ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : వేసవి రాకతో మరోసారి ఇండో-చైనా సరిహద్దు వెంబడి వివాదాస్పద డోక్లాం ఉద్రిక్తతలకు కేంద్రం కానుందనే సందేహలు వ్యక్తమవుతున్నాయి. ఇరు దేశాలకు చెందిన దళాల కదలిలకలు మళ్లీ అలజడులు రేపవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి సునిశితంగా ఉంటుందని, పెట్రోలింగ్, దళాల కదలికలు పెచ్చుమీరతాయని రక్షణ శాఖ సహాయమంత్రి సుభాష్ భమ్రే హెచ్చరించారు.
ఈ వేసవిలో భారత్, చైనాల మధ్య డోక్లాంపై సందిగ్ధత నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా, చైనా, భూటాన్ ఉమ్మడి సరిహద్దు ప్రాంతంలో డోక్లాం వద్ద గత ఏడాది భారత్, చైనాల మధ్య 73 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. డోక్లాం వద్ద చైనా పీపుల్స లిబరేషన్ ఆర్మీ చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని భారత సేనలు అడ్డగించడం వివాదానికి కేంద్ర బిందువైంది. సరిహద్దుల్లో చైనా సేనలు మోహరించడం ఉద్రిక్తతలకు దారితీసింది. కాగా, దౌత్యపరమైన సంప్రదింపుల ద్వారా వివాదానికి తాత్కాలికంగా తెరపడింది.
Comments
Please login to add a commentAdd a comment