ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా గురువారం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే యాషెస్ సిరీస్‌కు ముందు బజ్‌బాల్ ఆటతో ఆసీస్‌కు ముకుతాడు వేస్తామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రగల్బాలు పలికాడు. తీరా అసలు ఆట మొదలయ్యాకా సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్ వేదికగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఇప్పటికే 0-2తో వెనుకబడిన ఆ జట్టు కనీసం మూడో టెస్టులోనైనా గెలిచి సిరీస్‌ను కాపాడుకోవాలని చూస్తోంది.
తాజాగా మూడో టెస్టు మొదలైన నేపథ్యంలో ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఇంగ్లండ్ జట్టుకు పరోక్షంగా చురకలు అంటించాడు.'' ఇంగ్లండ్ ఆడుతుంది బజ్‌బాల్ కాదని.. అది కజ్‌బాల్ అని దుయ్యబట్టాడు. బీబీసీ కాలమ్‌కు రాసిన మెక్‌గ్రాత్ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. ముందు జానీ బెయిర్ స్టో ఔట్ వివాదంతో మొదలుపెడతా. ఇక్కడ రెండు అంశాలు నా మదిలోకి వచ్చాయి. మొదట చూసినప్పుడు పాట్ కమిన్స్ అప్పీల్‌ను విత్‌డ్రా చేసుకుంటే బాగుంటుందనిపించింది. కానీ నిశితంగా పరిశీలించాకా ఆసీస్ కెప్టెన్ నిర్ణయం సరైందే అనిపించింది.
ఇంగ్లండ్ ప్రవర్తించిన తీరు హాస్యాస్పదం అనిపించింది. ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆటకు నేను అభిమానిని. ప్రత్యర్థి జట్లకు ఏ మాత్రం భయపడకుండా వారిపైనే ఒత్తిడి తెచ్చేలా ఇన్నింగ్స్‌ను ఆడడం అనే బజ్‌బాల్ కాన్సెప్ట్‌ను స్వాగతిస్తున్నా. కానీ బెయిర్ స్టో ఔట్ వివాదం కారణంగా ఇంగ్లండ్ బజ్‌బాల్ కాస్త నాకు కజ్‌బాల్(Casual Bowling)లా కనిపించింది.'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక లార్డ్స్ టెస్టులో బెయిర్ స్టో ఔట్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. బంతి డెడ్ కాకముందే బెయిర్ స్టో క్రీజును విడవడంతో అలెక్స్ కేరీ బంతిని వికెట్లకు గిరాటేశాడు. రూల్ ప్రకారం థర్డ్ అంపైర్ బెయిర్ స్టో ఔట్ అని ప్రకటించాడు. ఇక్కడ రాజుకున్న మంట టెస్టు ముగిసినా చల్లారలేదు. ఆసీస్ జట్టు చీటింగ్ చేసి గెలిచిదంటూ ఇంగ్లండ్ అభిమానులు సహా స్థానిక మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఆస్ట్రేలియా మీడియా కూడా ధీటుగానే బదులిచ్చింది. ఇక బెయిర్ స్టో వివాదం ఇరుదేశాల ప్రధానులు మాట మాట అనుకునే వరకు వెళ్లడం ఆసక్తి కలిగించింది.
Glenn Mcgrath said "Bairstow's dismissal epitomizes what we have seen from England in this series, it has been Casual ball - CazBall if you will, not Bazball". [BBC] pic.twitter.com/bKAdHQbgJ1
— Johns. (@CricCrazyJohns) July 5, 2023
చదవండి: Ashes 2023: మూడో టెస్టు.. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బజ్‌బాల్‌ను పక్కనబెడుతుందా?
Comments
Please login to add a commentAdd a comment