IND Vs PAK: అఫ్రిది క‌ళ్లు చెదిరే యార్క‌ర్‌.. రోహిత్ శ‌ర్మ షాక్‌! వీడియో వైర‌ల్‌ | CT 2025 IND Vs PAK: Shaheen Afridi Produces A Stunning Inswinging Yorker To Castle Rohit Sharma, Video Goes Viral | Sakshi
Sakshi News home page

IND Vs PAK: అఫ్రిది క‌ళ్లు చెదిరే యార్క‌ర్‌.. రోహిత్ శ‌ర్మ షాక్‌! వీడియో వైర‌ల్‌

Published Sun, Feb 23 2025 8:36 PM | Last Updated on Mon, Feb 24 2025 1:25 PM

Shaheen Afridi produces a stunning inswinging yorker to castle Rohit Sharma

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రిది సంచ‌ల‌న బంతితో మెరిశాడు. అఫ్రిది ఇన్‌స్వింగ్ యార్కర్‌తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 242 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్‌కు రోహిత్ శ‌ర్మ ఘ‌న‌మైన ఆరంభించేందుకు ప్ర‌య‌త్నించాడు.

అందుకు త‌గ్గ‌ట్టుగానే భార‌త ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్‌లో సిక్స‌ర్, ఫోర్ బాది రోహిత్ మంచి టచ్‌లో క‌న్పించాడు. దీంతో కెపెన్‌​ నుంచి భారీ ఇన్నింగ్స్ రావ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ భావించారు. కానీ షాహీన్ అఫ్రిది మాత్రం అంద‌రి ఆశ‌ల‌పై నీళ్లు చల్లాడు. ఐదో ఓవ‌ర్ వేసిన అఫ్రిది ఆఖ‌రి బంతిని రోహిత్‌కు అద్బుత‌మైన ఇన్‌స్వింగింగ్ యార్కర్‌గా సంధించాడు.

అఫ్రిది వేసిన బంతికి రోహిత్ ద‌గ్గ‌ర స‌మాధానమే లేకుండా పోయింది. హిట్‌మ్యాన్ త‌న బ్యాట్‌ను కింద‌కు దించే లోపే బంతి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో రోహిత్ ఒక్క‌సారిగా షాక్ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. రోహిత్‌ 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 20 పరుగులు చేశాడు.

మూడేసిన కుల్దీప్‌.. 
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ బ్యాటర్లలో  సౌద్‌ షకీల్‌(62) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ రిజ్వాన్‌(46), ఖుష్దిల్‌ షా(38) మెరుగ్గా ఆడారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ మూడు, హార్దిక్‌ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ తీశారు.
చదవండి: IND vs PAK: రోహిత్‌ శర్మ వరల్డ్‌ రికార్డు..

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement