మూడో రోజు 13 వికెట్లు | England 227 Allout ¤ Aussies 53/4 | Sakshi
Sakshi News home page

మూడో రోజు 13 వికెట్లు

Published Tue, Dec 5 2017 12:49 AM | Last Updated on Tue, Dec 5 2017 2:42 AM

England 227 Allout ¤ Aussies 53/4 - Sakshi

అడిలైడ్‌: యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో బౌలర్లు చెలరేగారు. దాంతో మూడో రోజు 13 వికెట్లు పడ్డాయి. మొదట ఇంగ్లండ్‌పై స్పిన్నర్‌ లయన్‌ (4/60) మాయాజాలాన్ని ప్రదర్శించగా... పేసర్లు స్టార్క్‌ (3/49), కమిన్స్‌ (2/47) దెబ్బతీశారు. తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను అండర్సన్‌ (2/16), వోక్స్‌ (2/13) వణికించారు. 29/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం మూడో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 76.1 ఓవర్లలో 227 పరుగుల వద్ద ఆలౌటైంది.

ఓపెనర్‌ కుక్‌ (37; 3 ఫోర్లు) సహా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విన్స్‌ (2), కెప్టెన్‌ రూట్‌ (9), డేవిడ్‌ మలాన్‌ (19) ప్రత్యర్థి పేసర్లకు తలవంచారు. టెయిలెండర్‌ ఓవర్టన్‌ (79 బంతుల్లో 41 నాటౌట్‌; 5) కాసేపు ప్రతిఘటించాడు. ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 215 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే ఇంగ్లండ్‌కు ఫాలోఆన్‌ ఇవ్వకుండా పిచ్‌ పరిస్థితుల దృష్ట్యా ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆడింది.  ఆట నిలిచే సమయానికి ఆసీస్‌ 26 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 268 పరుగుల ఆధిక్యంలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement