అఫ్గానిస్తాన్ ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ (62 బంతుల్లో 162 నాటౌట్; 11 ఫోర్లు, 16 సిక్స్‌లు) ఐర్లాండ్ బౌలర్లను కసిదీరా బాదాడు. ఆకాశమే హద్దుగా విరుచుకుపడిన వేళ... ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన రెండో టి20లో అఫ్గానిస్తాన్ టి20 చరిత్రలోనే రికార్డు స్కోరు చేసింది. హజ్రతుల్లా వీర విజృంభణకు తోడు ఉస్మాన్ ఘని (48 బంతుల్లో 73; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో అఫ్గానిస్తాన్ మూడు వికెట్లకు 278 పరుగులు సాధించింది.