![beauty tips - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/26/Benefits-Of-Applying-Ice.jpg.webp?itok=UB5TGuSa)
చేతి నిండా ఐస్‌క్యూబ్స్ తీసుకోండి. వాటితో ముఖం మీద, చేతులు, మెడ పైన మృదువుగా రబ్ చేయండి. ఎందుకంటే ఐస్ మీకు ఫేస్ మాస్క్‌లా పని చేసి చర్మాన్ని తిరిగి వికసింపజేస్తుంది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో.. ఒక చిన్న గుడ్డ సంచిలో ఐస్‌క్యూబ్స్ వేసి ఈవిధంగా చేయవచ్చు..
∙కళ్ల కింద చర్మం ఉబ్బినట్టుగా కనిపిస్తుంటే చల్లటి నీళ్లతో లేదంటే ఒక ఐస్‌క్యూబ్‌తో మృదువుగా మర్దన చేయండి. డల్‌గా ఉన్న మీ కళ్లలో జీవం వచ్చేస్తుంది. కళ్లకింద వలయాలు కూడా తగ్గుముఖం పడతాయి. రోజూ పగటి వేళ ఒకసారైనా ఇలా చేయవచ్చు. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది.
∙ఈ కాలం చమటకు ఒరుసుకుపోయే భాగాలలో ఎర్రగా అవుతుంటుంది. ధరించే దుస్తుల రాపిడి వల్ల కూడా చర్మం ఎర్రబడవచ్చు. ఇలాంటప్పుడు ఎర్రబడిన ఆ ప్రాంతంలో ఐస్‌తో 5 నుంచి 10 నిమిషాలు మెల్లగా రాస్తూ ఉండండి. మంట ఫీలింగ్ నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
∙మృతకణాలను తొలగించడానికి మేలైన చిట్కా.. దోసకాయ లేదా స్ట్రాబెర్రీ, పుచ్చకాయ ముక్కలను విడివిడిగా గుజ్జు చేయండి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉండే ఐస్ ట్రేలో పోసి దానిని డీప్ ఫ్రీజర్‌లో ఉంచండి. గట్టిపడ్డాక ఒక ఐస్ క్యూబ్ తీసుకొని అది కరిగేంతవరకు ముఖాన్ని, చేతులకు రబ్ చేస్తూ ఉండండి. వారంలో నాలుగైదు సార్లు ఇలా చేయవచ్చు.
∙చేతి నిండా ఐస్ క్యూబ్స్ తీసుకొని వాటిని కాటన్ టవల్‌లో వేసి, కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ వేసి మూటలా చుట్టాలి. దీంతో ముఖాన్ని, చేతులు, పాదా లను రబ్ చేయాలి. రోజూ పడుకునే ముందు ఇలా చేస్తే చర్మం వడలిపోదు.
Comments
Please login to add a commentAdd a comment