భారతదేశంలో డిజిటల్ ట్రాన్సక్షన్స్ వేగంగా సాగుతోంది. ఇదిలాగే కొనసాగితే 2030 నాటికి డిజిటల్ రిటైల్ చెల్లింపులు ఏకంగా 7 ట్రిలియన్ డాలర్లు లేదా రూ. 584.6 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని.. 'హౌ అర్బన్ ఇండియా పేస్' నివేదికలో వెల్లడించింది.
డిజిటల్ పెరుగుదలకు ప్రధాన కారణం ఈ కామర్స్ రంగం అని తెలుస్తోంది. 2022లో ప్రపంచంలోని మొత్తం డిజిటల్ లావాదేవీల వాల్యూమ్‌లలో భారతదేశం 46 శాతం వాటాను కలిగి ఉందని నివేదిక పేర్కొంది. కార్డ్‌లు, డిజిటల్ వాలెట్‌లు డిజిటల్ లావాదేవీ విలువలో 10 శాతం మాత్రమే.
దేశంలోని 120 ప్రధాన నగరాల్లోని 6000 మంది ఆన్‌లైన్ సర్వేలో 90 శాతం మంది ఆన్‌లైన్ కొనుగోళ్లు చేయడానికి డిజిటల్ చెల్లింపులను ఇష్టపడుతున్నారు. సంపన్న కస్టమర్‌లు తమ లావాదేవీలలో 80 శాతం వరకు డిజిటల్ చెల్లింపులను ఉపయోగిస్తున్నారు. మిలినీయర్లలో 72 శాతం మంది డిజిటల్ లావాదేవీలను ఇష్టపడుతున్నారని తెలుస్తోంది.
సుమారు 1000 మంది భారతీయ వ్యాపారుల లావాదేవీల వాల్యూమ్‌లలో 69 శాతం డిజిటల్ చెల్లింపు విధానాలు ఉన్నాయి. పాన్ షాపులు, పండ్లు, పూల విక్రయదారులు, ఫుడ్ స్టాల్స్, కిరానా దుకాణాలు వంటి వీధి వ్యాపారులు కూడా డిజిటల్ పేమెంట్స్ మీద ఆసక్తి చూపుతున్నారు. ఇలా మొత్తం మీద రాబోయే రోజుల్లో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment