కలలోనూ అనుకోలేదు.. 6 వికెట్లపై చాహల్‌! | Chahal says, Never dreamt of taking a six wickets | Sakshi
Sakshi News home page

కలలోనూ అనుకోలేదు.. 6 వికెట్లపై చాహల్‌!

Published Thu, Feb 2 2017 9:06 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM

కలలోనూ అనుకోలేదు.. 6 వికెట్లపై చాహల్‌!

కలలోనూ అనుకోలేదు.. 6 వికెట్లపై చాహల్‌!

లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ తన స్పిన్‌  మాయాజాలంతో ఇంగ్లండ్‌ జట్టును చుట్టుముట్టాడు. అనూహ్యరీతిలో అతను టపాటపా ఆరు వికెట్లు పడగొట్టడంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడు టీ-20 మ్యాచ్‌లో ఇంగ్లిష్‌ జట్టు 75 పరుగుల తేడాతో పరాజయం ముటగట్టుకుంది. దీంతో టీ-20 సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకుంది.

నిజానికి 202 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు 13వ ఓవర్‌ వరకు గమ్యం దిశగా సాగినట్టు కనిపించింది. 13వ ఓవర్‌లో 119/2 వికెట్లతో బలంగా కనిపించిన ఆ జట్టు ఆ తర్వాత కేవలం 8 పరుగులు జోడించి చివరి 8 వికెట్లు కోల్పోవడం గమనార్హం. అందుకు కారణం యువ స్పిన్నర్‌ చాహల్‌ మాయాజాలమే. అతను స్పిన్‌ బంతులను ఎదుర్కోలేక ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్ చేతులెత్తేశారు. దీంతో ఆరు వికెట్లను కొల్లగొట్టిన చాహల్‌ తన కెరీర్‌లోనే తొలిసారి ఉత్తమ గణాంకాలను నమోదుచేశాడు. మూడ టీ-20లో స్టార్‌ ఆఫ్‌ ద నైట్‌గా నిలిచిన చాహల్‌.. ఆరు వికెట్లు పడగొడతానని తాను కలలో కూడా అనుకోలేదని చెప్పాడు.

’బెంగళూరులో తొలిసారి టీమిండియా తరఫున ఆడటం ఆనందం కలిగించింది. సొంతూరులో ఉండి ఆడినట్టు అనిపించింది. ఆరు వికెట్లు తీస్తానని కలలో కూడా అనుకోలేదు’ అని మ్యాచ్‌ అనంతరం చెప్పాడు. 25 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టిన చాహల్‌ భారత్‌ తరఫున టీ-20లో ఉత్తమ గణాంకాలు నమోదుచేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌లలో ఆరు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement