స్మార్ట్‌ఫోన్ జనాల చేతిలోకి వచ్చాక ఫొటోగ్రఫీ చాలా తేలికైపోయింది. సెల్ఫీలు మొదలుకొని, కంటికి నచ్చిన ప్రతిదృశ్యాన్నీ స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో బంధించే జనాలు ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న స్మార్ట్‌ఫోన్ కెమెరాలకు కొన్ని పరిమితులు ఉన్నాయి.
సుదూరంలో ఉన్నవాటిని స్మార్ట్‌ఫోన్ కెమెరాలతో ఫొటో తీయడం దాదాపుగా దుస్సాధ్యం. వీటి లెన్స్ కొంత వరకు మాత్రమే జూమ్ చేయగలుగుతాయి. ఆ పరిధి దాటిన వాటిని దగ్గరగా, స్పష్టంగా ఫొటోలు తీయలేవు. ఈ పరిమితిని అధిగమించడానికే ఈ స్మార్ట్‌ఫోన్ టెలిస్కోప్ అందుబాటులోకి వచ్చింది.
ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు - కారణం తెలిస్తే అవాక్కవుతారు!
‘హీస్టియా–లెన్స్’ పేరుతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ టెలిస్కోపిక్ లెన్స్‌ను స్మార్ట్‌ఫోన్ కెమెరాకు అమర్చుకుంటే, ఆకాశంలో సుదూరాన కనిపించే గ్రహాలను, నక్షత్రాలను స్పష్టంగా ఫొటో తీయడం సాధ్యమవుతుంది. ‘వావోనిస్’ అనే అమెరికన్ కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఈ స్మార్ట్‌ఫోన్ టెలిస్కోపిక్ లెన్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ లెన్స్ ధర 289 డాలర్లు (రూ.23,702) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment