Taiwan Said Thanks India Others For Support Amid China Tensions - Sakshi
Sakshi News home page

భారత్‌తో పాటు ఇతర దేశాలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు

Aug 14 2022 8:09 PM | Updated on Aug 14 2022 8:46 PM

Taiwan Said Thanks India Others For Support Amid China Tensions - Sakshi

తమకు మద్దతు ఇచ్చిన దేశాలకు కృతజ‍్క్షతలు తెలిపిన తైవాన్‌. భారత్‌ వంటి ఇతర దేశాలతో స్నేహం చేసే అర్హత ఉంది. 

Taiwan said it will continue to enhance its self-defence capabilities: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటన ఎంత పెద్ద పెను వివాదంగా మారిందో తెలిసిందే. ఒక పక్క తైవాన్‌ని అడ్డుపెట్టుకుని అమెరికా తమపై కుట్ర చేస్తుందంటూ డ్రాగన్‌ కంట్రీ నిప్పులు కక్కుతోంది. అమెరికా సైతం తాము అనుకున్నదే చేస్తామని తగ్గకపోవడంతో భవిష్యత్తులో జరగబోయే  ఏ పరిణామానికైన అగ్రరాజ్యమే కారణమంటూ కయ్యానికి కాలుదువ్వింది చైనా.

ఈ మేరకు తైవాన్‌ జలసంధిలో మిలటరీ డ్రిల్‌లు చేపట్టింది. తైవాన్‌ భయపట్టించేలా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున్న సైనిక విన్యాసాలు ప్రారంభించింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతవరణం నెలకొంది. దీంతో జపాన్‌, భారత్‌తో సహ ఇతర దేశాలు తైవాన్ జలసంధి అంతటా అంతర్జాతీయ భద్రతను కాపాడేలా సమన్వయంగా వ్యవహరించాలని చెబుతూ.. ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం నెలకొల్పేలే పిలుపునిచ్చాయి.

ఈ మేరకు భారత్‌ ఇతర దేశాల మాదిరిగా ఆందోళన వ్యక్తపరుస్తూ.. తైవాన్‌ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గి ఈ ప్రాంతంలో శాంతి, సంయమనం పాటించాలని, ఏకపక్ష చర్యలను నివారించాలని కోరుతున్నాము" అని విదేశీ వ్యవహారాలు మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చ పిలుపునిచ్చారు.

దీంతో తైవాన్‌, చైనా విషయంలో భారత్‌తో సహా ఇతర దేశాలు తమకు మద్ధతు ఇచ్చినందుకు ధన్యావాదాలు తెలిపింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో స్నేహం చేయడానికి, సంబంధాలు కొనసాగించడానికి తాము అర్హులమని తైవాన్‌ పేర్కొంది. ఈ క్రమంలో తైవాన్‌ అంతర్జాతీయ భద్రతను కాపాడేలా భారత్‌తో సహా ఇతర దేశాలతో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగిస్తూనే తమ ఆత్మరక్షణ సామర్థ్యాలను పెంపొందించుకుంటామని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement