క్రెడిట్ హిస్టరీ లేకున్నా సామాన్యులకు రుణం
లావాదేవీల ఆధారంగా నిర్ణయిస్తున్న కంపెనీలు
న్యూఢిల్లీ: రుణాల మంజూరులో యూని ఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) కీలకంగా మారిందని ఒక నివేదిక వెల్లడించింది. ‘ఓపెన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు: రుణం పొందడంలో చిక్కులు’ పేరుతో చేసిన అధ్యయనం ప్రకారం.. ప్రధానంగా క్రెడిట్ హిస్టరీ (గతంలో రుణం పొందడం) లేని వారు రుణం అందుకోవడానికి యూపీఐ దోహద పడుతోంది. యూపీఐ యాప్స్ ఆధారంగా జరిగిన డిజిటల్ చెల్లింపుల లావాదేవీల సమాచారం అందుబాటులో ఉన్నందున.. రుణ మంజూరుకై నిర్ణయాలు తీసుకునేందుకు రుణ దాతలకు మార్గం సుగమం అవుతోంది.
మొదటిసారిగా అధికారికంగా రుణం అందుకోవడానికి సామాన్యులకు వీలు కల్పి స్తోంది. యూపీఐ లావాదేవీలలో 10% పెరుగుదల క్రెడిట్ లభ్యత 7% దూసుకెళ్లేందుకు దారితీసింది. రుణగ్రహీ తలను మెరుగ్గా అంచనా వేయడానికి రుణదాతల కు డిజిటల్ ఫైనాన్షియల్ హిస్టరీలు ఎలా ఉపయోగపడ్డాయో ఈ గణాంకాలు ప్రతి బింబిస్తున్నాయి. రుణాల్లో వృద్ధి ఉన్నప్ప టికీ డిఫాల్ట్ రేట్లు పెరగలేదు. యూపీఐ– ఆధారిత డిజిటల్ లావాదేవీ డేటా రుణ దాతలు బాధ్యతాయుతంగా విస్తరించడంలో సహాయపడింది. 2016లో ప్రారంభించినప్పటి నుండి భారత్‌లో ఆర్థిక లభ్యతను యూపీఐ సమూలంగా మార్చింది.
75 శాతం యూపీఐ కైవసం..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ 30 కోట్ల మంది వ్యక్తులు, 5 కోట్ల మంది వ్యాపా రులు అడ్డంకులు లేని డిజిటల్ లావా దేవీలను నిర్వహించడానికి వీలు కల్పించింది. 2023 అక్టోబర్ నాటికి భారత్‌లోని మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 75 శాతం యూపీఐ కైవసం చేసుకుంది. పాల్గొనే బ్యాంకుల కస్టమర్లందరికీ చెల్లింపులను సేవగా అందించడానికి యాప్‌లను రూపొందించడానికి థర్డ్ పార్టీ వెండార్లను యూపీఐ చెల్లింపుల వ్యవస్థ అనుమతిస్తుంది. రియల్ టైమ్‌లో ధృవీకరించదగిన డిజిటల్ లావాదేవీల సమాచారం యూపీఐ ఆధారంగా అందుబాటులో ఉంటుంది.
కస్టమర్లు ఈ సమాచారాన్ని రుణాన్ని అందుకునే ప్రక్రియలో భాగంగా ఆర్థిక సంస్థలు, అనుబంధ కంపెనీలతో పంచుకో వచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విస్తృతంగా యూపీఐని ఆదరించడంలో అందుబాటులో ఉన్న డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. యూపీఐతో భారత దేశం సాధించిన విజయం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. పబ్లిక్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఓపెన్ బ్యాంకింగ్ విధానాలతో కలపడం ఎక్కువ మందికి రుణాలు అందుతాయి. అలాగే ఆవిష్కరణలను, సమానమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని అధ్యయనం వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment