
సిడ్నీ: బిగ్‌బాష్ లీగ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుంది. సిడ్నీ థండర్స్, అడిలైడ్ స్ట్రీకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అడిలైడ్ ఓపెనర్ జేక్ వెథరాల్డ్ రెండు ఎండ్స్‌లోనూ రనౌటైన సన్నివేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో థండర్స్ బౌలర్ క్రిస్ గ్రీన్ బౌలింగ్ చేస్తున్న సందర్భంలో బ్యాట్స్‌మెన్ ఫిలిప్ సాల్ట్ కొట్టిన బంతి గ్రీన్ ఎడమ చేతిని తాకుతూ వికెట్లను ముద్దాడింది. ఈ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో జేక్ వెథరాల్డ్ క్రీజ్ బయట ఉన్నాడు.
దీన్ని అంతగా పట్టించుకోని వెథరాల్డ్.. సాల్ట్ పరుగు కోసం పిలుపునివ్వడంతో స్ట్రైకింగ్ ఎండ్ వైపు పరిగెట్టాడు. వెథరాల్డ్ క్రీజ్‌కు చేరుకునే లోపే వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ వికెట్లకు గిరాటు వేశాడు. ప్రత్యర్ధి ఆటగాళ్లు అపీల్ చేయడంతో థర్డ్ అంపైర్ రనౌట్‌ను పరిశీలిస్తుండగా వెథరాల్డ్ రెండు వైపులా రనౌటైనట్లు తేలింది. ఒకే బ్యాట్స్‌మెన్ రెండు ఎండ్స్‌లోనూ రనౌటైన ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment