న్యూఢిల్లీ: అమెరికాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్‌లో వీలైనన్ని వీసా దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా దౌత్య వర్గాలు తీవ్రంగా కృష్టి చేస్తున్నాయని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గురువారం ప్రకటించారు. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు)
ప్రధాని అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాబోయే పర్యటనలో దౌత్యం, ఇమ్మిగ్రేషన్ వీసా సమస్యలకు సంబంధించి అమెరికా నుంచి ఇండియా ఏమి ఆశించవచ్చనే ప్రశ్నకు సమాధామిచ్చిన మాథ్యూ మిల్లర్ వీసా సమస్యల పరిష్కారానికే తమ తొలి ప్రాధాన్యత అని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని కూడా వ్యాఖ్యానించారు. (స్టన్నింగ్ డ్రెస్‌తో మెస్మరైజ్ చేసిందిగా: ధరెంతో తెలిస్తే ఔరా అంటారు!)
భారత్‌తో అమెరికా భాగస్వామ్యం ఇరు దేశాలకు కీలకమని, ఉమ్మడి లక్ష్యాల దిశగా అమెరికా, భారత్ కలిసి పనిచేస్తున్నాయన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన వీసాలకు సంబంధించి, తమ కాన్సులర్ బృందాలు అనేక వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి భారీ ప్రయత్నాలే చేస్తున్నాయన్నారు. జూన్ 21-24 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే.\
మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, బిజినెస్ అప్‌డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్
Comments
Please login to add a commentAdd a comment