Twenty20 tournament
-
6కే ఆలౌట్... ఇదీ క్రికెట్టే!
కిగలి సిటీ: ఓ వైపు పురుషుల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ 17 సిక్సర్లతో కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేస్తే... మరోవైపు మహిళల అంతర్జాతీయ టి20లో 6 పరుగులకే ఆలౌటైన చెత్త రికార్డు మంగళవారం నమోదైంది. క్విబుక మహిళల టి20 టోర్నీలో మాలి జట్టు ఈ కొత్త చెత్త రికార్డును తమ పేర లిఖించుకుంది. రువాండతో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన మాలి మహిళల జట్టు 9 ఓవర్లలో 6 పరుగులు చేసి ఆలౌటైంది. మరో ఆసక్తికర విషయమేంటంటే ఓపెనర్ సమకె (1) చేసిన పరుగే టాప్ స్కోర్! ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పది మంది ‘జీరో’లే! ఒక్కరు మినహా అందరు 6, 7 బంతులాడి ఖాతా తెరవకుండానే ఔటైతే... కౌలిబెలీ మాత్రం అత్యధికంగా 12 బంతులాడి డకౌటైంది. ఇక మిగతా 5 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. 2 బైస్, మరో 2 లెగ్‌బైస్, ఒకటేమో వైడ్... ఇది మాలి ఇన్నింగ్స్ కథకమామిషు! ఈ చెత్త రికార్డును ఛేదించేందుకు బరిలోకి దిగిన రువాండ జట్టు 4 బంతులాడి 8 పరుగులు చేసి గెలిచింది. ఇదే ఏడాది జనవరిలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో చైనా నెలకొల్పిన చెత్త రికార్డు (14 ఆలౌట్)ను మాలి సవరించింది. -
బ్యాట్స్‌మన్ మైండ్ బ్లాక్ అయ్యింది.. వైరల్
లండన్ : ఓవైపు భారత్, ఇంగ్లండ్ జాతీయ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్నా మరోవైపు ఇంగ్లండ్ దేశవాలీ ట్వంటీ20 లీగ్ క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచుతోంది. అయితే ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో లంకషైర్ లైట్నింగ్ టీమ్‌పై 7 వికెట్ల తేడాతో బర్మింగ్‌హామ్ బియర్స్ గెలుపొందింది. తద్వారా క్వార్టర్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. బర్మింగ్‌హామ్ బియర్స్ బౌలర్ జోస్ పోయెస్‌డెన్ వేసిన ఓ బంతి టోర్నమెంట్లో సూపర్ బాల్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 10వ ఓవర్ బౌలింగ్ చేసిన పోయెస్‌డెన్ ఆ ఓవర్ చివరి బంతికి తన లెగ్ స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. గింగిరాలు తిరుగుతూ వికెట్ల వైపు దూసుకెళ్లిన బంతిని లంకషైర్ బ్యాట్స్‌మన్ స్టీవెన్ క్రాఫ్ట్ అంచనా వేయలేకపోవడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతి ఎలా వికెట్లవైపుగా వెళ్లిందో అర్థంకాక క్రాఫ్ట్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో లంకషైర్ 10 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. 102 పరుగులకు లంకషైర్ ఆలౌట్ కాగా, ఛేదనలో బర్మింగ్‌హామ్ ఆటగాళ్లు ఇయాన్ బెల్(34), ఎడ్ పొలాక్(36)లు 68 పరుగుల కీలక భాగస్వామ్యంతో 7 వికెట్ల తేడాతో సులువుగా విజయం సాధించింది. విజేత బర్మింగ్హామ టీమ్ క్వార్టర్స్ ఆశలు సజీవంగా నిలుపుకోగా, ఈ మ్యాచ్‌లో ఓడిన లంకషైర్ ఇదివరకే క్వార్టర్స్ చేరుకున్న విషయం తెలిసిందే. -
బ్యాట్స్‌మెన్ మైండ్ బ్లాక్ అయ్యింది..
-
సచిన్‌కు సిడ్నీ థండర్ ఆఫర్
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ తర్వాత కూడా భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పొట్టి ఫార్మాట్లో విశేష ఆదరణ పొందిన బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో ఆడాలని మాస్టర్ బ్లాస్టర్‌కు ఆఫర్ వచ్చింది. ఈ ఏడాది జరగనున్న టోర్నమెంట్లో తమ జట్టు తరపున ఆడాలని సచిన్‌ను సిడ్నీ థండర్ టీమ్ సంప్రదించింది. అయితే ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని, చర్చలు కొనసాగుతున్నాయని 'సిడ్నీ మార్నింగ్' తెలిపింది. సచిన్‌కు సిడ్నీ థండర్ భారీ మొత్తం ఆఫర్ చేసిందని వెల్లడించింది. వరుస వైఫల్యాలతో డీలాపడిన థండర్ టీమ్.. మాస్టర్ లాంటి సీనియర్ ఆటగాళ్లను చేర్చుకోవడం ద్వారా పూర్వవైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని భావిస్తోంది. అన్ని ఫార్మాట్ల నుంచి గత ఏడాది నవంబర్‌లో సచిన్ టెండూల్కర్ వైదొలగిన సంగతి తెలిసిందే.