ఆసీస్ లక్ష్యం 412
ఇంగ్లండ్‌తో యాషెస్ తొలి టెస్టు
కార్డిఫ్ : యాషెస్ సిరీస్ తొలి టెస్టు మూడో రోజు ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్ల బౌలర్లు ఆధిపత్యం చూపడంతో శుక్రవారం ఒక్క రోజే 15 వికెట్లు నేలకూలాయి. మరోవైపు ఆసీస్ ముందు ఇంగ్లండ్ జట్టు 412 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆటకు మరో రెండు రోజుల సమయం ఉంది. 122 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 70.1 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 73 పరుగులకు మూడు వికెట్లు పడిన దశలో ఇయాన్ బెల్ (89 బంతుల్లో 60; 11 ఫోర్లు), జో రూట్ (89 బంతుల్లో 60; 9 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 97 పరుగులు జోడించారు.
ఆ తర్వాత స్టోక్స్ (59 బంతుల్లో 42; 9 ఫోర్లు) ఓ మాదిరిగా ఆడినా స్పిన్నర్ లియోన్ (4/75) ధాటికి మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. అంతకుమందు 264/5 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ 84.5 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌట్ అయ్యింది.