Sydney Thunder Team
-
Big Bash League: సిడ్నీ థండర్ 15 ఆలౌట్!
సిడ్నీ: 0 0 3 0 2 1 1 0 0 4 1... ఇవీ ఒక టి20 మ్యాచ్‌లో వరుసగా 11 మంది ఆటగాళ్ల స్కోర్లు! ప్రతిష్టాత్మక బిగ్‌బాష్ లీగ్...ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న టి20 టోర్నీ...ఇప్పటికే ఒక సారి చాంపియన్‌గా నిలిచిన సిడ్నీ థండర్ జట్టు... కానీ అత్యంత చెత్త ప్రదర్శనతో ఆ జట్టు టి20 చరిత్రలో తలదించుకునే రికార్డు నమోదు చేసింది. శుక్రవారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్ 5.5 ఓవర్లలో 15 పరుగులకే కుప్పకూలింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోగా, ఎక్స్‌ట్రాల రూపంలో 3 పరుగులు వచ్చా యి. టి20 ఫార్మాట్లో విధ్వంసక ఆటగాళ్ల జాబి తాలో నిలిచే అలెక్స్ హేల్స్, రిలీ రోసో సిడ్నీ జట్టు లో ఉన్నారు. కనీసం ఒక్క ఆటగాడు కూడా పరిస్థితిని బట్టి నిలబడేందుకు గానీ, కౌంటర్ అటాక్‌తో పరుగులు రాబట్టేందుకు గానీ ప్రయత్నించలేదు. దాంతో 35 బంతుల్లోనే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. పదో నంబర్ బ్యాటర్ డాగెట్ బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకొని ఒకే ఒక ఫోర్ రాగా... స్టేడియంలో ప్రేక్షకులంతా నిలబడి వ్యంగ్యంగా ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇవ్వ డం పరిస్థితిని చూపిస్తోంది! 17 బంతుల్లో 3 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన అడిలైడ్ పేసర్ హెన్రీ థార్టన్ సిడ్నీ పతనంలో కీలక పాత్ర పోషించాడు. వెస్ అగర్ 12 బంతుల్లో 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అంతకు ముందు 139 పరుగులు చేసిన స్ట్రైకర్స్ 124 పరుగులతో మ్యాచ్ గెలుచుకుంది. 15: టి20 క్రికెట్లో ఇదే అత్యల్ప స్కోరు. 2019లో కాంటినెంటల్ కప్‌లో భాగంగా చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకే ఆలౌటైన రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. అతి తక్కువ బంతులు (35) సాగిన ఇన్నింగ్స్ కూడా ఇదే. -
రెండు వైపులా రనౌటయ్యాడు..
సిడ్నీ: బిగ్‌బాష్ లీగ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుంది. సిడ్నీ థండర్స్, అడిలైడ్ స్ట్రీకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అడిలైడ్ ఓపెనర్ జేక్ వెథరాల్డ్ రెండు ఎండ్స్లోనూ రనౌటైన సన్నివేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో థండర్స్ బౌలర్ క్రిస్ గ్రీన్ బౌలింగ్ చేస్తున్న సందర్భంలో బ్యాట్స్‌మెన్ ఫిలిప్ సాల్ట్ కొట్టిన బంతి గ్రీన్ ఎడమ చేతిని తాకుతూ వికెట్లను ముద్దాడింది. ఈ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో జేక్ వెథరాల్డ్ క్రీజ్ బయట ఉన్నాడు. దీన్ని అంతగా పట్టించుకోని వెథరాల్డ్.. సాల్ట్ పరుగు కోసం పిలుపునివ్వడంతో స్ట్రైకింగ్ ఎండ్ వైపు పరిగెట్టాడు. వెథరాల్డ్ క్రీజ్‌కు చేరుకునే లోపే వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ వికెట్లకు గిరాటు వేశాడు. ప్రత్యర్ధి ఆటగాళ్లు అపీల్ చేయడంతో థర్డ్ అంపైర్ రనౌట్‌ను పరిశీలిస్తుండగా వెథరాల్డ్ రెండు వైపులా రనౌటైనట్లు తేలింది. ఒకే బ్యాట్స్‌మెన్ రెండు ఎండ్స్లోనూ రనౌటైన ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
సచిన్‌కు సిడ్నీ థండర్ ఆఫర్
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ తర్వాత కూడా భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పొట్టి ఫార్మాట్లో విశేష ఆదరణ పొందిన బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో ఆడాలని మాస్టర్ బ్లాస్టర్‌కు ఆఫర్ వచ్చింది. ఈ ఏడాది జరగనున్న టోర్నమెంట్లో తమ జట్టు తరపున ఆడాలని సచిన్‌ను సిడ్నీ థండర్ టీమ్ సంప్రదించింది. అయితే ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని, చర్చలు కొనసాగుతున్నాయని 'సిడ్నీ మార్నింగ్' తెలిపింది. సచిన్‌కు సిడ్నీ థండర్ భారీ మొత్తం ఆఫర్ చేసిందని వెల్లడించింది. వరుస వైఫల్యాలతో డీలాపడిన థండర్ టీమ్.. మాస్టర్ లాంటి సీనియర్ ఆటగాళ్లను చేర్చుకోవడం ద్వారా పూర్వవైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని భావిస్తోంది. అన్ని ఫార్మాట్ల నుంచి గత ఏడాది నవంబర్‌లో సచిన్ టెండూల్కర్ వైదొలగిన సంగతి తెలిసిందే.