Twenty20
-
IND Vs AFG Highlights Pics: అఫ్గానిస్తాన్‌పై 3–0తో సిరీస్ సొంతం (ఫొటోలు)
-
IND vs AFG, 1st T20I : అఫ్గానిస్తాన్ తొలి టి20లో భారత్ విజయం (ఫొటోలు)
-
Ind vs Aus, 5th T20: ఆస్ట్రేలియాపై భారత్ విజయం టీ20 సిరీస్ కైవసం (ఫొటోలు)
-
ఆస్ట్రేలియాపై భారత్ విజయం.. టీ20 సిరీస్ కైవసం (ఫొటోలు)
-
శ్రీలంక విజయం.. ఆసియాకప్ నుంచి టీమిండియా ఔట్ (ఫొటోలు)
-
తొలి టి20లో భారత్ జయభేరి
-
టి20 చరిత్రలో రికార్డు స్కోరు
-
టి20 చరిత్రలో రికార్డు స్కోరు
డెహ్రాడూన్: అఫ్గానిస్తాన్ ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ (62 బంతుల్లో 162 నాటౌట్; 11 ఫోర్లు, 16 సిక్స్‌లు) ఐర్లాండ్ బౌలర్లను కసిదీరా బాదాడు. ఆకాశమే హద్దుగా విరుచుకుపడిన వేళ... ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన రెండో టి20లో అఫ్గానిస్తాన్ టి20 చరిత్రలోనే రికార్డు స్కోరు చేసింది. హజ్రతుల్లా వీర విజృంభణకు తోడు ఉస్మాన్ ఘని (48 బంతుల్లో 73; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో అఫ్గానిస్తాన్ మూడు వికెట్లకు 278 పరుగులు సాధించింది. అద్భుతం జరిగితే తప్ప ఛేదించలేనంత లక్ష్యంతో బరిలో దిగిన ఐర్లాండ్... ఓపెనర్, కెప్టెన్ స్టిర్లింగ్ (50 బంతుల్లో 91; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాటంతో ఆరు వికెట్లకు 194 పరుగులు చేసి 84 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 10వ ఓవర్ వరకు 109/0తో బాగానే సాగిన ఐర్లాండ్ ఇన్నింగ్స్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ (4/25) రంగప్రవేశంతో చెదిరిపోయింది. ►278 - టి20ల్లో అత్యధిక జట్టు స్కోరు ఇది. 2016లో శ్రీలంకపై ఆస్ట్రేలియా (263/3) నెలకొల్పిన రికార్డు తెరమరుగైంది. ►236 - ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో హజ్రతుల్లా, ఘని తొలి వికెట్‌కు జోడించిన పరుగులు. టి20ల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. ► 16 - ఈ మ్యాచ్‌లో హజ్రతుల్లా కొట్టిన సిక్స్‌లు. వ్యక్తిగత టి20 ఇన్నింగ్స్‌లో ఇవే అత్యధికం. ►42 - సెంచరీకి హజ్రతుల్లా ఆడిన బంతులు. అంతర్జాతీయ టి20ల్లో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. -
టి20 సిరీస్ భారత్ సొంతం
-
బ్యాట్స్‌మన్ మైండ్ బ్లాక్ అయ్యింది.. వైరల్
లండన్ : ఓవైపు భారత్, ఇంగ్లండ్ జాతీయ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్నా మరోవైపు ఇంగ్లండ్ దేశవాలీ ట్వంటీ20 లీగ్ క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచుతోంది. అయితే ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో లంకషైర్ లైట్నింగ్ టీమ్‌పై 7 వికెట్ల తేడాతో బర్మింగ్‌హామ్ బియర్స్ గెలుపొందింది. తద్వారా క్వార్టర్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. బర్మింగ్‌హామ్ బియర్స్ బౌలర్ జోస్ పోయెస్‌డెన్ వేసిన ఓ బంతి టోర్నమెంట్లో సూపర్ బాల్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 10వ ఓవర్ బౌలింగ్ చేసిన పోయెస్‌డెన్ ఆ ఓవర్ చివరి బంతికి తన లెగ్ స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. గింగిరాలు తిరుగుతూ వికెట్ల వైపు దూసుకెళ్లిన బంతిని లంకషైర్ బ్యాట్స్‌మన్ స్టీవెన్ క్రాఫ్ట్ అంచనా వేయలేకపోవడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతి ఎలా వికెట్లవైపుగా వెళ్లిందో అర్థంకాక క్రాఫ్ట్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో లంకషైర్ 10 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. 102 పరుగులకు లంకషైర్ ఆలౌట్ కాగా, ఛేదనలో బర్మింగ్‌హామ్ ఆటగాళ్లు ఇయాన్ బెల్(34), ఎడ్ పొలాక్(36)లు 68 పరుగుల కీలక భాగస్వామ్యంతో 7 వికెట్ల తేడాతో సులువుగా విజయం సాధించింది. విజేత బర్మింగ్హామ టీమ్ క్వార్టర్స్ ఆశలు సజీవంగా నిలుపుకోగా, ఈ మ్యాచ్‌లో ఓడిన లంకషైర్ ఇదివరకే క్వార్టర్స్ చేరుకున్న విషయం తెలిసిందే. -
బ్యాట్స్‌మెన్ మైండ్ బ్లాక్ అయ్యింది..
-
మూడో క్రికెటర్‌గా కోహ్లి..
డబ్లిన్: ఐర్లాండ్‌తో డబ్లిన్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనతను అందుకున్నాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన విరాట్ కోహ్లి (9: 8 బంతుల్లో 1 ఫోర్) దూకుడుగా ఆడే ప్రయత్నంలో జట్టు స్కోరు 22 వద్ద ఔటయ్యాడు. కానీ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో న్యూజిలాండ్ క్రికెటర్లు మార్టిన్ గప్తిల్ (2,271 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా, బ్రెండన్ మెక్‌కలమ్ (2,140) రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో కోహ్లి(1,992) నిలిచాడు. ఈ క్రమంలోనే షోయబ్ మాలిక్(1,989)ను కోహ్లి వెనక్కినెట్టాడు. కోహ్లి మరో 8 పరుగులు చేస్తే.. టీమిండియా తరపున రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు. కోహ్లి తర్వాత టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్స్ జాబితాలో రోహిత్ శర్మ (1,949), సురేశ్ రైనా (1,509), మహేంద్రసింగ్ ధోని (1,455) ఉన్నారు. -
ట్వంటీ 20 లో రికార్డ్ ఛేజింగ్
సాక్షి, స్పోర్ట్స్: ట్వంటీ20 చరిత్రలో రికార్డ్ ఛేజింగ్ ను ఆస్ట్రేలియా సాధ్యం చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన పరుగుల పోరులో ఆసీస్ జట్టునే విజయం వరించింది. కివీస్ విసిరిన 244 పరగుల లక్ష్యాన్ని మరో ఏడే బంతులుండగానే అలవోకగా ఛేదించి ఆసీస్ జట్టు చరిత్ర సృష్టించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేయగా న్యూజిలాండ్ ఓపెనర్ గప్టిల్ (54 బంతుల్లో 106, 6ఫోర్లు, 9 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. మరో ఓపెనర్ మున్రో (33 బంతుల్లో 76: 6ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో కివీస్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసి ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (24 బంతుల్లో 59: 4ఫోర్లు, 5 సిక్సర్లు), షార్ట్ (44 బంతుల్లో 76: 8ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం అందించారు. 121 పరుగుల వద్ద వార్నర్ ను కివీస్ బౌలర్ సోదీ బౌల్డ్ చేశాడు. ఆపై క్రిస్ లిన్ (18), మాక్స్వెల్ (14 బంతుల్లో 31: 3ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి షార్ట్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. చివర్లో అరోన్ ఫించ్ (14 బంతుల్లో 36: 3ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో 18.5 ఓవర్లలో మరో 7 బంతులుండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ట్వంటీ20 చరిత్రలో రికార్డు ఛేజింగ్ ఆసీస్ (245/5) పేరిట నమోదైంది. గతంలో ఈ ఛేజింగ్ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. దక్షిణాఫ్రికాపై 231 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో విండీస్ ఛేదించింది. కాగా నేడు కివీస్‌తో జరిగిన టీ20లో ఆసీస్ జట్టు 243 పరగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. 2015లో జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 231 పరుగుల టార్గెట్‌ను 6 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసి మరో నాలుగు బంతులు మిగిలుండగానే విండీస్ విజయం సాధించింది. -
టి20 సిరీస్ గెలుచుకున్న టీమిండియా
-
దానివల్లే చాహల్ రాటుదేలాడు!
మూడో టీ-20 మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టి.. భారత్‌కు అద్భుత విజయాన్ని అందించిన యజువేంద్ర చాహల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఒక దశలో 119/2తో బలంగా కనిపించినప్పటికీ చాహల్ స్పిన్ మాయాజాలంతో కేవలం ఎనిమిది పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. యువ బౌలర్లు చాహల్, జస్ప్రీత్ బుమ్రా పోటాపోటీగా వికెట్లు తీయడంతో ఆరుగురు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చాహల్ మాయాజాలంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. అతను ఐపీఎల్ ప్రాడక్ట్ అని పేర్కొన్నాడు. ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరఫున ఆడటం వల్ల చాహల్ రాటుదేలాడు అని పేర్కొన్నాడు. ’చాహల్ బెంగళూరు రాయల్ చాలెంజర్ బౌలర్ అన్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ వేదికపై ఆడటం అతనికి తెలుసు. టీ-20 క్రికెట్ ఐపీఎల్ ప్రాడక్ట్. అదేవిధంగా చాహల్ కూడా ఐపీఎల్ ప్రాడక్టే. ఐపీఎల్లో ఆడటం ద్వారా అతను ఎంతగానో మెరుగయ్యాడు. కచ్చితంగా ఏం చేయాలో అతనికి తెలుసు. అతను టెర్రిఫిక్‌గా ఆడాడు. భారత టీ-20లపై ఐపీఎల్ విస్తారమైన ప్రభావాన్ని చూపుతోంది. చాలామంది ఆటగాళ్లు దానినుంచే వచ్చి భారత్ తరఫున అద్భుతంగా ఆడుతున్నారు’ అని గంగూలీ గుర్తుచేశాడు. -
కలలోనూ అనుకోలేదు.. 6 వికెట్లపై చాహల్!
లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ జట్టును చుట్టుముట్టాడు. అనూహ్యరీతిలో అతను టపాటపా ఆరు వికెట్లు పడగొట్టడంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడు టీ-20 మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు 75 పరుగుల తేడాతో పరాజయం ముటగట్టుకుంది. దీంతో టీ-20 సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. నిజానికి 202 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 13వ ఓవర్ వరకు గమ్యం దిశగా సాగినట్టు కనిపించింది. 13వ ఓవర్లో 119/2 వికెట్లతో బలంగా కనిపించిన ఆ జట్టు ఆ తర్వాత కేవలం 8 పరుగులు జోడించి చివరి 8 వికెట్లు కోల్పోవడం గమనార్హం. అందుకు కారణం యువ స్పిన్నర్ చాహల్ మాయాజాలమే. అతను స్పిన్ బంతులను ఎదుర్కోలేక ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ చేతులెత్తేశారు. దీంతో ఆరు వికెట్లను కొల్లగొట్టిన చాహల్ తన కెరీర్లోనే తొలిసారి ఉత్తమ గణాంకాలను నమోదుచేశాడు. మూడ టీ-20లో స్టార్ ఆఫ్ ద నైట్‌గా నిలిచిన చాహల్.. ఆరు వికెట్లు పడగొడతానని తాను కలలో కూడా అనుకోలేదని చెప్పాడు. ’బెంగళూరులో తొలిసారి టీమిండియా తరఫున ఆడటం ఆనందం కలిగించింది. సొంతూరులో ఉండి ఆడినట్టు అనిపించింది. ఆరు వికెట్లు తీస్తానని కలలో కూడా అనుకోలేదు’ అని మ్యాచ్ అనంతరం చెప్పాడు. 25 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టిన చాహల్ భారత్ తరఫున టీ-20లో ఉత్తమ గణాంకాలు నమోదుచేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌లలో ఆరు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. -
9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్!
మంచెస్టర్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ముగించింది. ఓల్డ్ ట్రాఫర్డ్ లో బుధవారం రాత్రి జరిగిన ఏకైక టీ-20 మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టును తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. నూతన కెప్టెన్ సర్ఫ్ రాజ్ అహ్మద్ నాయకత్వంలో బరిలోకి దిగిన పాక్ జట్టు ఇటు బౌలింగ్ లోనూ, అటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 135 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో వాహెబ్ రియాజ్ అద్భుతంగా రాణించి 18 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టగా, స్పిన్నర్ ఇమద్ వసీం 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ లో అలెక్స్ హేల్స్ (37 పరుగులు), జాసన్ రాయ్ (21 పరుగులు) తప్ప పెద్దగా ఎవరూ రాణించలేదు. 136 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు ఆడుతూ పాడుతూ గమ్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు షర్జీల్ ఖాన్ (59 పరుగులు), ఖలీద్ లతీఫ్ (59 పరుగులు నాటౌట్) అద్భుతంగా ఆడి గొప్ప ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి మొదటి వికెట్ కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. దీంతో 31 బంతులు మిగిలి ఉండగానే ఒక వికెట్ కోల్పోయి.. పాక్ జట్టు 136 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. ఇలా పాకిస్తాన్ టీ 20 చరిత్రలో 9 వికెట్ల తేడాతో గెలవడం ఇదే తొలిసారి. పెద్దగా అంచనాలు లేకుండా ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ జట్టు టెస్టు సిరీస్ ను 2-2తో డ్రా చేసుకోగా.. వన్డే సిరీస్ ను మాత్రం 4-1 తేడాతో ఓడిపోయింది. -
అష్టరుచుల సమ్మేళనం
► రేపటి నుంచి ఐపీఎల్ పండగ ► నేడు ప్రారంభోత్సవ వేడుకలు ► మే 29న ఫైనల్ ట్వంటీ 20 క్రికెట్లో చేజారిందనుకున్న మ్యాచ్‌లో ఆఖరి క్షణాల్లో విజయం నడిచి వస్తే అది తీపి... అంతా బాగుందనిపించినా అర క్షణంలో చిన్న తప్పుతో మ్యాచ్ చేజారిపోతే అది చేదు... టి 20 అంటే ఎన్నో రుచులు... మ్యాచ్ సాగుతున్నప్పుడు కొన్ని సార్లు పుల్లగా, ఉప్పగా కూడా కనిపిస్తే... మరికొన్ని కీలక క్షణాల్లో, ఉత్కంఠపోరులో ఆట కారంగా, వగరుగా కూడా అనిపించేస్తుంది... ప్రతీ ఏటా వచ్చే పండగే అయినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మళ్లీ పాత జ్ఞాపకాలను తట్టి లేపుతుంది. కొత్త కొత్త ఆలోచనలతో కొత్తగా చూడమని కోరుతుంది. పూతకొచ్చిన కొత్త మామిడిలా... ఆహా అనిపించే ఆవకాయలా వినోదపు మజాను అందిస్తుంది. మన ఉగాదికి ఆరు రుచులు ఉంటే ఎనిమిది జట్లతో ఐపీఎల్ అష్ట రుచులను అందిస్తుంది. ఇక ఈ మండే ఎండల్లో మరోసారి వేసవి పండగకు సిద్ధం కావడమే. సాక్షి క్రీడా విభాగం:- ఉగాది అంటే కొత్త సంవత్సరం... పండగ సంబరం, పచ్చడి రుచి, ఆదాయ వ్యయాల గణనం, పంచాంగ శ్రవణం... ఇక ఐపీఎల్లో ఉగాది మాత్రం అంతా అంకెలు, పరుగులే... అక్కడా ఆదాయ, వ్యయాలు, లాభం, అవమానాలు... ఇలా చాలా ఉంటాయి. దాదాపు ఏడు వారాల పాటు ఎనిమిది జట్లు హోరాహోరీగా పోరాడే ఐపీఎల్లో టైటిల్ ఒక్కటే అందరి లక్ష్యం. ఆ కప్‌ను అందుకోవాలని ప్రతి కెప్టెన్ తహతహలాడుతుంటాడు. మరి కప్ ఏమనుకుంటుంది..? ఆయా జట్లకు ట్రోఫీయే పంచాంగం చెబితే ఎలా ఉంటుందంటే... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆదాయం: మిల్లర్, మ్యాక్స్‌వెల్ వ్యయం: జట్టులో సగంకంటే ఎక్కువ మందికి కనీస అనుభవం లేదు. భారత రెగ్యులర్ జట్టులోని ఆటగాడు లేడు. యజమాని: నెస్ వాడియా, ప్రీతీ జింటా, కరణ్ పాల్ ఉత్తమ ప్రదర్శన: 2014 రన్నరప్ కెప్టెన్: డేవిడ్ మిల్లర్ కోచ్ : సంజయ్ బంగర్ 2014లో అద్భుతంగా ఆడి ఫైనల్లోకి చేరిన మీ జట్టు తర్వాతి ఏడాదే చివరి స్థానానికి పడిపోవడం ఆశ్చర్యం కలిగించింది. అందుకే కావచ్చు దాదాపు మొత్తం టీమ్‌ను మార్చి పడేశారు. అయినా సరే స్టార్ పవర్ లేదు. మ్యాక్స్‌వెల్ ఎలా ఆడతాడో ఎప్పుడూ సందేహమే. ఏదైనా ఒకటి, రెండు అనూహ్య ఫలితాలు రావచ్చేమో గానీ మీపై పెద్దగా నమ్మకం లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదాయం: వార్నర్, ధావన్, విలియమ్సన్, నెహ్రా వ్యయం: యువరాజ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరం. కెప్టెన్: డేవిడ్ వార్నర్ కోచ్: టామ్ మూడీ యజమాని: కళానిధి మారన్ ఉత్తమ ప్రదర్శన: ప్లే ఆఫ్ (2013) లెఫ్ట్ హ్యండ్ ఆటగాళ్లతోనే మీ తుది జట్టును నింపేయవచ్చేమో అనిపిస్తుంది. ఈ సారి కూడా మంచి బౌలర్లను తీసుకున్నారు గానీ ఎప్పటిలాగే ఒకరిద్దరు తప్ప విధ్వంసకర బ్యాట్స్‌మెన్ లేరు. మంచి బౌలింగ్ చేయడం, బ్యాటింగ్‌లో విఫలమయ్యే సాంప్రదాయాన్ని ఆపేయండి. జట్టు ఎలా ఉన్నా మీరు గెలవాలని హైదరాబాదీలు బలంగా కోరుకుంటున్నారు. ముంబై ఇండియన్స్ ఆదాయం: రోహిత్ శర్మ, పొలార్డ్, బుమ్రా, సిమన్స్, భారీ కోచింగ్ బృందం వ్యయం: ప్రధాన పేసర్ మలింగకు గాయాలు, ఫామ్‌లో లేని హర్భజన్ సింగ్. కెప్టెన్: రోహిత్ శర్మ కోచ్: రికీ పాంటింగ్ యజమాని: ముకేశ్ అంబానీ ఉత్తమ ప్రదర్శన: 2013, 15లో విజేత డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్నారు. ప్రపంచకప్‌లో ఆకట్టుకోని రోహిత్ శర్మ ఇక్కడ చెలరేగాలి. అదే విధంగా ఎలాగూ భారత జట్టులోకి వచ్చేసామని అతి ధీమా ప్రదర్శించకుండా కుర్ర బుమ్రా, హార్దిక్ పాండ్యా మరింత మెరుగ్గా ఆడాలి. ప్రపంచకప్ సెమీస్‌లో భారత్‌పై ఆడిన తరహాలో ఆ సిమ్మన్స్‌ను సీజన్ అంతా ఆడమనండి. మరోసారి మీ యాజమాన్యాన్ని విజయంతో మెప్పిస్తే, ఇక మీకు ఏడాదంతా పండగే. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ కెప్టెన్: ఎంఎస్ ధోని కోచ్: స్టీఫెన్ ఫ్లెమింగ్ యజమాని: సంజీవ్ గోయెంకా ఉత్తమ ప్రదర్శన: ఇదే తొలి లీగ్ ఆదాయం: ధోని, స్మిత్, రహానే, అశ్విన్ వ్యయం: ఇటీవలి కాలంలో ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. టి20 స్పెషలిస్ట్ పేసర్ ఎవరూ లేరు. మీ జట్టును చూస్తే అంతా కెప్టెన్ ధోనియే అనిపిస్తోంది. కొత్తగా చేరిన ఆటగాళ్లు ఉన్నా సమర్థంగా నడిపించగల అతని నాయకత్వమే గెలిపించగలదు. పీటర్సన్లాంటి ఆటగాడిని జట్టుకు పనికొచ్చేలా చేసుకోవాలి. అన్నట్లు మిషెల్ మార్ష్‌ను తీసుకొని మంచి పని చేశారు. వరల్డ్ కప్ గురించి మరచిపోయి అశ్విన్ బాగా ఆడితే మంచిది. చూస్తే చెన్నై బృందమే కనిపిస్తోంది కాబట్టి ఆ జట్టులాగా ముందుకు వెళ్లగలరని నమ్మకముంది. గుజరాత్ లయన్స్ కెప్టెన్: సురేశ్ రైనా కోచ్: బ్రాడ్ హాడ్జ్ యజమాని: కేశవ్ బన్సాల్ (ఇంటెక్స్ టెక్నాలజీస్) ఉత్తమ ప్రదర్శన: ఇదే తొలి లీగ్ ఆదాయం: బ్రేవో, మెకల్లమ్, జడేజా. వ్యయం: రైనాకు కెప్టెన్‌గా చెప్పుకోదగ్గ అనుభవం లేదు. ఐపీఎల్ వేలం ముగియగానే మీ ఒక్క జట్టే అన్నీ సరిపోయే విధంగా కొలతలు వేసినట్లు సరిగ్గా ఆటగాళ్లను ఎంచుకుంది అనే మాట వినిపించింది. ఇప్పుడు మైదానంలో చూపించాల్సిన బాధ్యత మీపై ఉంది. మీ యజమానిని చూస్తే మీలో చాలా మందికంటే కుర్రాడిగా, ఉత్సాహంగా ఉన్నాడు. బాగా ఆడి అతని ఆశలు నిలబెట్టండి. ఐపీఎల్లో ఇప్పటి వరకు మాకు జట్టు లేదని బాధపడిన గుజరాతీలు మీ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. సమష్టిగా ఆడితే ప్లే ఆఫ్ ఖాయమని మా పంచాంగం చెబుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్: విరాట్ కోహ్లి కోచ్: వెటోరి యజమాని: విజయ్ మాల్యా ఉత్తమ ప్రదర్శన: 2009, 11ల్లో రన్నరప్ ఆదాయం: కోహ్లి, గేల్, డివిలియర్స్, వాట్సన్ వ్యయం: గాయంతో స్టార్క్ దూరం. స్టార్లను మినహాయిస్తే మిగతా ఆటగాళ్లు అంతంత మాత్రమే. ఐపీఎల్ మొదలైన దగ్గరినుంచి అందరికంటే ఎక్కువగా హడావిడి చేసే జట్టు మీదే అయినా... ఇప్పటి వరకు విజయానందం మాత్రం దరి చేరలేదు. ఉన్న ముగ్గురు భారీ హిట్టర్లకు తోడు ఇప్పుడు వాట్సన్ కూడా వచ్చాడు. మరి అతడిని సరైన రీతిలో మీరు వాడుకోవాలి. అన్నట్లు మీ యజమాని మాల్యా ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నారు. తొమ్మిదో ప్రయత్నంలోనైనా టైటిల్ సాధిస్తే ఆయనకు ఆనందం కలిగించినవారవుతారు. కోహ్లి ఇప్పుడున్న ఫామ్‌లో జట్టును గెలిపిస్తాడని అనిపిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్: గౌతం గంభీర్ కోచ్: ట్రెవర్ బేలిస్ యజమాని: షారుక్ ఖాన్, జూహీచావ్లా ఉత్తమ ప్రదర్శన: 2012, 14 విజేత ఆదాయం: మనీశ్ పాండే, రసెల్, షకీబ్, మున్రో వ్యయం: చెప్పుకోదగ్గ భారత ఆటగాళ్లు లేరు. దేశవాళీ కుర్రాళ్లనుంచి పెద్దగా ఆశించలేం. రెండేళ్ల క్రితం గెలిపించారు కాబట్టి అదే ఆటగాళ్లను కొనసాగిస్తున్నారు. ఖర్చు తగ్గించుకునే ప్రయత్నంలో అతి జాగ్రత్తకు పోయినట్లు కనిపిస్తున్నారు. గంభీర్ ఏడాది మొత్తం ఆడకుండా ఐపీఎల్లో ఏం చేస్తాడో చూడాలి. రసెల్‌ను తప్పిస్తే ఒంటి చేత్తో గెలిపించగల విదేశీ ఆటగాళ్లు లేరు. ఎప్పుడో కళ తప్పిన యూసుఫ్ పఠాన్, ఉతప్పలతో మీ జట్టు ఏం సాధిస్తుందనేది సందేహమే. ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్: జహీర్ ఖాన్ కోచ్: ప్యాడీ ఆప్టన్ యజమాని: జీఎంఆర్ స్పోర్ట్స్ ప్రై.లిమిటెడ్ ఉత్తమ ప్రదర్శన: ప్లే ఆఫ్ (2012), సెమీస్ (2008, 09) ఆదాయం: బ్రాత్‌వైట్, షమీ, అయ్యర్, మోరిస్, తాహిర్ వ్యయం: చాలా కాలంగా క్రికెట్ మానేసి కామెంటరీ చేస్తున్న జహీర్‌ఖాన్‌ను కెప్టెన్‌ను చేయడం ఆశ్చర్యకరం. ఫిట్‌గా లేకపోతే 10 మందితో ఆడినట్లే. గత మూడేళ్లుగా చివరి స్థానాల్లో నిలుస్తున్న మీ ఆటను చూసి ఇక ఇంతే అనుకున్నాం. కానీ ఎందుకో కుర్రాళ్లతో కూడిన, సరిగ్గా టి20 ఫార్మాట్‌కు సరిపోయే ఆటగాళ్లను చూస్తే ఈ సారి మీ జట్టుగా చాలా బాగా ఆడవచ్చని నమ్మకం కుదురుతోంది. ఇక ద్రవిడ్ మార్గనిర్దేశనం ఎలాగూ ఉంది కాబట్టి దానిని వాడుకుంటే డేర్ డెవిల్స్ పేరుకు తగినట్లుగా కాస్త దూకుడు చూపించవచ్చు. -
అఫ్రిదీ 'ప్రేమ' వ్యాఖ్యలతో చిక్కులు!
లాహోర్: పాకిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ చిక్కుల్లో పడ్డాడు. పాకిస్థాన్‌లో కన్నా భారత్‌లోనే తమకు ఎక్కువ ప్రేమాభిమానాలు లభిస్తున్నాయన్న ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. ఓ న్యాయవాది అఫ్రిదీకి లీగల్ నోటీసులు పంపాడు. లాహోర్‌కు చెందిన ఓ న్యాయవాది ఈ నోటీసులు జారీచేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు కోల్‌కతాలో అగుడుపెట్టిన సందర్భంగా అఫ్రిదీ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ' భారత్‌లో ఆడటాన్ని మేం ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉన్నాం. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను చూపారు. కొన్ని దేశాల్లో మాత్రమే నేను క్రికెట్ బాగా ఎంజాయ్ చేశాను. అందులో భారత్ ఒకటి. ఇక్కడ మాకు ఎంతో ప్రేమ లభించింది. ఇంతటి ప్రేమ, మాకు పాకిస్థాన్‌లో కూడా లభించలేదని నేను చెప్పగలను' అంటూ వ్యాఖ్యానించాడు. అఫ్రిదీ వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పాక్ లాయర్ లీగల్ నోటీసులు పంపారు. మరోవైపు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ కూడా అఫ్రిది వ్యాఖ్యలపై స్పందించారు. అఫ్రిది మాటలు నన్ను షాక్‌కు గురి చేశాయి.. ఇలాంటి సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.