రూ.20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు - వివరాలు | Best Five Diesel Cars Want To Buy Festival Season | Sakshi
Sakshi News home page

రూ.20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు - వివరాలు

Published Fri, Oct 27 2023 9:21 PM | Last Updated on Fri, Oct 27 2023 10:09 PM

Best Five Diesel Cars Want To Buy Festival Season - Sakshi

దీపావళి సందర్భంగా చాలామంది కొత్త కారు కొనాలనుకుంటారు. ఈ కథనంలో రూ. 20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 డీజిల్ కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

మహీంద్రా XUV700
ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మహీంద్రా XUV700 దీపావళి సందర్భంగా కొనుగోలు చేయదగిన ఉత్తమ SUV. దీని ప్రారంభ ధర రూ. 14.47 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ 185 పీఎస్ పవర్, 450 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా హారియర్
దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కంపెనీకి చెందిన హారియర్ కూడా మన జాబితాలో రూ. 20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ మోడల్. దీని ధర రూ. 15.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారునిలోని 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ 170 పీఎస్ పవర్, 350 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

హ్యుందాయ్ ఆల్కజార్
రూ.17.73 లక్షల ఎక్స్ షోరూమ్ ధర వద్ద లభిస్తున్న హ్యుందాయ్ ఆల్కజార్ కూడా ఈ పండుగ సీజన్లో కొనుగోలు చేయదగిన ఉత్తమ మోడల్. ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 113 Bhp పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది.

ఎంజి హెక్టర్
మోరిస్ గ్యారేజ్ కంపెనీకి చెందిన పాపులర్ మోడల్ హెక్టర్ రూ. 17.99 లక్షల ధర వద్ద లభిస్తుంది. ఇందులో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 170 పీఎస్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది.

ఇదీ చదవండి: పండుగ సీజన్‌లో గొప్ప ఆఫర్స్.. టూ వీలర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి!

కియా సెల్టోస్
సౌత్ కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్‌కి చెందిన సెల్టోస్ దేశీయ మార్కెట్లో రూ. 13.60 లక్షల ధర వద్ద లభించే ఉత్తమ మోడల్. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 115 పీఎస్ పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement