Ian bell
-
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక బ్యాటింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ ప్లేయర్
ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్‌ను నియమించుకుంది. ప్రత్యర్ధి జట్టుకు చెందిన మాజీ ఆటగాడిని శ్రీలంక జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేసుకుంది. ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ ఇయాన్ బెల్ లంకతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు శ్రీలంక బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని లంక బోర్డు ఇవాళ (ఆగస్ట్ 13) ప్రకటించింది.42 ఏళ్ల ఇయాన్ బెల్ 2004-15 మధ్యలో ఇంగ్లండ్ తరఫున 118 టెస్ట్‌లు, 161 వన్డేలు, 8 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 22 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీల సాయంతో 7727 పరుగులు.. వన్డేల్లో 4 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 5416 పరుగులు.. టీ20ల్లో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 188 పరుగులు చేశాడు.బెల్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకోవడం వెనుక శ్రీలంక క్రికెట్ బోర్డుది పెద్ద వ్యూహరచనే ఉంది. బెల్కు ఇంగ్లండ్ జట్టుతో సుదీర్ఘ అనుబంధం ఉంది కాబటి, ఆ జట్టు లోటుపాట్లు తెలిసే అవకాశం ఉంది. అలాగే బ్యాటింగ్ కోచ్‌గా కూడా బెల్కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఈ అంశాలన్నీ ఇంగ్లండ్ పర్యటనలో శ్రీలంకకు కలిసొచ్చే అవకాశం ఉంది.ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు..ధనంజయ డిసిల్వ (కెప్టెన్), దిముత్ కరుణరత్నే, నిషన్ మధుష్క, పథుమ్ నిస్సంక, కుసాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండీమల్, కమిందు మెండిస్, సమరవిక్రమ, అశిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, కసున్ రజిత, లహీరు కుమార, నిసాల తారక, ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్, జెఫ్రీ వాండర్సే, మిలన్ రత్నాయకేఇంగ్లండ్ జట్టు..హ్యారీ బ్రూక్, డేనియల్ లారెన్స్, బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), క్రిస్ వోక్స్, జోర్డన్ కాక్స్, ఓలీ పోప్, జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్, మార్క్ వుడ్షెడ్యూల్..ఆగస్ట్ 21-25: తొలి టెస్ట్ (మాంచెస్టర్)ఆగస్ట్ 29-సెప్టెంబర్: రెండో టెస్ట్ (లార్డ్స్)సెప్టెంబర్ 6-10: మూడో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) -
వన్డే ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్ కీలక నిర్ణయం..
వన్డే వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా మాజీ కెప్టెన్, కోచ్‌గా అనుభవజ్ఞుడైన స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను న్యూజిలాండ్ జట్టు తమ కోచింగ్ బృందంలోకి చేర్చింది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు విజేతగా నిలవడంలో కోచ్‌గా కీలకపాత్ర పోషించిన ఫ్లెమింగ్‌కు భారత గడ్డపై ఉన్న అపార అనుభవం తమ జట్టుకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుందని కివీస్ బోర్డు భావించింది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు జేమ్స్ ఫోస్టర్, బెల్ (ఇంగ్లండ్), సక్లాయిన్ (పాకిస్తాన్) కూడా కోచింగ్ టీమ్‌లోకి వచ్చారు. వన్డే ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్.. ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో స్టీఫెన్ ఫ్లెమింగ్, పోస్టర్ కోచింగ్ బాధ్యతలు చెపట్టనుండగా.. ఇయాన్ బెల్ టీ20 సిరీస్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. అదే విధంగా సక్లాయిన్ కివీస్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేయనున్నాడు. ఆగస్టు 30 నుంచి కివీస్.. ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ టూర్లో భాగంగా న్యూజిలాండ్ అతిథ్య ఇంగ్లండ్‌తో నాలుగు టీ20లు , నాలుగు వన్డేలు ఆడనుంది. న్యూజిలాండ్ పర్యటన సెప్టెంబర్ 15న ముగయనుంది. అనంతరం బ్లాక్ క్యాప్స్ బంగ్లాదేశ్‌కు వెళ్లనుంది. బంగ్లా టైగర్స్త్తో మూడు వన్డేలు ఆడనుంది. చదవండి: Ind Vs Pak: పాకిస్తాన్‌తో మ్యాచ్.. తుది జట్టులో తిలక్ వర్మకు ఛాన్స్! ఇక అయ్యర్.. -
త్వరలో ఆటకు బెల్ బైబై
లండన్: ఇప్పటికే అంతర్జాతీయ వన్డేలకు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బెల్.. ఈ ఏడాదితో దేశవాళి క్రికెట్‌తో పాటు టెస్టు క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించాడు. 2004లో ఇంగ్లండ్ వన్డే, టెస్టు జట్లలో అరంగేట్రం చేసిన అతడు... 161 వన్డేల్లో 5416 పరుగులు, 118 టెస్టుల్లో 7727 పరుగులు సాధించాడు. టెస్టు కెరీర్ కోసం 2015లోనే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన 38 ఏళ్ల బెల్... గాయాలతో టెస్టు జట్టులోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేదు. (చదవండి: రైనాకు ఏదైనా జరగకూడనిది జరిగితే..!) చివరిసారిగా ఇంగ్లండ్ తరఫున 2015లో టెస్టు మ్యాచ్ ఆడిన అతడు... మళ్లీ జట్టులోకి రాలేదు. అప్పటి నుంచి దేశవాళి క్రికెట్ జట్టు వార్విక్షైర్తో ఉన్నాడు. ‘క్రికెట్‌పై నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అయితే నాకిష్టమైన ఆటను ఆడేందుకు నా శరీరం సహకరించడం లేదు. దాంతో ఈ ఏడాదితో క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నా’ అని బెల్ పేర్కొన్నాడు. ఇయాన్ బెల్ తన కెరీర్లో ఇంగ్లండ్ తరఫున 8 టి20లు ఆడాడు. (చదవండి: శానిటైజర్‌ను ఇలా కూడా వాడొచ్చా!) -
బ్యాట్స్‌మన్ మైండ్ బ్లాక్ అయ్యింది.. వైరల్
లండన్ : ఓవైపు భారత్, ఇంగ్లండ్ జాతీయ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్నా మరోవైపు ఇంగ్లండ్ దేశవాలీ ట్వంటీ20 లీగ్ క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచుతోంది. అయితే ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో లంకషైర్ లైట్నింగ్ టీమ్‌పై 7 వికెట్ల తేడాతో బర్మింగ్‌హామ్ బియర్స్ గెలుపొందింది. తద్వారా క్వార్టర్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. బర్మింగ్‌హామ్ బియర్స్ బౌలర్ జోస్ పోయెస్‌డెన్ వేసిన ఓ బంతి టోర్నమెంట్లో సూపర్ బాల్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 10వ ఓవర్ బౌలింగ్ చేసిన పోయెస్‌డెన్ ఆ ఓవర్ చివరి బంతికి తన లెగ్ స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. గింగిరాలు తిరుగుతూ వికెట్ల వైపు దూసుకెళ్లిన బంతిని లంకషైర్ బ్యాట్స్‌మన్ స్టీవెన్ క్రాఫ్ట్ అంచనా వేయలేకపోవడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతి ఎలా వికెట్లవైపుగా వెళ్లిందో అర్థంకాక క్రాఫ్ట్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో లంకషైర్ 10 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. 102 పరుగులకు లంకషైర్ ఆలౌట్ కాగా, ఛేదనలో బర్మింగ్‌హామ్ ఆటగాళ్లు ఇయాన్ బెల్(34), ఎడ్ పొలాక్(36)లు 68 పరుగుల కీలక భాగస్వామ్యంతో 7 వికెట్ల తేడాతో సులువుగా విజయం సాధించింది. విజేత బర్మింగ్హామ టీమ్ క్వార్టర్స్ ఆశలు సజీవంగా నిలుపుకోగా, ఈ మ్యాచ్‌లో ఓడిన లంకషైర్ ఇదివరకే క్వార్టర్స్ చేరుకున్న విషయం తెలిసిందే. -
బ్యాట్స్‌మెన్ మైండ్ బ్లాక్ అయ్యింది..
-
టెస్టుల కోసం వన్డేలకు గుడ్‌బై
ఇంగ్లండ్ జట్టు యాషెస్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఇయాన్ బెల్కు వన్డే జట్టులో మాత్రం చోటు దక్కలేదు. అందుకని హర్టయ్యాడో లేక నిజంగానే వన్డేలు ఆడటం అనవసరం అనుకున్నాడో... అనూహ్యంగా వన్డేలకు వీడ్కోలు చెప్పేశాడు. 161 వన్డేల్లో 5416 పరుగులు చేసిన ఈ సీనియర్ క్రికెటర్ వయసు 33 ఏళ్లు. అప్పుడే ఎందుకు రిటైర్మెంట్ అని అడిగితే... ‘సుదీర్ఘకాలం ఇంగ్లండ్ తరఫున టెస్టులు ఆడాలని కోరుకుంటున్నాను. యాషెస్ సిరీస్ ఆడటంలోనే అసలైన ఆనందం ఉంది’ అని చెబుతున్నాడు. -
వన్డేలకు గుడ్ బై చెప్పిన మరో క్రికెటర్
ఇంగ్లండ్ క్రికెటర్ ఇయాన్ బెల్ వన్డేలకు గుడ్ బై చెప్పాడు. టెస్టులపై మరింత శ్రద్ధ పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు మీడియాకు తెలిపాడు. చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై యాషెస్ సిరీస్ గెలుచుకున్నతర్వాత.. టెస్టుల నుంచి రిటైర్ అవుతాడనే వార్తలు వినిపించినా.. చివరికు వన్డేల నుంచి మాత్రమే తప్పుకున్నట్టు బెల్ ప్రకటించాడు. యాషెస్ సిరీస్ ముగిశాక కోచ్ ట్రెవర్ బేలిస్, కెప్టెన్ అలెస్టర్ కుక్‌తో సంప్రదించిన అనంతరం టెస్టులకు గుడ్ బై చెప్పేందుకు ఇది సరైన సమయం కాదని తెలిపాడు. వన్డే కెరీర్లో 161 మ్యాచ్‌ల్లో 5416 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు బెల్ కావడం విశేషం. వన్డేల్లో 37.87 సగటుతో నాలుగు సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు చేశాడు. 115 టెస్టులు ఆడిన బెల్ 43 సగటుతో 22 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు సాధించాడు. -
ఇయాన్ బెల్ అర్ధసెంచరీ
అడిలైడ్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓపెనర్ ఇయాన్ బెల్ అర్థ సెంచరీ సాధించాడు. 66 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 34వ సెంచరీ. 276 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగుల స్కోరు దాటింది. హేల్స్ 27, మొయిన్ అలీ 17 పరుగులు చేసి అవుటయ్యారు. -
పమాదపు ‘గంట’ మోగింది!
రెండో రోజూ భారత్ శ్రమ నిష్ఫలం ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 569/7 డిక్లేర్డ్ ►బెల్ భారీ సెంచరీ, రాణించిన బట్లర్ ►భారత్ 25/1 వరుసగా రెండో రోజూ అదే వరుస... పేలవ బౌలింగ్‌కు తోడు పట్టు లేని ఫీల్డింగ్ వెరసి సౌతాంప్టన్ టెస్టులో భారత్ కష్టాలు పెరిగాయి. అలవోకగా పరుగులు సాధించిన ఇంగ్లండ్ భారీ స్కోరు నమోదు చేసి సురక్షిత స్థితికి చేరుకుంది. సీనియర్ ఆటగాడు బెల్ భారీ స్కోరుకు... బట్లర్ వన్డే తరహా దూకుడు జత కలిసి ఇంగ్లండ్‌ను ముందంజలో నిలిపాయి. ఇక మూడో రోజు భారత్ బ్యాటింగ్ ఏ మాత్రం నిలబడుతుందనే దానిపైనే మూడో టెస్టు ఫలితం ఆధారపడి ఉంది. సౌతాంప్టన్: ఇంగ్లండ్ బ్యాటింగ్ జోరు ముందు భారత బౌలింగ్ మరోసారి తలవంచింది. ఇయాన్ బెల్ (256 బంతుల్లో 167; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), బట్లర్ (83 బంతుల్లో 85; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ప్రదర్శనతో మూడో టెస్టులో కుక్ సేన భారీ స్కోరు సాధించింది. ఇక్కడి రోజ్ బౌల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ను 7 వికెట్ల నష్టానికి 569 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బ్యాలెన్స్ (288 బంతుల్లో 156; 24 ఫోర్లు) కూడా ఓవర్‌నైట్ స్కోరుకు మరిన్ని పరుగులు జత చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. ధావన్ (6) విఫలమయ్యాడు. విజయ్ (11 బ్యాటింగ్), పుజారా (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. కొనసాగిన జోరు... ఓవర్‌నైట్ స్కోరు 247/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ మొదటి సెషన్లో ధాటిగా ఆడింది. భారత బౌలింగ్‌లో పస లేకపోవడంతో బ్యాలెన్స్, బెల్ అలవోకగా పరుగులు సాధించారు. ఆరంభంలోనే ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి బ్యాలెన్స్ భువనేశ్వర్ లయను దెబ్బ తీశాడు. 99 బంతుల్లో బెల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే బ్యాలెన్స్ 278 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 142 పరుగులు జోడించారు. రెగ్యులర్ బౌలర్లు విఫలమైన చోట రోహిత్ శర్మ మెరిశాడు. లంచ్‌కు ముందు బ్యాలెన్స్‌ను కీపర్ క్యాచ్ ద్వారా అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అయితే రీప్లేలో బంతి, బ్యాట్‌కు తాకలేదని తెలిసింది. గత కొన్ని మ్యాచ్‌లుగా విఫలమవుతున్న ఇయాన్ బెల్ ఈసారి చెలరేగిపోయాడు. క్రీజ్‌లో కుదురుకున్నాక భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా జడేజా బౌలింగ్‌ను చితక్కొట్టాడు. అతను వేసిన ఒకే ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 20 పరుగులు రాబట్టాడు. అదే ఓవర్ రెండో బంతికి భారీ సిక్స్‌తో 179 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత కెప్టెన్ ధోని ఎన్ని మార్పులు, ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (సి) ధోని (బి) జడేజా 95; రాబ్సన్ (సి) జడేజా (బి) షమీ 26; బ్యాలెన్స్ (సి) ధోని (బి) రోహిత్ 156; బెల్ (సి) పంకజ్ (బి) భువనేశ్వర్ 167; రూట్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 3; మొయిన్ అలీ (సి) రహానే (బి) భువనేశ్వర్ 12; బట్లర్ (బి) జడేజా 85; వోక్స్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (163.4 ఓవర్లలో 7 వికెట్లకు) 569 డిక్లేర్డ్ వికెట్ల పతనం: 1-55; 2-213; 3-355; 4-378; 5-420; 6-526; 7-569. బౌలింగ్: భువనేశ్వర్ 37-10-101-3; షమీ 33-4-123-1; పంకజ్ సింగ్ 37-8-146-0; రోహిత్ శర్మ 9-0-26-1; రవీంద్ర జడేజా 45.4-10-153-2; శిఖర్ ధావన్ 2-0-4-0. భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (బ్యాటింగ్) 11; ధావన్ (సి) కుక్ (బి) అండర్సన్ 6; పుజారా (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (14 ఓవర్లలో వికెట్ నష్టానికి) 25 వికెట్ల పతనం: 1-17. బౌలింగ్: అండర్సన్ 7-3-14-1; బ్రాడ్ 4-2-4-0; జోర్డాన్ 2-1-3-0; వోక్స్ 1-1-0-0. -
బెల్ అజేయ శతకం
చెస్టర్ లీ స్ట్రీట్: సూపర్ ఫామ్‌లో ఉన్న ఇయాన్ బెల్ (189 బంతుల్లో 105 బ్యాటింగ్; 10 ఫోర్లు) తన అద్భుత ఆటతీరును మరోసారి ప్రదర్శించాడు. అజేయ శతకంతో రాణించడంతో యాషెస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించింది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 74 ఓవర్లలో ఐదు వికెట్లకు ఇంగ్లండ్ 234 పరుగులు చేసింది. క్రీజులో టిమ్ బ్రెస్నన్ (4 బ్యాటింగ్) ఉన్నాడు. ప్రస్తుతానికి ఆతిథ్య జట్టు 202 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇంగ్లండ్ వికెట్లు కోల్పోవడంతో ఇబ్బందుల్లో పడింది. 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో బెల్, పీటర్సన్ (84 బంతుల్లో 44; 6 ఫోర్లు) ఆదుకున్నారు. చక్కటి సమన్వయంతో ఈ జోడి ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొంది. వరుసగా రెండు బౌండరీలతో బెల్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అటు పీటర్సన్ కూడా ఈ మార్కు చేరుకునేలోపే నాథన్ లియోన్ దెబ్బ తీశాడు. దీంతో నాలుగో వికెట్‌కు వీరి మధ్య 106 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. బెయిర్‌స్టో (65 బంతుల్లో 28; 6 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 66 పరుగులు చేర్చిన బెల్ 184 బంతుల్లో కెరీర్లో 20వ శతకం సాధించాడు. అలాగే ఓ యాషెస్ సిరీస్‌లో మూడు సెంచరీలు చేసిన తొమ్మిదో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అంతకుముందు ఆస్ట్రేలియా 222/5 ఓవర్ నైట్ స్కోరుతో తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించి 270 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. సెంచరీ హీరో రోజర్స్ (250 బంతుల్లో 110; 14 ఫోర్లు) ఆదిలోనే అవుటయ్యాడు. టెయిలెండర్లలో హారిస్ (33 బంతుల్లో 28; 5 ఫోర్లు) ఒక్కడే పోరాడాడు. దీంతో 32 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. బ్రాడ్‌కు ఐదు వికెట్లు దక్కాయి.