ఆనాటి కక్షలు...నేటికి ప్రతీకారం
ఆనాటి కక్షలు...నేటికి ప్రతీకారం
Published Fri, Sep 23 2016 9:54 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
విదేశాల నుండి వ్యూహారచన
అదును చూసి ప్రత్యర్దులపై దాడి
గ్రామాన్ని వీడిన రెండు వర్గాలు
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని వైనం
‘తిరుపతమ్మ’ శప««దlం చేసి అంతమోందించే పెద్ద తలకాయ ఎవరిది?
పెదవేగి రూరల్: కుటుంబ, రాజకీయ కక్ష్యల నేపధ్యంలో జరిగిన ట్రిపుల్ మర్డర్‌కు నేటికి రెండేళ్లు....గ్రామంలో జరిగిన ఓ హత్యకు ప్రతిగా హతుడి భార్య చేసిన శపధంతో జిల్లాలో హత్యల పరంపర కొనసాగుతూ వస్తోంది. ఓకే సామాజిక వర్గానికి చెందిన ఇరువర్గాల వారు వారి వారి కుటుంబాలలో పెద్దదిక్కులను కోల్పోయి నిరాశ్రయులవగా, కుటుంబ సభ్యులు అనాధలుగా మారారు. సామాజికవర్గమే కాదు వీరి ఇరువర్గాలలో ప్రవహించే రక్తమూ ఒక్కటే అయినా రక్తసంభందం రక్తం పారించడానికి వారికి అడ్డుకాలేదు. ఆడ మగ తేడా లేకుండా ప్రతీకారంతో రగులుతూ రక్తపాతం సషి్ఠస్తున్నారు. ఏలూరు జేకే ప్యాలెస్ హోటల్ యజమాని భూతం దుర్గారావు హత్యతో మొదలైన పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశవిదేశాలలో తమ వత్తిపరంగా ఖ్యాతితో పాటు కాసులు గడించిన వారు వారిని అంతమొందించేందుకు గడించిన కాసులనే వర్షంలా కురిపిస్తూ హత్యాకాండ కొనసాగిస్తున్నారు.
తిరుపతమ్మ శపధం చేసి అంతమోందించనున్న పెద్ద తలకాయ్..?
పెదవేగి మండలం పినకడిమి గ్రామంలో జ్యోతిష్యం వత్తిగా జీవించే కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాటిలో రెండు కుటుంబాల మధ్య ఆరేళ్ల క్రితం తలెత్తిన కుటుంబ వివాదం ఆ తర్వాత రాజకీయ రంగు పులుముకుంది. జ్యోతిషు్యడు, ఏలూరులోని జేకే ప్యాలెస్ హోటల్ అధినేత భూతం దుర్గారావు పినకడిమి గ్రామంలో ఓ రాజకీయ పార్టీ పెద్దగా ఉండేవారు. ఆయన సూచించిన వారికే పదవులు దక్కేవి. దుర్గారావు సోదరుడు గోవిందు కుమార్తెను తూరపాటి నాగరాజు కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. కాగా, ఆరేళ్ల క్రితం గోవిందు కుమార్తె నాగరాజు కొడుకుపై వరకట్న వేధింపుల కేసు పెట్టడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఆ తర్వాత జరిగిన పంచాయితీ ఎన్నికల సమయంలో మాజీ ఎంపీటీసీ పామర్తి వెంకటేశ్వరరావుకు తిరిగి ఎంపీటీసీ టికెట్ ఇచ్చేందుకు దుర్గారావు నిరాకరించడంతో వివాదంలోకి రాజకీయం అడుగుపెట్టింది. దీంతో కుటుంబ, రాజకీయ కక్ష్యల నేపధ్యంలో గ్రామంలోనే వాకింగ్ చేస్తోన్న దుర్గారావును ప్రత్యర్ధులు గత 2014 ఏప్రిల్ 6వ తేదీన కత్తులతో నరికి హత్యచేశారు. ఈ నేపద్యంలో ఏలూరు జేకే ప్యాలెస్ హోటల్ యజమాని భూతం దుర్గారావు భార్య తిరుపుతమ్మ. భర్త మతదేహం ముందు నిన్ను చంపిన వారిని చంపాకే నీకు కర్మఖాండ చేస్తా...నా మెడలో తాళి తీస్తానని తిరుపతమ్మ శపధం చేసింది.
ఆ తరువాత ఐదు నెలల వ్యవధిలోనే తన భర్త హత్యకేసులో నిందితులుగా ఉన్న గంధం మారయ్య, పగిడిమారయ్యలు ఏలూరు కోర్టుకు వస్తుండగా అదే ఏడాది సెప్టెంబర్ 24వ తేదీన పెద్దఅవుటపల్లి వద్ద కిరాయి హంతకులు కాల్చి చంపారు. వీరితో పాటు వీరి తండ్రి గంధం నాగేశ్వరరావు కూడా ఈ ఘటనలో మతిచెందారు. ఇదిలా ఉండగా భూతం దుర్గారావు హాత్యకేసులోని ప్రధాన నిందితుడైన తూరపాటి నాగరాజు తన భార్యతో కలిసి హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని జింకలదీవి కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తుండగా, పోలీసులకు చిక్కని నిందితుడు ప్రత్యర్దులకు చిక్కనే చిక్కాడు. దీనిలో భాగంగానే 2015 మార్చి 31వ తేదీన నాగరాజుపై అగంతకులు ఐదురౌండ్లు కాల్పులు జరిపి హాత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సషి్ఠంచిన ఈ ఘటనలో నాగరాజు ప్రాణాలతో బయటపడ్డాడు. మళ్ళీ 2016 జూన్ 28వ తేదీ రాత్రి ఏలూరులో దుర్గారావు హత్యకేసులో ప్రధాన నిందితుడైన తూరపాటి నాగరాజుపై కాల్పులు జరిగాయి. రెండసారి దాడిలోనూ నాగరాజుకు ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ నేపధ్యంలో స్దానికంగా అలజడి వాతావరణం నెలకొంది. గ్రామంలో మరలా పోలీసుల పహారా, వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఇలా ఏ సమయంలో ఏ వర్గం వారు ఎవరెవరిని దాడి చేస్తారో తెలియక ఇటు పోలీసులకు, ప్రజలకు మనశాంతి లేకుండా పోయింది. అస్సలు తిరుపతమ్మ శపధం చేసిన పెద్ద తలకాయ ఎవరిదన్న? ఆలోచన ఎవ్వరికి నిద్ర పట్టనివ్వకుంది. ఏలూరులో దాడి అనంతరం కోలుకున్న నాగరాజు కుటుంబ సభ్యులతో సహా అజ్ఞాతంలోకి వెల్లిపోయాడు. ప్రస్తుతం హాత్యలకు కారణమైన ఇరువర్గాలు పినకడిమి గ్రామంలో లేరు. వీరితో పాటు చాలా కుటుంబాలు జరుగుతున్న వరుస దాడులు, హాత్యలను చూసి నూటికి 50 శాతం మంది ప్రజలు గ్రామాన్ని వీడి బయటకు వెల్లిపోయారని స్దానికులు చెబుతున్నారు. ఈ మారణకాండలు ఎప్పటికి ఆగుతాయో అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో అంతా ప్రశాంతం...
వీరంకి రామకోటేశ్వరరావు ఎసై ్స పెదవేగి మండలం
గ్రామంలో ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉంది. పికెట్స్‌ను కూడా ఉన్నతాధికారులు తీసేసారు. భూతం దుర్గారావు, తూరపాటి నాగరాజుల ఇరు కుటుంబ సభ్యులు పినకడిమి గ్రామంలో లేరు. మా స్టేషన్ నుండి సిబ్బంది అప్పుడప్పుడు వెల్లి అక్కడ పరిస్దితిని పరిశీలించి వస్తాము.
Advertisement
Advertisement