tensions in border
-
భారత్‌తో పాటు ఇతర దేశాలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు
Taiwan said it will continue to enhance its self-defence capabilities: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన ఎంత పెద్ద పెను వివాదంగా మారిందో తెలిసిందే. ఒక పక్క తైవాన్‌ని అడ్డుపెట్టుకుని అమెరికా తమపై కుట్ర చేస్తుందంటూ డ్రాగన్ కంట్రీ నిప్పులు కక్కుతోంది. అమెరికా సైతం తాము అనుకున్నదే చేస్తామని తగ్గకపోవడంతో భవిష్యత్తులో జరగబోయే ఏ పరిణామానికైన అగ్రరాజ్యమే కారణమంటూ కయ్యానికి కాలుదువ్వింది చైనా. ఈ మేరకు తైవాన్ జలసంధిలో మిలటరీ డ్రిల్లు చేపట్టింది. తైవాన్ భయపట్టించేలా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున్న సైనిక విన్యాసాలు ప్రారంభించింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతవరణం నెలకొంది. దీంతో జపాన్, భారత్‌తో సహ ఇతర దేశాలు తైవాన్ జలసంధి అంతటా అంతర్జాతీయ భద్రతను కాపాడేలా సమన్వయంగా వ్యవహరించాలని చెబుతూ.. ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం నెలకొల్పేలే పిలుపునిచ్చాయి. ఈ మేరకు భారత్ ఇతర దేశాల మాదిరిగా ఆందోళన వ్యక్తపరుస్తూ.. తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గి ఈ ప్రాంతంలో శాంతి, సంయమనం పాటించాలని, ఏకపక్ష చర్యలను నివారించాలని కోరుతున్నాము" అని విదేశీ వ్యవహారాలు మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చ పిలుపునిచ్చారు. దీంతో తైవాన్, చైనా విషయంలో భారత్‌తో సహా ఇతర దేశాలు తమకు మద్ధతు ఇచ్చినందుకు ధన్యావాదాలు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో స్నేహం చేయడానికి, సంబంధాలు కొనసాగించడానికి తాము అర్హులమని తైవాన్ పేర్కొంది. ఈ క్రమంలో తైవాన్ అంతర్జాతీయ భద్రతను కాపాడేలా భారత్‌తో సహా ఇతర దేశాలతో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగిస్తూనే తమ ఆత్మరక్షణ సామర్థ్యాలను పెంపొందించుకుంటామని వెల్లడించింది. -
పథకం ప్రకారమే పాక్, చైనా కయ్యం
న్యూఢిల్లీ: సరిహద్దు విషయంలో దాయాది దేశం పాకిస్తానే కాదు చైనా సైతం తరచూ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా మధ్య గత ఐదు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే, ఒక పథకంలో(మిషన్) భాగంగానే పాక్, చైనా సరిహద్దు వివాదాలు సృష్టిస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. ఆయన సోమవారం 44 నూతన వారధులను ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. లద్దాఖ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ వారధులు ఉన్నాయి. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్, చైనా దేశాలతో భారత్‌కు 7,000 కిలోమీటర్ల సరిహద్దు ఉందని తెలిపారు. భారత్‌కు ఇబ్బందులు కలిగించాలని ఉత్తర దిశ నుంచి పాకిస్తాన్, తూర్పు దిశ నుంచి చైనా ఒక పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నూతన బ్రిడ్జీలతో ఆయా వ్యూహాత్మక ప్రాంతాలకు మన సైనికుల రాకపోకలకు మరింత సౌలభ్యం కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. వారు సులువుగా అక్కడికి చేరుకోగలుగుతారని వెల్లడించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, పాకిస్తాన్, చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లు వంటి వాటిని సమర్థంగా ఎదుర్కొంటూనే భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోందని రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్మించనున్న 450 మీటర్ల సొరంగ మార్గం నెచిపూ టన్నెల్ నిర్మాణానికి ఆయన ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌ను రాజ్‌నాథ్ ప్రశంసించారు. -
ప్రతికూల వాతావ‘రణ’మైనా రెడీ!
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు చెలరేగుతున్న తూర్పు లద్దాఖ్‌లో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత్ సమాయత్తమైంది. చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కోవడానికి గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీగా యుద్ధ ట్యాంకులను, ఇతర సామగ్రిని తరలించింది. వచ్చే నాలుగు నెలలు శీతాకాలంలో ఎత్తయిన పర్వత ప్రాంతమైన లద్దాఖ్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొని ఉంటాయి. అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో చలి మైనస్ 25 డిగ్రీల వరకు వెళుతుంది. ఆ సమయంలో డ్రాగన్ దేశం ఎలాంటి కుయుక్తులు పన్నినా దీటుగా ఎదుర్కోవడానికి ఇండియన్ ఆర్మీ ఈ భారీ తరలింపు ప్రక్రియ చేపట్టింది. యుద్ధ ట్యాంకులు, భారీగా ఆయుధాలు, ఇంధనాన్ని తరలించినట్టు ఆర్మీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. వాటితో పాటు సైనికులకు అవసరమైన ఆహారం దుస్తులు, బూట్లు తదితర సామగ్రిని చేరవేయడం దాదాపుగా పూర్తయింది. ఈ భారీ తరలింపు కసరత్తుని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నారవాణే, మరికొందరు కమాండర్లతో బృందంగా ఏర్పడి స్వయంగా పర్యవేక్షించారు. జూలై నుంచి మొదలు పెట్టిన ఈ ప్రక్రియని పకడ్బందీ ప్రణాళికతో నరవాణె రూపొందించి అమలయ్యేలా చూశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా ఆయుధాలు తూర్పు లద్దాఖ్‌లోని సమస్యాత్మక ప్రాంతాలైన చుషుల్, డెమ్‌చోక్‌లకు టీ–90, టీ–72 ట్యాంకులు, గన్స్, పదాతిదళానికి అవసరమయ్యే వాహనాలు ఇప్పటికే చేరుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా 16 వేల అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతంలోని శిబిరాల్లో ఉండే జవాన్ల కోసం భారీగా ఆహార పదార్థాలు, దుస్తులు, టెంట్లు, కమ్యూనికేషన్ పరికరాలు, చమురు, చలి నుంచి రక్షణకి హీటర్లు తరలించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత లద్దాఖ్‌లో సైనిక శిబిరాలకు ఈ స్థాయిలో సామగ్రిని చేరవేయడం ఇదే మొదటిసారి. ఈ తరలింపు అత్యంత భారీ స్థాయిలో జరిగింది’’అని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. రక్తం గడ్డ కట్టే చలి నుంచి రక్షణ కోసం యూరప్ దేశాల నుంచి దుస్తుల్ని తెప్పించి ఇప్పటికే సైనికులకి అందించారు. ఈ సామగ్రిని తరలించడానికి వైమానిక దళానికి చెందిన సి–130జే సూపర్ హెర్క్యులస్, సీ–17 గ్లోబ్‌మాస్టర్ హెలికాప్టర్లను వినియోగించారు. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతల నివారణ కోసం చైనాతో జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాకపోవడం, సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడానికి ఆ దేశం అంగీకరించకపోవడంతో ముందు జాగ్రత్తగా భారత్ అన్ని రకాలుగా సిద్ధమైంది. అదనంగా మూడు సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది. అక్కడ సైనికులకి అన్ని సదుపాయాలు కల్పించింది. -
డోక్లాం మళ్లీ హాట్ జోన్ కానుందా..?
సాక్షి, న్యూఢిల్లీ : వేసవి రాకతో మరోసారి ఇండో-చైనా సరిహద్దు వెంబడి వివాదాస్పద డోక్లాం ఉద్రిక్తతలకు కేంద్రం కానుందనే సందేహలు వ్యక్తమవుతున్నాయి. ఇరు దేశాలకు చెందిన దళాల కదలిలకలు మళ్లీ అలజడులు రేపవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి సునిశితంగా ఉంటుందని, పెట్రోలింగ్, దళాల కదలికలు పెచ్చుమీరతాయని రక్షణ శాఖ సహాయమంత్రి సుభాష్ భమ్రే హెచ్చరించారు. ఈ వేసవిలో భారత్, చైనాల మధ్య డోక్లాంపై సందిగ్ధత నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా, చైనా, భూటాన్ ఉమ్మడి సరిహద్దు ప్రాంతంలో డోక్లాం వద్ద గత ఏడాది భారత్, చైనాల మధ్య 73 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. డోక్లాం వద్ద చైనా పీపుల్స లిబరేషన్ ఆర్మీ చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని భారత సేనలు అడ్డగించడం వివాదానికి కేంద్ర బిందువైంది. సరిహద్దుల్లో చైనా సేనలు మోహరించడం ఉద్రిక్తతలకు దారితీసింది. కాగా, దౌత్యపరమైన సంప్రదింపుల ద్వారా వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. -
చైనాతో ఇప్పుడు కయ్యం ఎందుకు?
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఎందుకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి? వివాదాస్పదమైన అరుణాచల్ ప్రదేశ్ లేదా లడక్ సరిహద్దు ప్రాంతాల్లో కాకుండా ఎలాంటి సరిహద్దు వివాదంలేని సిక్కిం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎందుకు రాజుకున్నాయి. ఎప్పుడూ ఇరువైపుల పదుల సంఖ్యలో కాపలా ఉండే సైనికుల సంఖ్య ఇప్పుడు మూడువేల మందికి ఎందుకు చేరుకుంది? ఒకసారి 1962లో ఎదురైన పరాభవాన్ని గుర్తుచేసుకోడంటూ భారత్‌ను చైనా హెచ్చరించడం, అప్పటి భారత్‌లాగానే ఇప్పుడూ భారత్ ఉందనుకోవడం పొరపాటంటూ భారత్ కూడా దీటుగా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది? చైనా సరిహద్దుల గుండా మానవ సరోవర యాత్రను కూడా నిలిపేయాల్సిన ఆగత్యం ఎందుకు ఏర్పడింది? భారత్, భూటాన్, చైనా సరిహద్దులు కలిసే చోటును డోకో–లా అని భారత్, డాగ్లాంగ్ అని చైనా పిలుస్తోంది. వీటి సరిహద్దులను నిర్దేశిస్తూ 127 సంవత్సరాల క్రితమే, అంటే 1890 సంవత్సరంలో అప్పటి క్వింగ్ రాజ్యం, బ్రిటీష్ పాలకుల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది 1895 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని ఆంగ్లేయులు, చైనీయుల మధ్య కుదిరిన ఒడంబడికగా అప్పటి నుంచి పరిగణిస్తున్నారు. ఈ సరిహద్దులకు సమీపంలోనే ఉన్న టిబెట్‌లోని చుంబా లోయ చైనాకు వ్యూహాత్మకమైన ప్రదేశం. చైనా నుంచి ఆ ప్రాంతానికి చేరుకోవడానికి సన్నటి డొంకదారి తప్ప మరేమీ లేదు. అక్కడికి మోటార్లపై వేగంగా చేరుకోవడానికి ఆ ప్రాంతంలో చైనా రోడ్డు మార్గాన్ని నిర్మిస్తోంది. జూన్ నాలుగవ తేదీ రాత్రి భారత్ సైనికులు టిబెట్‌లోని చుంబా లోయలోకి చొచ్చుకుపోయి చైనా రోడ్డు నిర్మాణాన్ని అడ్డగించారని చైనా ఆరోపిస్తోంది. అందుకు ప్రతీకారంగా కొన్ని రోజుల తర్వాత చైనా సైనికులు భారత సరిహద్దుల్లోకి జొరబడు రెండు బంకర్లలో ఓ బంకరును బుల్డోజర్తో కూల్చేశారని ఆ దేశ వర్గాలు చెప్తున్నాయి. కొత్తగా నిర్మించారన్న కారణంగా తాము కూల్చేశామని చైనా సైన్యం సమర్థించుకుంటే ఆ బంకర్లు ఎప్పుడో నిర్మించినవని భారత్ వాదించింది. చైనా నిర్మిస్తున్న రోడ్డు వ్యూహాత్మకంగా భూటాన్‌కే ప్రమాదం. చైనాతో భూటాన్‌కు దౌత్య సంబంధాలు లేని కారణంగా భారత్ పంచన చేరిన ఆ దేశం రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేయాల్సిందిగా భారత్‌ను కోరి ఉండవచ్చు. అందుకు భారత సైన్యం స్పందించి ఉండవచ్చు. అయితే అధికారికంగా ఈ విషయాన్ని ఏ దేశమూ వెల్లడించడం లేదు. సరిహద్దులు అతిక్రమించి రోడ్డు నిర్మాణం అడ్డుకున్నావంటూ భారత్‌పై చైనా, సరిహద్దుల్లోకి చొరబడి బంకరు కూల్చేశావంటూ చైనాపై భారత్ ఆరోపణ, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఇవి తీవ్రస్థాయికి చేరుకోవడంతో వేలాది మంది సైనికుల మోహరింపుతో ముఖాముఖి తలపడే స్థాయికి చేరుకున్నాయి. సిక్కింకు సంబంధించినంతవరకు తమకు భారత్‌తో ఎలాంటి వివాదం లేదని, ఇప్పుడు కూడా తమ దేశం 1890 నాటి ఒప్పందాన్ని గౌరవిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేయడం గమనార్హం. అలాంటప్పుడు ఇరు దేశాలు ఎందుకు ఉద్రిక్తకు దారితీసే ప్రకటనలు చేస్తున్నాయి? 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విదేశాంగ విధానంలో దూకుడు స్వభావాన్నే ప్రదర్శిస్తోంది. అందుకే చల్లారిన కశ్మీరం మళ్లీ రగులుతోందని, ఇప్పుడు చైనాతో కయ్యానికి కాలుదువ్వుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దేశ సమస్యల నుంచి ప్రజల దష్టిని మళ్లించేందుకు ఈ దూకుడు విధానమని వారంటున్నారు. అలాంటప్పుడు మరి చైనా ఎందుకు దూకుడు స్వభావం ప్రదర్శిస్తోంది? పాకిస్తాన్ మీదుగా చైనా నిర్మిస్తున్న ‘ఒకే బెల్ట్ ఒకే కారిడార్’ ప్రాజెక్టుకు భారత్ భవిష్యత్‌లో అడ్డు రాకూడదని ఉద్దేశంతో వ్యూహాత్మకంగా చైనా దూకుడు వైఖరిని అవలంబిస్తోందని కొందరు నిపుణులు విశ్లేషిస్తుండగా, వివాదాస్పదమైన అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్ మౌలిక సౌకర్యాల నిర్మాణం పట్ల చైనా ఆగ్రహంతో ఉందని, ఆ అగ్రహాన్ని ఇక్కడ చూపిస్తోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. భారత్ సైన్యం ప్రధానంగా సరిహద్దు కదలికలపై దష్టి పెట్టేలా చేసి సిక్కింలోని అపార సహజ వనరులను దోచుకుపోవాలని చైనా చూస్తోందంటూ ఢిల్లీ యూనివర్శిటీలోని పొలిటికల్ సైన్స్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ రాజేష్ దేవ్ అభిప్రాయపడ్డారు. వివరణ: భారత సైనికులు తమ భూభాగంలోకి వచ్చారంటూ చైనా సోషల్ మీడియాలో ప్రచురితమైన ఫొటోను పొరపాటున ప్రచురించినందుకు చింతిస్తున్నాం.. ఇప్పుడు ఆ చిత్రాన్ని తొలగించాం- సాక్షి.కామ్