రెండో ఇన్నింగ్స్‌లోనూ ధనంజయ, మెండిస్ సెంచరీలు
సిల్హెట్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక జట్టు విజయం దిశగా పయనిస్తోంది. లంక నిర్దేశించిన 511 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బంగ్లాదేశ్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 119/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 110.4 ఓవర్లలో 418 పరుగులకు ఆలౌటైంది.
తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన ధనంజయ డిసిల్వా (108; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కామిందు మెండిస్ (164; 16 ఫోర్లు, 6 సిక్స్‌లు) అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకాలు బాది చరిత్ర పుటల్లోకి ఎక్కారు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టులో ఇద్దరు బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేయడం ఇది మూడోసారి.
గతంలో 1974లో న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన టెస్టులో ఆ్రస్టేలియా బ్యాటర్లు ఇయాన్ చాపెల్ (145, 121), గ్రెగ్ చాపెల్ (247 నాటౌట్, 133)...2014లో అబుదాబిలో ఆ్రస్టేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లు మిస్బా ఉల్ హక్ (101, 101 నాటౌట్), అజహర్ అలీ (109, 100 నాటౌట్) ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment