భారతీయ మార్కెట్లో కేవలం చిన్న కార్లకు మాత్రమే కాకుండా 7 సీటర్ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కథనంలో దేశీయ విఫణిలో కొంత తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ టాప్ 5.. 7 సీటర్ కార్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
రెనాల్ట్ ట్రైబర్
ఇండియన్ మార్కెట్లో రూ. 6.34 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే రెనాల్ట్ ట్రైబర్'' ఈ జాబితాలో చెప్పుకోదగ్గ 7 సీటర్. సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 71 Bhp పవర్, 96 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది.
మారుతి సుజుకి ఎర్టిగా
మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఎర్టిగా భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న 7 సీటర్ కారు. దీని ధరలు రూ. 8.64 లక్షల నుంచి రూ. 13.08 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇందులోని 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 102 బీహెచ్‌పి పవర్ 136 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ పొందుతుంది.
టయోటా రూమియన్
టయోటా కంపెనీకి చెందిన రూమియన్ అనేది మారుతి సుజుకి ఎర్టిగా రీబ్యాడ్జ్ వెర్షన్. ఈ MPV ధరలు రూ. 10.29 లక్షల నుంచి రూ. 13.68 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇది కూడా మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది.
మహీంద్రా బొలెరో నియో
దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన బొలెరో నియో ధరలు రూ. 9.64 లక్షల నుంచి రూ. 11.38 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇందులోని 1.5 లీటర్, 4 సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 99 బీహెచ్‌పి పవర్, 260 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
ఇదీ చదవండి: నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సైబర్‌ట్రక్ లాంచ్ చేసిన టెస్లా - ధర ఎంతంటే?
కియా కారెన్స్
7 సీటర్ విభాగంలో చెప్పుకోదగ్గ కారు కియా కారెన్స్. దీని ధర రూ. 10.45 లక్షల నుంచి రూ. 19.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 113 బీహెచ్‌పి పవర్, 144 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
కియా కారెన్స్ కారులోని 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్, 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లలో లభిస్తుంది. ఇవన్నీ కూడా మంచి పనితీరుని అందిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment