ఇటీవలి కాలంలో రకరకాల ఎయిర్ ప్యూరిఫైయర్లు అందుబాటులోకి వచ్చాయి. ఫొటోలో కనిపిస్తున్నది వాటికి పూర్తి భిన్నమైన ఎయిర్‌ప్యూరిఫైయర్. ఇది గాలిలోని దుమ్ము, ధూళితో పాటు ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి సూక్ష్మజీవులను పూర్తిగా ఖతం చేసేస్తుంది. హాంకాంగ్‌కి చెందిన ‘హోమ్‌ప్యూర్’ కంపెనీ ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌ని రూపొందించింది.
ఇది ఆరు దశలలో తన పరిసరాల్లోని గాలిని శుభ్రపరుస్తుందని, కోవిడ్ వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌ను కూడా ఇట్టే ఖతం చేసేస్తుందని తయారీదారులు చెబుతున్నారు. ఇందులోని ప్రీఫిల్టర్, ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్, హైప్రెషర్ ప్రాసెసర్‌లు సమ్మిళితంగా పనిచేస్తూ, గాలిలోని 0.1 మైక్రాన్ల పరిమాణంలోని సూక్షా్మతి సూక్ష్మమైన కణాలను కూడా తొలగిస్తాయని చెబుతున్నారు. దీని ధర 820 డాలర్లు (రూ. 67,767) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment