
డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: కరోనా వైరస్ నిరోధానికి సిద్ధం చేస్తున్న టీకాలను అమెరికా ఇతర దేశాలకు సరఫరా చేసే అవకాశాలు లేకపోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. టీకా తయారైన తరువాత దేశవ్యాప్తంగా వేగంగా టీకా ఉత్పత్తి చేపడతామని, కరోనా చికిత్సకు ఉపయోగపడే వెంటిలేటర్లు సరఫరా చేసినట్లే టీకాను కూడా ఇతర దేశాలకు అందిస్తామని మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరికిగానీ.. వచ్చే ఏడాది మొదట్లోగానీ టీకా అందుబాటులోకి రాచవ్చనని ట్రంప్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.