
భువనేశ్వర్: గోల్ కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడగా నిలవడంతో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆస్ట్రేలియాపై భారత హాకీ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రొ హాకీ లీగ్ సీజన్–2లో భాగంగా శనివారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–1తో పెనాల్టీ షూటౌట్‌లో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. దాంతో శుక్రవారం ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. నిర్ణీత 60 నిమిషాల ఆటలో ఇరు జట్లు కూడా 2–2 గోల్స్‌తో సమంగా నిలిచాయి. భారత తరఫున రూపిందర్ పాల్ సింగ్ (25వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (27వ నిమిషంలో) చెరో గోల్ చేయగా... ఆసీస్ ఆటగాళ్లలో ట్రెంట్ మిట్టన్ (23వ నిమిషంలో), అరాన్ జలేవ్‌స్కీ (46వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. ఫలితంగా మ్యాచ్ షూటౌట్‌కు దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment