టెస్టుల కోసం వన్డేలకు గుడ్‌బై
ఇంగ్లండ్ జట్టు యాషెస్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఇయాన్ బెల్‌కు వన్డే జట్టులో మాత్రం చోటు దక్కలేదు. అందుకని హర్టయ్యాడో లేక నిజంగానే వన్డేలు ఆడటం అనవసరం అనుకున్నాడో... అనూహ్యంగా వన్డేలకు వీడ్కోలు చెప్పేశాడు. 161 వన్డేల్లో 5416 పరుగులు చేసిన ఈ సీనియర్ క్రికెటర్ వయసు 33 ఏళ్లు. అప్పుడే ఎందుకు రిటైర్‌మెంట్ అని అడిగితే... ‘సుదీర్ఘకాలం ఇంగ్లండ్ తరఫున టెస్టులు ఆడాలని కోరుకుంటున్నాను. యాషెస్ సిరీస్ ఆడటంలోనే అసలైన ఆనందం ఉంది’ అని చెబుతున్నాడు.