
అంట్‌వెర్ప్ (బెల్జియం): డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ అద్భుతంగా రాణించడంతో భారత పురుషుల హాకీ జట్టు 6–1తో స్పెయిన్‌పై ఘనవిజయం సాధించింది. బెల్జియం పర్యటనలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ టీమిండియా... ప్రపంచ ఎనిమిదో ర్యాంకు జట్టును చిత్తుగా ఓడించింది. హర్మన్‌ప్రీత్ 28వ, 32వ నిమిషాల్లో గోల్స్ సాధించగా, మన్‌ప్రీత్ సింగ్ (24వ ని.), నీలకంఠ శర్మ (39వ ని.), మన్‌దీప్ సింగ్ (56వ ని.), రూపిందర్‌పాల్ సింగ్ (59వ ని.) తలా ఒక గోల్ చేశారు. ఆట ఆరంభం నుంచే భారత్ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులకు పదునుపెట్టింది. రెండో క్వార్టర్‌లో గోల్స్ చేయడంలో భారత ఆటగాళ్లు సఫలమయ్యారు. ఆ తర్వాత జోరు పెంచడంతో ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. ఆదివారం మూడో మ్యాచ్ జరుగనుంది.
గెలిపించిన గుర్జీత్ గోల్
మార్లో (ఇంగ్లండ్): ఇంగ్లండ్‌పై ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. శనివారం తొలి మ్యాచ్‌లో 2–1తో మన జట్టు విజయం సాధించింది. మ్యాచ్ మరో 48 క్షణాల్లో ముగుస్తుందనగా గుర్జీత్ కౌర్ (60వ ని.) అద్భుత గోల్‌తో ఫలితాన్ని మార్చింది. 46వ నిమిషంలో ఎమిలీ డెఫ్రాండ్ గోల్‌తో 1–0తో ఇంగ్లండ్ ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే షరి్మలా దేవి గోల్‌తో స్కోరు 1–1తో సమమైంది.
Comments
Please login to add a commentAdd a comment