
న్యూఢిల్లీ: అమెరికా వీసా కోసం ఇకపై సుదీర్ఘంగా నిరీక్షించాల్సిన అవసరం లేకుండా భారతీయులకు అమెరికా రాయబార కార్యాలయం అరుదైన అవకాశం కల్పించింది. అత్యవసరంగా అమెరికా వెళ్లాల్సిన అవసరమున్న వారు ఇతర దేశాల్లోని ఎంబసీల నుంచి కూడా వీసా కోసం దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది.
బీ1, బీ2 బిజినెస్, పర్యాటక వీసాలకు ప్రస్తుతం హైదరాబాద్, కోల్‌కతా, ముంబైల్లో ఏడాదికి పైగా వెయిటింగ్ ఉంది! బ్యాంకాక్‌లో కేవలం 14 రోజుల్లోనే అపాయింట్‌మెంట్ దొరుకుతోంది. అందుకే అత్యవసరంగా వెళ్లాలనుకునేవారు విదేశీ ఎంబసీల్లో దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అధికారులు సూచించారు. సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నంల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది.