2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలే వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిధ్య శ్రీలంక భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (179), వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (140) భారీ శతకాలతో విరుచుకుపడ్డారు. టెస్ట్‌ల్లో కరుణరత్నేకు ఇది 15వ సెంచరీ కాగా.. మెండిస్‌కు 8వది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి దినేశ్ చండీమాల్ (18), ప్రభాత్ జయసూర్య (12) క్రీజ్‌లో ఉన్నారు. నిషాన్ మదుష్క (29), ఏంజెలో మాథ్యూస్ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, కర్టిస్ క్యాంపర్, జార్జ్ డాక్రెల్, బెంజమిన్ వైట్ తలో వికెట్ పడగొట్టారు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా కరుణరత్నే.. శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య, స్టార్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ల రికార్డులను అధిగమించాడు. జయసూర్య, మాథ్యూస్‌లు తమ టెస్ట్ కెరీర్‌లలో 14 టెస్ట్ సెంచరీలు సాధించగా.. తాజాగా కరుణరత్నే వీరిని ఓవర్‌టేక్ చేసి లంక తరఫున అత్యధిక సెంచరీలు (15) చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సంగక్కర (38) తొలి స్థానంలో ఉండగా.. జయవర్ధనే (34), అరవింద డిసిల్వ (20), తిలకరత్నే దిల్షన్ (16), మర్వన్ ఆటపట్టు (16) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment