సచిన్కు సిడ్నీ థండర్ ఆఫర్ | Sachin Tendulkar considered playing for Sydney Thunder in BBL: report | Sakshi
Sakshi News home page

సచిన్కు సిడ్నీ థండర్ ఆఫర్

Published Wed, Jan 15 2014 8:49 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

సచిన్కు సిడ్నీ థండర్ ఆఫర్

సచిన్కు సిడ్నీ థండర్ ఆఫర్

న్యూఢిల్లీ: రిటైర్మెంట్ తర్వాత కూడా భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పొట్టి ఫార్మాట్లో విశేష ఆదరణ పొందిన బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో ఆడాలని మాస్టర్ బ్లాస్టర్కు ఆఫర్ వచ్చింది. ఈ ఏడాది జరగనున్న టోర్నమెంట్లో తమ జట్టు తరపున ఆడాలని సచిన్ను సిడ్నీ థండర్ టీమ్ సంప్రదించింది. అయితే ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని, చర్చలు కొనసాగుతున్నాయని 'సిడ్నీ మార్నింగ్' తెలిపింది. సచిన్కు సిడ్నీ థండర్ భారీ మొత్తం ఆఫర్ చేసిందని వెల్లడించింది.

వరుస వైఫల్యాలతో డీలాపడిన థండర్ టీమ్.. మాస్టర్ లాంటి సీనియర్ ఆటగాళ్లను చేర్చుకోవడం ద్వారా పూర్వవైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని భావిస్తోంది. అన్ని ఫార్మాట్ల నుంచి గత ఏడాది నవంబర్లో సచిన్ టెండూల్కర్ వైదొలగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement