
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారులకు జారీ చేసే వీసా విషయంలో పాత సంప్రదాయ పద్దతికి స్వస్తి పలకనున్నారని సమాచారం.
త్వరలో అమెరికా వీసాలు 'పేపర్‌లెస్'గా మారనున్నాయని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో వీసాల మీద స్టాంపింగ్ వేసే సంప్రదాయ పద్ధతి కనుమరుగు కానుంది. ఇటీవల, జోబైడెన్ ప్రభుత్వం పేపర్‌లెస్ వీసాల కోసం పైలెట్ ప్రాజెక్ట్‌ను నిర్వహించి..సత్ఫలితాలు రాబట్టింది. పూర్తి స్థాయిలో స్టాంపింగ్ ప్రాసెస్‌ను డిజిటలైజ్ చేసే యోచనలో ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఈ సందర్భంగా వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ మాట్లాడుతూ..‘‘మేం పేపర్‌లెస్ వీసా ప్రాసెస్ కోసం పైలెట్ ప్రాజెక్ట్ చేశాం. మంచి ఫలితాలు రాబట్టాం. త్వరలోనే ఈ పద్దతిని అమలు చేస్తాం. కానీ దీనిని విస్తృతంగా వినియోగించాలంటే 18 నెలల సమయం పట్టొచ్చు. భవిష్యత్తులో పేపర్ లెస్ వీసాలు జారీ చేస్తున్న దేశాల జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకోసం వీసా స్టేటస్‌ను వివరించేలా యాప్ అవసరమవుతుందని ’’భావిస‍్తున్నట్లు జూలీ స్టప్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment