దక్షిణాఫ్రికా బ్యాటర్ల విధ్వంసం.. న్యూజిలాండ్‌ టార్గెట్‌ 358 పరుగులు | ICC ODI World Cup 2023, New Zealand Vs South Africa Match Updates: South Africa Score 357/4 Against New Zealand - Sakshi
Sakshi News home page

World cup 2023: దక్షిణాఫ్రికా బ్యాటర్ల విధ్వంసం.. న్యూజిలాండ్‌ టార్గెట్‌ 358 పరుగులు

Published Wed, Nov 1 2023 6:00 PM | Last Updated on Wed, Nov 1 2023 6:20 PM

South Africa score 357-4 in 50 overs - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ప్రోటీస్‌ బ్యాటర్లలో క్వింటన్‌ డికాక్‌, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు.

డస్సెన్‌ 118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 133 పరుగులు చేయగా.. డికాక్‌ 116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులు సాధించాడు. వీరిద్దరితో పాటు డేవిడ్‌ మిల్లర్‌ 53 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు తీయగా.. నీషమ్‌, బౌల్ట్‌ ఒక్క వికెట్‌ పడగొట్టారు.
చదవండి: World cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌.. మ్యాక్స్‌వెల్‌కు ప్రమాదం! తలకు తీవ్ర గాయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement