FIH Pro League 2023-24- భువనేశ్వర్: పురుషుల ప్రొ హాకీ లీగ్ టోర్నీలో భారత జట్టు నాలుగో విజయం అందుకుంది. స్పెయిన్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సడెన్‌డెత్ ‘షూటౌట్’లో 8–7తో గెలిచింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి.
భారత్ తరఫున జర్మన్‌ప్రీత్ సింగ్ (1వ ని.లో), అభిషేక్ (35వ ని.లో)... స్పెయిన్ తరఫున జోస్ బస్టెరా (3వ ని.లో), బొర్యా లకెలా (15వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. స్కోర్లు సమమయ్యాక విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘
షూటౌట్’లో తొలి ఐదు ప్రయత్నాల్లో ఇరు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యారు. దాంతో ‘సడెన్‌డెత్’ షూటౌట్‌ను నిర్వహించారు. ‘సడెన్‌డెత్’లో స్పెయిన్ ప్లేయర్ మిరాలెస్ తీసుకున్న మూడో షాట్‌ను భారత గోల్‌కీపర్ శ్రీజేష్ నిలువరించాడు.
ఆ వెంటనే భారత్ తరఫున లలిత్ ఉపాధ్యాయ్ గోల్ చేయడంతో టీమిండియా విజయం ఖరారైంది. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో భారత్ ఐదు మ్యాచ్‌ల ద్వారా 10 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది. రేపు జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడుతుంది.
హైదరాబాద్ బ్లాక్ హాక్స్ బోణీ
చెన్నై: ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు గెలుపు బోణీ కొట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బ్లాక్ హాక్స్ 7–15, 12–15, 15–10, 15–11, 20–18తో ముంబై మెటోర్స్ జట్టును ఓడించింది. తొలి రెండు సెట్‌లు ఓడిపోయిన బ్లాక్ హాక్స్ ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో పుంజుకొని వరుసగా మూడు సెట్‌లు నెగ్గి విజయాన్ని అందుకుంది. భ్లాక్ హాక్స్ విజయంలో అష్మతుల్లా, హేమంత్, లాల్ సుజన్ కీలకపాత్ర పోషించారు.
గుల్‌వీర్ సింగ్‌కు స్వర్ణం
టెహ్రాన్: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్‌ను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. సోమవారం జరిగిన పురుషుల 3000 మీటర్ల రేసులో భారత అథ్లెట్ గుల్‌వీర్ సింగ్ (8ని:07.48 సెకన్లు) పసిడి పతకం గెలిచాడు. మహిళల 3000 మీటర్లలో అంకిత (9ని:26.22 సెకన్లు) రజత పతకం సాధించింది. ఈ పోటీల్లో భారత్‌కు మొత్తం నాలుగు స్వర్ణాలు, ఒక రజతం లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment