
Men's Pro Hockey League:- రూర్కెలా: కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ‘హ్యాట్రిక్’ నమోదు చేయడంతో... ప్రొ హాకీ లీగ్‌లో భారత జట్టు 5–4 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా జట్టును బోల్తా కొట్టించింది. టీమిండియా సారథి హర్మన్‌ప్రీత్ సింగ్ 13, 14, 55వ నిమిషాల్లో పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచగా... జుగ్‌రాజ్ సింగ్ (17వ ని.లో), సెల్వం కార్తీ (25వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు.
ఆస్ట్రేలియా తరఫున జోషువా బెల్ట్‌జ్ (3వ ని.లో), విలోట్ (43వ ని.లో), బెన్ స్టెయినెస్ (53వ ని.లో), టిమ్ హోవర్డ్ (57వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. రెండు జట్లకు పది చొప్పున పెనాల్టీ కార్నర్‌లు రాగా... భారత్ మూడింటిని, ఆసీస్ రెండింటిని గోల్స్‌గా మలిచాయి. సోమవారం జరిగే మరో లీగ్ మ్యాచ్‌లో జర్మనీతో భారత్ ఆడుతుంది.
చదవండి: Virat Kohli 75th Century: కింగ్ ఈజ్ బ్యాక్.. ఆ ఇద్దరు దిగ్గజాల తర్వాత కోహ్లికే సాధ్యమైంది!
Comments
Please login to add a commentAdd a comment