పండుగ సీజన్‌లో కేవలం కార్లు, బైకులు మాత్రమే కాదు, మంచి స్మార్ట్‌ఫోన్‌లను కొనటానికి కూడా వినియోగదారులు ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో రూ. 25,000 కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ ఫోన్స్ ఏవి? వాటి వివరాలు ఏంటి? అనేది వివరంగా తెలుసుకుందాం.
మోటరోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo)
రూ. 25,000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో మోటరోలా కంపెనీకి చెందిన 'ఎడ్జ్ 40 నియో' ఒకటి. ఇది 6.55 ఇంచెస్ కర్వ్డ్ పోలెడ్ డిస్‌ప్లే, చిక్ వేగన్-లెదర్ బ్యాక్ డిజైన్ కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పెద్ద 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 64 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ పొందుతుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7030, 6nm ప్రాసెసర్ కలిగిన ఈ మొబైల్ వినియోగదారులకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఐకూ జెడ్7 ప్రో (iQOO Z7 Pro)
ఐకూ జెడ్7 ప్రో మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో స్మార్ట్‌ఫోన్. దీని ధర కూడా రూ. 25000 కంటే తక్కువే. 125జీబీ, 256జీబీ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ పొందుతుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా వివిధ లైటింగ్ పరిస్థితులలో కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది.
4,600mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ పొందుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ కలిగిన ఈ మొబైల్ బ్లూ లాగూన్, గ్రాఫైట్ మ్యాట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది.
లావా అగ్ని 2 (Lava Agni 2)
మన జాబితాలో మూడవ మొబైల్ లావా అగ్ని 2. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ కలిగి, 8జీబీ ర్యామ్ పొందుతుంది. వైబ్రెంట్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే వీడియోలు చూడటానికి లేదా గేమ్స్ ఆడటానికి అనుకూలంగా ఉంటుంది. కెమెరా అద్భుతంగా ఉంటుంది.
ఇదీ చదవండి: కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం - మునుపెన్నడూ లేనన్ని బెనిఫిట్స్
పోకో ఎక్స్5 ప్రో (Poco X5 Pro)
పోకో ఎక్స్5 ప్రో మంచి డిజైన్, క్వాలిటీ ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్. ఇది 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. క్వాల్కామ్ స్నాప్‍డ్రాగన్ 778జీ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఇన్‍ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్, 3.5 మిమీ హెడ్‍ఫోన్ జాక్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ మొదలైన ఫీచర్స్ పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment