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. -
మనది 20.. అమెరికా 200!!
కరోనా ప్రభావంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి కేంద్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. మన జీడీపీలో ఇది 10 శాతం. ఈ 20 లక్షల కోట్లలో నిజానికి రూ.9.94 లక్షల కోట్ల ఉద్దీపనను ఇప్పటికే రకరకాలుగా అందజేసినట్లు తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీనికిప్పుడు రూ.1.7 లక్షల కోట్లు జత చేశామన్నారు. ఇదికాక మార్చి 27 నుంచి ఆర్బీఐ రూ.8.02 లక్షల కోట్ల విలువైన వివిధ ద్రవ్య చర్యలను ప్రకటించింది. ఈ ప్యాకేజీలో రూ.12.95 లక్షల కోట్లు ఆహార భద్రతకు, కూలీల నగదు పంపిణీకి (మనిషికి రూ.500 చొప్పున), గ్రామీణ ఉపాధి పథకానికి, సూక్ష్మ, మధ్యస్థ కంపెనీలకు రుణాలివ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పారామె. ఈ ప్యాకేజీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మిగతా దేశాలు ఏం చేశాయో ఒక్కసారి చూద్దాం... చైనా... రూ.100 లక్షల కోట్లు ► ఉద్దీపన చర్యల నిమిత్తం జీడీపీలో 2.5 శాతాన్ని (34 వేల కోట్ల డాలర్లు) ప్రకటించింది. మన కరెన్సీలో ఇది రూ.25.5 లక్షల కోట్లు. దీన్లో రూ.12 లక్షల కోట్లమేర చర్యలను ఇప్పటికే అమలు చేసింది. మరో రూ.13 లక్షల కోట్ల మేర లోకల్ బాండ్లను కొనుగోలు చేసింది. ► రూ.32 లక్షల కోట్ల మేర వ్యవస్థలోకి నగదు పంపి లిక్విడిటీని పెంచింది. ఇంకా రుణాలున్న వారికి కొత్త రుణాలివ్వటానికి, రీ–డిస్కౌంట్ చేయడానికి మరో రూ.17 లక్షల కోట్లు కేటాయించింది. ► పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఏకంగా 1.5 శాతం వడ్డీ రేట్లను తగ్గించింది. (డాక్టర్ రెడ్డీస్ లాభం 764 కోట్లు) జపాన్... రూ.80 లక్షల కోట్లు ► జీడీపీలో అత్యధికంగా 21.1 శాతాన్ని అత్యవసర ఆర్థిక ప్యాకేజీగా ప్రకటించింది. మన కరెన్సీలో ఇది దాదాపు రూ.80లక్షల కోట్లు. కాకపోతే దీన్లో రూ.60 లక్షల కోట్లను వ్యాపారాలు, ఉద్యోగాల్ని రక్షించుకోవటానికే వినియోగిస్తోంది. ► చిన్న వ్యాపారాలకు రాయితీలపై రుణాలు అందిస్తోంది. లిక్విడిటీని మెరుగుపరచటానికి ప్రభుత్వ బాండ్ల సంఖ్యను పెంచటం, ఎక్కువసార్లు జారీ చేయటం వంటి చర్యలు తీసుకుంది. జర్మనీ.. రూ.30 లక్షల కోట్లు ► కరోనా మహమ్మారిపై పోరాడటానికి జర్మనీ తన జీడీపీలో 10.7 శాతాన్ని (40 వేల కోట్ల డాలర్లు) కేటాయించింది. మన కరెన్సీలో ఇది రూ.30 లక్షల కోట్లు. దీన్లో సగం మొత్తాన్ని స్వల్పకాలిక పనులకు, ఉద్యోగాలను కాపాడటానికి వినియోగిస్తోంది. ► వివిధ వర్గాలకిచ్చే రుణాలను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 23 శాతానికి పెంచేలా (మన కరెన్సీలో 86.25 లక్షల కోట్లు) ప్రభుత్వ గ్యారంటీలను వినియోగిస్తోంది. ► ఇక అక్కడి స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ప్యాకేజీలు దీనికి అదనం. రుణాల చెల్లింపులకు కూడా జూన్ 30 వరకూ మూడు నెలల మారటోరియం ఇచ్చింది. అమెరికా.. రూ.207 లక్షల కోట్లు పే–చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్, ఆరోగ్య సంరక్షణ అభివృద్ధికి జీడీపీలో 2.3 శాతాన్ని (50 వేల కోట్ల డాలర్లు) ప్రకటించింది. మన కరెన్సీలో ఇది రూ.37.5 లక్షల కోట్లు. పే–చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అంటే... కంపెనీలు మూతబడే ప్రమాదాన్ని తప్పించడానికి అవి తమ ఉద్యోగులకిచ్చే జీతాల్లో 8 వారాల జీతాన్ని ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది. ఫిబ్రవరి నుంచి జూన్ 30 మధ్య ఏ సమయంలోనైనా ఈ 8 వారాల జీతం కోసం కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు. ► కరోనా వైరస్ ప్రభావం నుంచి ఉపశమనం పొందటానికి, జనానికి సాయం చేయడానికి. ఆర్థిక సహకారానికి ప్రభుత్వం ఏకంగా 2 లక్షల కోట్ల డాలర్ల (మన కరెన్సీలో 150 లక్షల కోట్లు) ప్యాకేజీని ఆమోదించింది. ► ఏప్రిల్ 2 నుంచి డిసెంబర్ 31 మధ్య కరోనా వైరస్ బారినపడి సెలవులు పెట్టుకున్నవారికి పెయిడ్ లీవ్ ఇచ్చేందుకు మరో 20.5 వేల కోట్ల డాలర్లు (రూ.15.35 లక్షల కోట్లు) కేటాయించింది. ► ఇదికాక ఫెడరల్ రిజర్వు బ్యాంకులకు తానిచ్చే సొమ్ముపై వసూలు చేసే వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చింది. ఇది ఏకంగా 1.5%తగ్గించడంతో ప్రస్తుతం వడ్డీ రేటు 0.25 శాతమే. -
సెట్ ఇన్ ఇండియా
హీరో – హీరోయిన్ కళ్లల్లో కళ్లు పెట్టుకొని ఒకరినొకరు ప్రేమగా చూసుకున్నారు. కట్ చేస్తే.. ఈఫిల్ టవర్ ముందుంటారు ఇద్దరూ. ఫారిన్ వీధుల్లో ప్రేమ పాట పాడుకుంటారు. విదేశాల్లో ఉంటూ స్వదేశ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తుంటాడు విలన్. అతడ్ని పట్టుకోవడానికి ఫారిన్ బయలుదేరతాడు మన పోలీస్ హీరో. ఇలా పాటకో, ఫైటుకో, కొన్నిసార్లు కథానుసారం, కొన్ని సార్లు హంగామానుసారం విదేశాలలో షూటింగ్ చేస్తారు. కథా వస్తువులాగో, బ్యాక్ డ్రాప్ లాగానో, లేదంటే హంగామా కోసమో ‘విదేశాలు – విదేశీ లొకేషన్లు’’ మన సినిమాకి ఎప్పుడూ ఉపయోగపడుతున్నాయి. అయితే కరోనా వల్ల ఇక ఈ అనుబంధం కొనసాగుతుందా? సందేహమే! ఇండస్ట్రీకి కుడా ఈ పరిస్థితి ఇంకా అర్థం అవ్వడం లేదు. ప్రతిసారీ విదేశాలు వెళ్లకపోయినా ఆ మూడ్ ని మన స్టూడియోలలో సెట్ వేసి, ప్రతిబింబించేలా చేసిన సందర్భాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో న్యూయార్క్ వీధిని హైదరాబాద్ నానక్ రామ్ గూడకి తీసుకొచ్చాం. లండన్ నగరాన్ని మన హైదరాబాద్ స్టూడియోలలో నిర్మించుకున్నాం. నెక్ట్స్ అదే పద్ధతిని అందరూ పాటించాలా? కరోనా ఎక్కడి వాళ్లను అక్కడే గప్ చుప్ సాంబార్ బుడ్డి అనేసింది. దాంతో ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సినిమా షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయి? ఒకవేళ మొదలయితే మునుపటి లాగా చేసుకునే వీలుందా? లేదా? ఈ సమయంలో ‘విదేశాల్లో షూటింగ్’’ ప్రస్తుతం ఇండస్ట్రీ ముందు ఉన్న అతి పెద్ద సవాల్. విదేశాల్లో షూట్ చేయడానికి ప్లాన్ చేసుకున్న సినిమాలు, ఆల్రెడీ సగం షూటింగ్ అయి మిగతా సగాన్ని పూర్తి చేయడానికి ఎదురు చూస్తున్న సినిమాల పరిస్థితి డైలమాలో పడింది. ఈ సినిమాల నెక్ట్స్‌స్టెప్ ఏంటి? ప్రత్యామ్నాయం ఏంటి? కొందరిని అడిగాం. ఈ విధంగా చెప్పారు. ఆ వివరాలు. ప్రభాస్ 20 రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ పీరియాడిక్ సినిమా చేస్తున్నారు. ఇటలీ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రకథ నడుస్తుంది. కరోనా విస్తృతంగా మొదలవుతున్న సమయంలోనూ జార్జియాలో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు టీమ్. మళ్లీ షూటింగ్ ఎప్పుడు? నెక్ట్స్ ఏంటి? అని ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్‌ని అడిగితే ఈ విధంగా స్పందించారు. ‘‘కరోనా వల్ల చిన్న సినిమా.. పెద్ద సినిమా అని కాదు.. సినిమాలన్నీ ఇబ్బందుల్లో పడ్డాయి. సినిమాలు కచ్చితంగా వాయిదా పడుతుంటాయి. ప్రభాస్, సాయిధరమ్ తేజ్ మా సినిమా కథానుసారం ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లో జరిపాలి. కొన్ని రోజుల్లో లేదా నెలల్లో షూటింగ్‌లు ప్రారంభం అవుతాయి. ఆం్ర«ధ, తెలంగాణలో షూటింగ్స్ చేసుకోవచ్చు. కొంచెం ప్రయత్నించి ఇండియాలో తిరగొచ్చు. విదేశాలలో షూటింగ్ అనేది ఎలా వీలవుతుందా అని ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికి విదేశాల్లో చిత్రీకరించే ఇన్ డోర్ సన్నివేశాలన్నీ ఇక్కడే సెట్ వేసి షూట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక ఆరు నెలలు వేచి చూస్తాం. ఈలోగా ఇక్కడ షూటింగ్ పార్ట్, ఇన్ డోర్ మొత్తం పూర్తి చేయాలనుకుంటున్నాం. ఈ ఆరు నెలల్లో పరిస్థితిని బట్టి మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అయితే అందరూ ఇది చాలా పెద్ద ఇబ్బంది అనుకుంటున్నారు. కానీ నేను దీంట్లో ఓ భారీ ఛాలెంజ్‌ని చూస్తున్నాను. ఈ ఛాలెంజ్‌ని దాటగలిగితే ఫ్యూచర్ సినిమాలకు మార్గదర్శకంగా నిలుస్తాం. ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం. విదేశాల్లో తీయాల్సిన పాటల్ని, సన్నివేశాల్ని అదే క్వాలిటీతో ఇక్కడ సెట్స్ ద్వారా సాధించగలిగితే ఫారిన్ వెళ్లే పనిని చాలా శాతం తగ్గించుకోవచ్చు. సినిమా అంటేనే ఛాలెంజ్‌ని ఎదుర్కొని అవుట్ పుట్ సంపాదించడం కదా?’’ అన్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ నిర్మిస్తున్నాయి. పుష్ప అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘పుష్ప’ సినిమాలో పలు కీలక సన్నివేశాలను మన రాష్ట్రాల్లోనే పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ విషయం గురించి ‘పుష్ప’ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం కరోనా వల్ల కావాలనుకున్న చోట షూటింగ్ చేయాలనుకోవడం కచ్చితంగా కుదరదు. మా సినిమాకు ఇంకా సెట్ వర్క్ ఏం స్టార్ట్ చేయలేదు. కానీ అడవి ప్రాంతాల్లో షూటింగ్ ఎక్కువ శాతం ఉంది. చిత్తూరు, వికారాబాద్ అడవుల్లో షూట్ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ అన్నీ కుదిరితే కేరళలో కొంత భాగం షూట్ చేస్తాం. మా బ్యానర్ లో మిగతా సినిమాల్లో ఏదైనా ఫారిన్ లో ఉంటే తర్వాత ఆలోచిస్తాం. సినిమా అంటేనే క్రియేషన్. క్రియేటివ్ వర్క్‌ని ఇక్కడే చేయాలి.. అక్కడే చేయాలని నిబంధనలు పెట్టుకోలేం. సో.. అన్ని సినిమాలూ ఇండియాలోనే చేస్తామా? అంటే ఇప్పుడే ఏం చెప్పలేం’’ అని పేర్కొన్నారు. లవ్ స్టోరీ నాగ చైతన్య – శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. సాయి పల్లవి హీరోయిన్. 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. ఈ సినిమాలో ఓ పాటను దుబాయ్‌లో చిత్రీకరించారు. ఇంకో పాటను కూడా మరో ఫారిన్ కంట్రీలో తీయాలన్నది ప్లాన్. కానీ ఆ ప్లాన్ మారిపోయింది. ఇండియాలోనే ఈ పాటను షూట్ చేయాలని చిత్రబృందం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ‘లవ్ స్టోరీ’లో నాగచైతన్య, సాయిపల్లవి ఫైటర్ పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం కలసిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ప్యాన్ ఇండియా సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. పూరి, ఛార్మి, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ముంబై – ఫారిన్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలిసింది. బ్యాక్ డ్రాప్లో కొంత ఫారిన్ కాబట్టి అక్కడ షూటింగ్ తప్పనిసరి అట. అంతా చక్కబడే వరకు ఓ నిర్ణయానికి రాలేమని చిత్రబృందం నుంచి సమాచారం. ‘ఫైటర్’లో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే మోసగాళ్ళు ఇంగ్లిష్ – తెలుగు భాషల్లో మంచు విష్ణు ఓ భారీ క్రాస్ ఓవర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘మోసగాళ్ళు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. ఓ ఐటీ స్కామ్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలోని కీలక భాగాన్ని అమెరికాలో షూట్ చేశారు. చిత్రీకరణ దాదాపు పూర్తయింది. మిగతా భాగాన్ని అమెరికాలోనే తీయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో నటించడంతోపాటు నిర్మిస్తున్నారు విష్ణు. ‘మోసగాళ్ళు’లో విష్ణు మరికొన్ని... రవితేజ ‘క్రాక్’ సినిమా పాటల మినహా షూటింగ్ పూర్తి అయింది. ఈ పాటల్ని ఫారిన్ లో చిత్రీకరించాలని అనుకున్నారు. ఇప్పుడు ఊటీ లేదా మున్నార్ వంటి ప్రదేశాల్లో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ చిత్రం బ్యాంకాక్ షెడ్యుల్ పూర్తి చేయాల్సి ఉంది. అది కూడా డైలమాలో ఉంది. సాయి ధరమ్ తేజ్ ‘సోలో బతుకే సో బెటర్’ చిత్రంలో ఉన్న ఫారిన్ షెడ్యూల్స్ ని ఇండియాలోనే చేయాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది. ‘క్రాక్’లో రవితేజ, శ్రుతీహాసన్.. సో కరోనా వల్ల కథల్లో మార్పు రాబోతోందా? కథ జరిగే ప్రదేశాల్లో మార్పు ఉండబోతోందా? కథలన్నీ మన దగ్గరే సెట్ చేస్తారా? లేదంటే కావాల్సిన ప్రదేశాల సెట్ వేస్తారా? రాబోయే రోజుల్లో సినిమా కథలన్నీ ‘సెట్ ఇన్ ఇండియా’యేనా? కావాల్సిన లొకేషన్స్ ని సెట్లుగా మార్చుకోవడమేనా? చూస్తుంటే అదే అయ్యేలా ఉంది. అదే జరిగితే క్రియేటివ్ గా కొంచెం రాజీ పడాలేమో? ఈ సరికొత్త ఛాలెంజ్ ను ఇండస్ట్రీ ఎలా తీసుకుంటుంది? ప్రతిదానికీ ప్లాన్ ఎ వర్కవుట్ కాకపోతే ప్లాన్ బి ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీ ప్లాన్ బి ఆలోచిస్తోందా? రానున్న రోజులు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాయి. – గౌతమ్ మల్లాది ∙ ∙ -
రెడ్డీస్ నుంచి ఐదేళ్లలో 70 ఔషధాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వచ్చే ఐదేళ్లలో చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ వంటి తూర్పు ఆసియా దేశాల్లో 70కి పైగా ఔషధాలను విడుదల చేయాలని లకి‡్ష్యంచింది. ఇప్పటికే ఆయా ఉత్పత్తుల్లో కొన్ని మందుల తయారీని స్థానిక పార్టనర్స్‌కు ఔట్ సోర్సింగ్ కూడా చేసింది. ప్రస్తుతం చైనా మార్కెట్లలో 8–10 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, వాటన్నిటికీ సంబంధించి కుష్నన్ రొట్టం రెడ్డి ఫార్మాసూటికల్స్‌తో (కేఆర్ఆర్పీ) భాగస్వామ్యం ఉందని డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధి తెలియజేశారు. షిజోఫ్రినియా, బైపోలార్ వంటి మానసిక పరిస్థితుల చికిత్సలో ఉపయోగించే ఓలాన్జాపైన్ ఔషధాన్ని 2020 నుంచి చైనాలో ప్రారంభిస్తామని చెప్పారాయన. -
బైబై ఇండియా..!
భారత్‌ను వీడి విదేశాల్లో ఆశ్రయం పొందాలనుకుంటున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతర్యుద్ధం, రాజకీయ సంక్షోభం వంటి సమస్యలు లేకపోయినా విదేశాల్లో ఆశ్రయం కోరుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్ తెలిపింది. 2008–18 మధ్యకాలంలో ఇలా విదేశాలను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య ఏకంగా 996.33 శాతానికి ఎగబాకిందని వెల్లడించింది. ఇలా ఆశ్రయం కోరుతున్నవారిలో అత్యధికులు అమెరికా, కెనడా దే శాలవైపు మొగ్గుచూపుతున్నారని పేర్కొంది. సాధారణంగా అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత ఇతర కారణాలతో ప్రజలు ప్రాణాలను అరచేతపెట్టుకుని పారిపోతుంటారు. ఈ తరహా సమస్యలు ఏవీ లేకపోయినా భారత్ నుంచి భారీగా వలసలు పెరగడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల క్రితం పరిస్థితి వేరు... పదేళ్ళ క్రితం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. 2008–09 మధ్యకాలంలో అమెరికా, కెనడాల ఆశ్రయాన్ని కోరుతూ కేవలం 282 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కానీ గత పదేళ్ళలో ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయి 22,967కి చేరుకుంది. 2018లో అమెరికా ఆశ్రయాన్ని కోరుకున్న భారతీయుల సంఖ్య 28,489కు పెరగ్గా, కెనడా ఆశ్రయాన్ని కోరుకున్న వారి సంఖ్య 5,522కు చేరుకుంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం అమెరికా, కెనడాల తర్వాత భారతీయులు ఆశ్రయం కోరిన దేశాల్లో దక్షిణాఫ్రికా(4,329), ఆస్ట్రేలియా(3,584), దక్షిణకొరియా(1,657), జర్మనీ(1,313) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి వలస వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ పేదరికం, అంతర్యుద్ధం, విపరీతమైన హింస ఉండే యెమెన్, సూడాన్, బోస్నియా, బురుండి వంటి దేశాలను కూడా భారతీయులు ఆశ్రయం కోరడం అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులను విస్మయంలో పడేస్తోంది. 2018లో ఇలాంటి 57 దేశాల్లో భారతీయులు ఆశ్రయాన్ని కోరడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత్‌లో నెలకొన్న అసహనం కారణంగానే ఇలా ప్రజలు విదేశీ ఆశ్రయం కోరుతున్నారని మరికొందరు వాదిస్తున్నారు. భారత్‌కు వస్తున్నవారు తక్కువే... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఆశ్రయిస్తోన్న శరణార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం గమనార్హం. అంతర్జాతీయంగా 35.03 లక్షల మంది శరణార్థులు వేర్వేరు దేశాల్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారు 11,957 మంది(0.34 శాతం) మాత్రమే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 2018 చివరికినాటికి భారత్ 1.95 లక్షల మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది. ప్రాంతాలవారీగా చూసుకుంటే పాకిస్తాన్ 14.04 లక్షల మంది విదేశీయులకు ఆశ్రయం ఇచ్చింది. వీరిలో అత్యధికులు ఆఫ్గన్లు. 9.06 లక్షల మందితో బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచింది. రోహింగ్యాలు వీరిలో అత్యధికంగా ఉన్నారు. -
కీర.. లాభాలు జరజర
– కొత్త పంట వైపు మెట్ట రైతుల చూపు – తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందుతున్న వైనం – విదేశాలకు ఎగుమతులు జంగారెడ్డిగూడెం : మెట్ట ప్రాంత రైతులు కొత్త కొత్త పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఎప్పుడూ ఈ ప్రాంతంలో పండని పంటలు వేసి పలువురు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేగాక తక్కువ కాలంలో అధిక ఆదాయం కూడా సాధిస్తున్నారు. మెట్టప్రాంతంలోని లింగపాలెం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది రైతులు జర్కిన్స్ (కీర దోస) పంట పండిస్తున్నారు. దీంతో అధిక లాభాలు సాగిస్తున్నారు. సుమారు 100 మందికి పైగా రైతులు మెట్టమండలాల్లో దీనిని సేద్యం చేస్తున్నారు. ఎకరానికి 10 వేల విత్తనాలు నాటడం ద్వారా సేద్యం కొనసాగిస్తున్నారు. జర్కిన్స్ విత్తనాలను ఓ ప్రై వేట్ కంపెనీ సరఫరా చేస్తోంది. ఎకరానికి అన్ని ఖర్చులు కలుపుకుని సుమారు రూ. 45 వేలు ఖర్చవుతుండగా పంటపై లక్ష రూపాయల వరకు ఆదాయం లభిస్తోంది. పంట దిగుబడి 30 రోజుల నుంచి 60 రోజుల వరకు వస్తుంది. పండిన పంటను జహీరాబాద్‌కు చెందిన గ్లోబల్ గ్రీన్ కంపెనీ తన ప్రతినిధుల ద్వారా కొనుగోలు చేస్తోంది. విదేశాలకు ఎగుమతి జర్కిన్స్ కాయలను ఆస్ట్రేలియా, రష్యా, అమెరికా, బెల్జియం, ఫ్రాన్స్, స్పెయిన్, కెనడా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జర్కిన్స్ కాయలు గ్రేడ్‌ను బట్టి కంపెనీ ధర ఇస్తుంది. 18.5 ఎంఎం సైజు ఉన్న కాయను ఒకటో రకం గ్రేడ్‌గా గుర్తించి టన్నుకు రూ.18 వేలు చెల్లిస్తోంది. 25 ఎంఎం సైజుగా ఉన్న కాయ టన్నుకు రూ.11 వేలు, 33 ఎంఎం సైజు ఉన్నlకాయకు టన్నుకు రూ.4 వేలు చెల్లిస్తోంది. ఈ రకం కీరదోస పచ్చివి తినేందుకు, సలాడ్, సూప్ , చట్నీ, పచ్చళ్లు చేసుకునేందుకు ఉపయోగిస్తారు. వైద్యపరంగా కూడా ఇవి ఎంతో మేలైనవని వైద్యులు చెబుతున్నారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు పంట వేసుకునేందుకు అనుకూలమైన రోజులు. కేవలం 60 రోజుల్లో ఎకరానికి సుమారు రూ.50 వేల వరకు ఆదాయం లభిస్తుందని రైతులు చెబుతున్నారు. కీరదోస వల్ల గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు నియంత్రణ, క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీనిలో పోలేట్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ తదితర పదార్థాలు అధికంగా ఉంటాయి. రైతులు ఈ పంట వేసేందుకు ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తూ సబ్సిడీలు ఇస్తోంది. స్థానికంగా పంట అంతా ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతుంది. సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు దీంతో రైతులకు మంచి ధర కూడా లభిస్తోంది. ఏటా మనదేశం నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కీరదోస పంట ఎగుమతి అవుతోంది. దీనిపై దేశానికి రూ.1,000 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. దీంతో ఈ ప్రాంత రైతులు కూడా జర్కిన్స్ వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇసుకతో కూడిన మట్టినేలలు, 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఈ పంట బాగా పండుతుంది. పాదుల రూపంలో ఎదిగే ఈ పంటకు కర్రలను పాతి దానిపైకి ఎగబాకిస్తారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటి ఖర్చుతో ఈ పంట పండుతుంది. మంచి ఆదాయం జర్కిన్స్ పంట ద్వారా మంచి ఆదాయం వస్తుంది. 30 రోజుల నుంచే దిగుబడి మొదలవుతుంది. ఇలా నిత్యం 60 రోజుల వరకు పంట వస్తూనే ఉంటుంది. ఎకరానికి రూ.40 నుంచి రూ.45 వేలు ఖర్చవుతుంది. ఆదాయం రూ.లక్ష వరకు వస్తుంది. తక్కువ రోజుల్లో డబ్బు చేతికి అందుతుంది. ఎక్కువమంది వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించవచ్చు. – ఘంటా రాఘవేంద్రరావు, రైతు, మఠంగూడెం సబ్సిడీ ఇస్తున్నాం జర్కిన్స్ పంట (కీర దోస) వేసే రైతులకు ఉద్యానశాఖ ద్వారా సబ్సిడీ ఇస్తున్నాం. పాదులు పైకి ఎగబాకేలా ఏర్పాటు చేసుకునేందుకు కర్రలు, ఇనుప వైర్లు ఏర్పాటుకు ఎకరానికి రూ. 8 వేలు సబ్సిడీ ఇస్తున్నాం. ఈ పంట మంచి ఆదాయాన్ని ఇస్తుంది. దీంతో రైతులు సాగుకు ముందుకు వస్తున్నారు. ప్రై వేట్ కంపెనీలు రైతులను ప్రోత్సహిస్తున్నాయి. – అడపా దుర్గేష్, ఏడీ, ఉద్యాన శాఖ, జంగారెడ్డిగూడెం -
ఆనాటి కక్షలు...నేటికి ప్రతీకారం
విదేశాల నుండి వ్యూహారచన అదును చూసి ప్రత్యర్దులపై దాడి గ్రామాన్ని వీడిన రెండు వర్గాలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని వైనం ‘తిరుపతమ్మ’ శప««దlం చేసి అంతమోందించే పెద్ద తలకాయ ఎవరిది? పెదవేగి రూరల్: కుటుంబ, రాజకీయ కక్ష్యల నేపధ్యంలో జరిగిన ట్రిపుల్ మర్డర్‌కు నేటికి రెండేళ్లు....గ్రామంలో జరిగిన ఓ హత్యకు ప్రతిగా హతుడి భార్య చేసిన శపధంతో జిల్లాలో హత్యల పరంపర కొనసాగుతూ వస్తోంది. ఓకే సామాజిక వర్గానికి చెందిన ఇరువర్గాల వారు వారి వారి కుటుంబాలలో పెద్దదిక్కులను కోల్పోయి నిరాశ్రయులవగా, కుటుంబ సభ్యులు అనాధలుగా మారారు. సామాజికవర్గమే కాదు వీరి ఇరువర్గాలలో ప్రవహించే రక్తమూ ఒక్కటే అయినా రక్తసంభందం రక్తం పారించడానికి వారికి అడ్డుకాలేదు. ఆడ మగ తేడా లేకుండా ప్రతీకారంతో రగులుతూ రక్తపాతం సషి్ఠస్తున్నారు. ఏలూరు జేకే ప్యాలెస్ హోటల్ యజమాని భూతం దుర్గారావు హత్యతో మొదలైన పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశవిదేశాలలో తమ వత్తిపరంగా ఖ్యాతితో పాటు కాసులు గడించిన వారు వారిని అంతమొందించేందుకు గడించిన కాసులనే వర్షంలా కురిపిస్తూ హత్యాకాండ కొనసాగిస్తున్నారు. తిరుపతమ్మ శపధం చేసి అంతమోందించనున్న పెద్ద తలకాయ్..? పెదవేగి మండలం పినకడిమి గ్రామంలో జ్యోతిష్యం వత్తిగా జీవించే కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాటిలో రెండు కుటుంబాల మధ్య ఆరేళ్ల క్రితం తలెత్తిన కుటుంబ వివాదం ఆ తర్వాత రాజకీయ రంగు పులుముకుంది. జ్యోతిషు్యడు, ఏలూరులోని జేకే ప్యాలెస్ హోటల్ అధినేత భూతం దుర్గారావు పినకడిమి గ్రామంలో ఓ రాజకీయ పార్టీ పెద్దగా ఉండేవారు. ఆయన సూచించిన వారికే పదవులు దక్కేవి. దుర్గారావు సోదరుడు గోవిందు కుమార్తెను తూరపాటి నాగరాజు కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. కాగా, ఆరేళ్ల క్రితం గోవిందు కుమార్తె నాగరాజు కొడుకుపై వరకట్న వేధింపుల కేసు పెట్టడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఆ తర్వాత జరిగిన పంచాయితీ ఎన్నికల సమయంలో మాజీ ఎంపీటీసీ పామర్తి వెంకటేశ్వరరావుకు తిరిగి ఎంపీటీసీ టికెట్ ఇచ్చేందుకు దుర్గారావు నిరాకరించడంతో వివాదంలోకి రాజకీయం అడుగుపెట్టింది. దీంతో కుటుంబ, రాజకీయ కక్ష్యల నేపధ్యంలో గ్రామంలోనే వాకింగ్ చేస్తోన్న దుర్గారావును ప్రత్యర్ధులు గత 2014 ఏప్రిల్ 6వ తేదీన కత్తులతో నరికి హత్యచేశారు. ఈ నేపద్యంలో ఏలూరు జేకే ప్యాలెస్ హోటల్ యజమాని భూతం దుర్గారావు భార్య తిరుపుతమ్మ. భర్త మతదేహం ముందు నిన్ను చంపిన వారిని చంపాకే నీకు కర్మఖాండ చేస్తా...నా మెడలో తాళి తీస్తానని తిరుపతమ్మ శపధం చేసింది. ఆ తరువాత ఐదు నెలల వ్యవధిలోనే తన భర్త హత్యకేసులో నిందితులుగా ఉన్న గంధం మారయ్య, పగిడిమారయ్యలు ఏలూరు కోర్టుకు వస్తుండగా అదే ఏడాది సెప్టెంబర్ 24వ తేదీన పెద్దఅవుటపల్లి వద్ద కిరాయి హంతకులు కాల్చి చంపారు. వీరితో పాటు వీరి తండ్రి గంధం నాగేశ్వరరావు కూడా ఈ ఘటనలో మతిచెందారు. ఇదిలా ఉండగా భూతం దుర్గారావు హాత్యకేసులోని ప్రధాన నిందితుడైన తూరపాటి నాగరాజు తన భార్యతో కలిసి హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని జింకలదీవి కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తుండగా, పోలీసులకు చిక్కని నిందితుడు ప్రత్యర్దులకు చిక్కనే చిక్కాడు. దీనిలో భాగంగానే 2015 మార్చి 31వ తేదీన నాగరాజుపై అగంతకులు ఐదురౌండ్లు కాల్పులు జరిపి హాత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సషి్ఠంచిన ఈ ఘటనలో నాగరాజు ప్రాణాలతో బయటపడ్డాడు. మళ్ళీ 2016 జూన్ 28వ తేదీ రాత్రి ఏలూరులో దుర్గారావు హత్యకేసులో ప్రధాన నిందితుడైన తూరపాటి నాగరాజుపై కాల్పులు జరిగాయి. రెండసారి దాడిలోనూ నాగరాజుకు ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ నేపధ్యంలో స్దానికంగా అలజడి వాతావరణం నెలకొంది. గ్రామంలో మరలా పోలీసుల పహారా, వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఇలా ఏ సమయంలో ఏ వర్గం వారు ఎవరెవరిని దాడి చేస్తారో తెలియక ఇటు పోలీసులకు, ప్రజలకు మనశాంతి లేకుండా పోయింది. అస్సలు తిరుపతమ్మ శపధం చేసిన పెద్ద తలకాయ ఎవరిదన్న? ఆలోచన ఎవ్వరికి నిద్ర పట్టనివ్వకుంది. ఏలూరులో దాడి అనంతరం కోలుకున్న నాగరాజు కుటుంబ సభ్యులతో సహా అజ్ఞాతంలోకి వెల్లిపోయాడు. ప్రస్తుతం హాత్యలకు కారణమైన ఇరువర్గాలు పినకడిమి గ్రామంలో లేరు. వీరితో పాటు చాలా కుటుంబాలు జరుగుతున్న వరుస దాడులు, హాత్యలను చూసి నూటికి 50 శాతం మంది ప్రజలు గ్రామాన్ని వీడి బయటకు వెల్లిపోయారని స్దానికులు చెబుతున్నారు. ఈ మారణకాండలు ఎప్పటికి ఆగుతాయో అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అంతా ప్రశాంతం... వీరంకి రామకోటేశ్వరరావు ఎసై ్స పెదవేగి మండలం గ్రామంలో ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉంది. పికెట్స్‌ను కూడా ఉన్నతాధికారులు తీసేసారు. భూతం దుర్గారావు, తూరపాటి నాగరాజుల ఇరు కుటుంబ సభ్యులు పినకడిమి గ్రామంలో లేరు. మా స్టేషన్ నుండి సిబ్బంది అప్పుడప్పుడు వెల్లి అక్కడ పరిస్దితిని పరిశీలించి వస్తాము.