లంకను ఆదుకున్న కుషాల్ | Kaushal assisted lanka | Sakshi
Sakshi News home page

లంకను ఆదుకున్న కుషాల్

Published Fri, Jul 29 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

లంకను ఆదుకున్న కుషాల్

లంకను ఆదుకున్న కుషాల్

పల్లెకెలె (శ్రీలంక): బ్యాట్స్‌మన్ కుషాల్ మెండిస్ (243 బంతుల్లో 169 నాటౌట్; 20 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ సెంచరీతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో శ్రీలంక కోలుకుంది. గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. ప్రస్తుతం లంక 196 పరుగుల ఆధిక్యంలో ఉంది. మెండిస్‌తో పాటు చండీమల్ (42), ధనుంజయ డి సిల్వా (36) రాణించగా... ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.


6/1 ఓవర్‌ైనె ట్ స్కోరుతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన లంకేయులకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన కరుణరత్నే డకౌట్‌గా వెనుదిరగగా... కౌశల్ సిల్వా (7), మాథ్యుస్ (9) కూడా విఫలమయ్యారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మెండిస్ టెస్టుల్లో తొలి సెంచరీ చేయడంతో పాటు చండీమల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ విరామం తర్వాత డి సిల్వా వికెట్‌ను కోల్పోయిన లంక ... వ ర్షం అంతరాయం కలిగించడంతో 282 పరుగుల వద్ద మూడోరోజు ఆటను ముగించింది. మెండిస్‌తో పాటు పెరీరా (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement