లండన్ : ఓవైపు భారత్, ఇంగ్లండ్ జాతీయ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్నా మరోవైపు ఇంగ్లండ్ దేశవాలీ ట్వంటీ20 లీగ్ క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచుతోంది. అయితే ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో లంకషైర్ లైట్‌నింగ్ టీమ్‌పై 7 వికెట్ల తేడాతో బర్మింగ్‌హామ్ బియర్స్ గెలుపొందింది. తద్వారా క్వార్టర్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. బర్మింగ్‌హామ్ బియర్స్ బౌలర్ జోస్ పోయెస్‌డెన్ వేసిన ఓ బంతి టోర్నమెంట్‌లో సూపర్ బాల్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 10వ ఓవర్ బౌలింగ్ చేసిన పోయెస్‌డెన్ ఆ ఓవర్ చివరి బంతికి తన లెగ్ స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. గింగిరాలు తిరుగుతూ వికెట్ల వైపు దూసుకెళ్లిన బంతిని లంకషైర్ బ్యాట్స్‌మన్ స్టీవెన్ క్రాఫ్ట్ అంచనా వేయలేకపోవడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతి ఎలా వికెట్లవైపుగా వెళ్లిందో అర్థంకాక క్రాఫ్ట్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో లంకషైర్ 10 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. 102 పరుగులకు లంకషైర్ ఆలౌట్ కాగా, ఛేదనలో బర్మింగ్‌హామ్ ఆటగాళ్లు ఇయాన్ బెల్(34), ఎడ్ పొలాక్(36)లు 68 పరుగుల కీలక భాగస్వామ్యంతో 7 వికెట్ల తేడాతో సులువుగా విజయం సాధించింది. విజేత బర్మింగ్‌హామ టీమ్ క్వార్టర్స్ ఆశలు సజీవంగా నిలుపుకోగా, ఈ మ్యాచ్‌లో ఓడిన లంకషైర్ ఇదివరకే క్వార్టర్స్ చేరుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment