కోవిడ్ ముగిసిన తర్వాత ప్రజలు తమ విహార యాత్రలు, వ్యాపార పనులంటే మళ్లీ విదేశీ పర్యటనలు మొదలుపెట్టారు. మీరు ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారా? అయితే అటువంటి వారు మరో 3 సంవత్సరాలు ఆగక తప్పదు. ఎందుకంటే అమెరికా పర్యాటక వీసా అపాయింట్‌మెంట్ కోసం దాదాపు 1000 రోజుల వెయిటింగ్ లిస్ట్ ఉంది.
వెయ్యి రోజుల ఆగాల్సిందే!
యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ ప్రకారం.. మంగళవారం నాటికి మొదటి సారి ఇంటర్వ్యూ అవసరమయ్యే బీ1(వ్యాపారం), బీ2(పర్యాటక) దరఖాస్తుదారుల కోసం వేచి ఉండాల్సిన సమయం వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబైలో 999 రోజులు; హైదరాబాద్‌లో 994 రోజులు; ఢిల్లీలో 961 రోజులు; చెన్నైలో 948, కోల్‌కతాలో 904గా ఉంది. దీనర్థం ప్రస్తుత పరిస్థితుల్లో నాన్-ఇమ్మిగ్రెంట్ విభాగంలో ఎవరైనా బీ1(బిజినెస్), బీ2(టూరిస్ట్) వీసాపై అగ్రరాజ్యం వెళ్లాలని దరఖాస్తు చేసుకుంటే వారికి 2025కి వీసా అపాయింట్‌మెంట్ లభించనుంది.
‘కేవలం కొత్తగా వీసా పొందేవారికే నిరీక్షణ సమయం ఎక్కువగా ఉంటోంది. ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న దరఖాస్తుదారులకు అత్యవసర అపాయింట్‌మెంట్‌లు రోజుల్లో అందుబాటులో ఉంటాయి. వీలైనంత త్వరగా వెయిటింగ్ పీరియడ్‌ని తగ్గించడంతో పాటు వీసా జరీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము, ”అని యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఒక ట్వీట్‌లో తెలిపింది.
మరో వైపు అధికారులు గత రెండు నెలల్లో భారతదేశంలో ఉన్న ఈ వెయిటింగ్ సమయాన్ని తగ్గించడం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉన్న బ్యాక్‌లాగ్, దరఖాస్తుల సంఖ్యను బట్టి, ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ వెయిటింట్ పీరియడ్( నిరీక్షణ సమయం) తగ్గేందుకు చాలా సమయం పట్టేలా ఉంది.
చదవండి: Amazon Layoffs అమెజాన్ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment