cemaras
-
ఆకాశంలో చుక్కలను సైతం ఇట్టే ఫోటో తీయొచ్చు.. ఇది చాలా స్మార్ట్ గురూ!
స్మార్ట్‌ఫోన్ జనాల చేతిలోకి వచ్చాక ఫొటోగ్రఫీ చాలా తేలికైపోయింది. సెల్ఫీలు మొదలుకొని, కంటికి నచ్చిన ప్రతిదృశ్యాన్నీ స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో బంధించే జనాలు ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న స్మార్ట్‌ఫోన్ కెమెరాలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. సుదూరంలో ఉన్నవాటిని స్మార్ట్‌ఫోన్ కెమెరాలతో ఫొటో తీయడం దాదాపుగా దుస్సాధ్యం. వీటి లెన్స్ కొంత వరకు మాత్రమే జూమ్ చేయగలుగుతాయి. ఆ పరిధి దాటిన వాటిని దగ్గరగా, స్పష్టంగా ఫొటోలు తీయలేవు. ఈ పరిమితిని అధిగమించడానికే ఈ స్మార్ట్‌ఫోన్ టెలిస్కోప్ అందుబాటులోకి వచ్చింది. ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు - కారణం తెలిస్తే అవాక్కవుతారు! ‘హీస్టియా–లెన్స్’ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ టెలిస్కోపిక్ లెన్స్‌ను స్మార్ట్‌ఫోన్ కెమెరాకు అమర్చుకుంటే, ఆకాశంలో సుదూరాన కనిపించే గ్రహాలను, నక్షత్రాలను స్పష్టంగా ఫొటో తీయడం సాధ్యమవుతుంది. ‘వావోనిస్’ అనే అమెరికన్ కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఈ స్మార్ట్‌ఫోన్ టెలిస్కోపిక్ లెన్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ లెన్స్ ధర 289 డాలర్లు (రూ.23,702) మాత్రమే! -
కెమెరాకు చిక్కిన చిరుతలు
ఆసిఫాబాద్ : రెండు చిరుత పులులు పశుకళేబరాన్ని తింటూ కెమెరాకు చిక్కాయి. కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలోని సిర్పూర్ రేంజి ప్రాంతంలో ఈ నెల 28న రెండు చిరుతలు పశు కళేబరాన్ని తింటూ అటవీ అధికారులు అమర్చిన కెమెరాకు చిక్కాయి. సాధారణంగా చిరుతలు ఒంటరిగా వేటాడడం, సంచారిస్తుంటాయని ఏదైనా వేటాడిన జంతువును రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి స్వీకరస్తాయని కాగజ్‌నగర్ డివిజన్ అటవీ అధికారి ఎన్.నర్సింహారెడ్డి పేర్కొన్నారు. సాధారణంగా ఇలా రెండు చిరుతలు ఎక్కడా ఒక చోట వేటాడడం ఉండదని ఇది అరుదని తెలిపారు. అయితే ఈ రెండు ఒకే తల్లి పిల్లలు లేక జత కట్టిన చిరుతలు అయితేనే ఇలా ఒక చోట ఉంటాయన్నారు. గతేడు డిసెంబర్‌లోనూ మూడు చిరుతలు ఒకె కెమెరాలో కన్పించాయని ఆయన గుర్తుచేశారు. చనిపోయిన పశువు యాజమానికి నష్టపరిహారం అటవీ శాఖ నుంచి చెల్లిస్తామని తెలిపారు. -
ఇకపై పోలీసుల చేతుల్లో నిఘా నేత్రం
– జిల్లాకు 15 సోనీ హ్యాండ్ కెమెరాలు కేటాయింపు – అల్లర్లు, ఉత్సవాలు, రాస్తారోకోలు, ధర్నాలపై వీటితో నిఘా – పనితీరును పరిశీలించిన ఎస్పీ కర్నూలు : నేరాల నియంత్రణకు పోలీసు అధికారులు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయం నుంచి జిల్లాకు 15 సోనీ హ్యాండీ కెమెరాలు వచ్చాయి. గత నెలలో జిల్లాకు నాలుగు డ్రోన్ కెమెరాలను కేటాయించిన సంగతి తెలిసిందే.వీటి నిఘాతో పోలీసులు అసాంఘిక శక్తుల ఆట కట్టించనున్నారు. రద్దీ, జన సమూహ, ఎత్తు ప్రదేశాల్లో జరిగే నేరాలను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించనున్నారు. వాటి వినియోగంపై ఇద్దరు ఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు శిక్షణ కూడా పొందారు. పోలీసుల చేతుల్లో ఇకపై నిఘా నేత్రాలు ఉంటాయి. అల్లర్లు, ఉత్సవాలు, రాస్తారోకోలు, ధర్నాలను హ్యాండ్ కెమెరాలతో చిత్రీకరించనున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు హ్యాండ్ కెమెరాలతో రహస్యంగా షూట్ చేసి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి హ్యాండ్ కెమెరాలు ఉపయోగపడతాయని ఎస్పీ ఆకె రవికృష్ణ అభిప్రాయపడ్డారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో హ్యాండ్ కెమెరాల పనితీరును ఆయన పరిశీలించి ప్రారంభించారు. ధర్నాలు, రాస్తారోకోలు, అల్లర్లు, ఉత్సవాల వద్ద బందోబస్తు విధుల్లో ఉండే కానిస్టేబుళ్లు ఇకపై వీటిని ఖచ్చితంగా వినియోగిస్తారని వెల్లడించారు. హ్యాండ్ కెమెరాలను డీఎస్పీ, క్రైం బ్రాంచ్ కార్యాలయాలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు చంద్రశేఖర్‌రెడ్డి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, మురళీధర్, వెంకటాద్రి, సుప్రజ, కొల్లి శ్రీనివాసులు, ఈశ్వర్‌రెడ్డి, హరినాథరెడ్డి, వినోద్‌కుమార్, బాబుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.