వన్డే వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా మాజీ కెప్టెన్, కోచ్‌గా అనుభవజ్ఞుడైన స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను న్యూజిలాండ్ జట్టు తమ కోచింగ్ బృందంలోకి చేర్చింది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు విజేతగా నిలవడంలో కోచ్‌గా కీలకపాత్ర పోషించిన ఫ్లెమింగ్‌కు భారత గడ్డపై ఉన్న అపార అనుభవం తమ జట్టుకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుందని కివీస్ బోర్డు భావించింది.
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు జేమ్స్ ఫోస్టర్, బెల్ (ఇంగ్లండ్), సక్లాయిన్ (పాకిస్తాన్) కూడా కోచింగ్ టీమ్‌లోకి వచ్చారు. వన్డే ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్.. ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో స్టీఫెన్ ఫ్లెమింగ్, పోస్టర్ కోచింగ్ బాధ్యతలు చెపట్టనుండగా.. ఇయాన్ బెల్ టీ20 సిరీస్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు.
అదే విధంగా సక్లాయిన్ కివీస్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేయనున్నాడు. ఆగస్టు 30 నుంచి కివీస్.. ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో భాగంగా న్యూజిలాండ్ అతిథ్య ఇంగ్లండ్‌తో నాలుగు టీ20లు , నాలుగు వన్డేలు ఆడనుంది. న్యూజిలాండ్ పర్యటన సెప్టెంబర్ 15న ముగయనుంది. అనంతరం బ్లాక్ క్యాప్స్ బంగ్లాదేశ్‌కు వెళ్లనుంది. బంగ్లా టైగర్స్‌త్‌తో మూడు వన్డేలు ఆడనుంది.
చదవండి: Ind Vs Pak: పాకిస్తాన్‌తో మ్యాచ్.. తుది జట్టులో తిలక్ వర్మకు ఛాన్స్! ఇక అయ్యర్..
Comments
Please login to add a commentAdd a comment